మీరు చేసేది ప్రభుత్వ, ప్రయివేటు ఉద్యోగమైనా ప్రతి ఒక్కరికీ నెలవారీ జీతాన్ని అందుకునేందుకు వేతన ఖాతా ఉండాలి.ఎక్కువ శాతం కార్పొరేట్ సంస్థలు బ్యాంకు ఖాతా తెరిచేందుకు ప్రయివేటు బ్యాంకులను ఆశ్రయిస్తున్నాయి. మీరు తీసుకునే వేతనం ఆధారంగా మీ ఖాతాకు ఉండే అదనపు సౌకర్యాలు మారుతూ ఉంటాయి. హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ లాంటి ప్రైవేటు బ్యాంకుల్లో వేతన ఖాతాల్లో సైతం కొన్ని రకాలు ఉంటాయి. ఖాతా రకాన్ని బట్టి ఫీచర్లు, సౌకర్యాలు మారతాయి. డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, రుణ సౌకర్యం వంటివి ఇందులో ఉంటాయి.
దాదాపు అన్ని పెద్ద బ్యాంకుల్లో ఫీచర్లన్నీ కాస్త అటుఇటుగా ఒకేలా ఉంటున్నాయి. వేతన ఖాతాలకు సంబంధించి ఉత్తమంగా పరిగణించబడే ఆరింటిని ఇక్కడ చూద్దాం.

1. హెచ్‌డీఎఫ్‌సీ శాలరీ అకౌంట్
హెచ్‌బీఎఫ్‌సీ వేతన ఖాతాకు రూ. 1 లక్ష విలువ చేసే వ్యక్తిగత ప్రమాద బీమా సౌకర్యం ఉంటుంది. ప్రీమియం వేతన ఖాతాకు కనీస నిల్వ అవసరం లేదు. మీ కుటుంబ సభ్యులకు శాలరీ ఫ్యామిలీ అకౌంట్ సైతం అందుబాటులో ఉంది.

2. ఐసీఐసీఐ శాలరీ అకౌంట్
ఐసీఐసీఐ సైతం జీరో బ్యాలెన్స్‌తో శాలరీ అకౌంట్‌ను తెరుస్తోంది. ఈ ఖాతాలకు రూ. 25 వేల వరకూ ఉచిత రెమిటెన్సు (డీడీ,చెక్కు, పే ఆర్డర్స్) సేవలను అందిస్తున్నారు. కార్పొరేట్ వినియోగదారులకు ఎన్‌పీఎస్ సేవలను అందించేందుకు పీఎఫ్ఆర్‌డీఏ వద్ద ఐసీఐసీఐ బ్యాంకు నమోదు చేసుకుని ఉంది. డెబిట్ కార్డు పోతే రూ. 2 లక్షల వరకూ జీరో లయబిలిటీ రక్షణ ఉంది.

3. సిటీ బ్యాంకు
సిటీ బ్యాంకు వేతన ఖాతా ద్వారా మీ శాలరీకి 5 రెట్ల ఓవర్‌డ్రాఫ్ట్ సౌకర్యం మీకు అందుబాటులోకి వస్తుంది. మీకు వచ్చే రివార్డు పాయింట్లను నగదు రూపంలో మార్చుకునే సదుపాయం సైతం ఉంటుంది. మీకు అర్హత ఉంటే వ్యక్తిగత రుణం, గృహ రుణాలకు ఉత్తమ వడ్డీ రేట్లను అందిస్తారు.

4. ఎస్‌బీఐ శాలరీ అకౌంట్
బ్యాంకుతో ఉన్న వ్యాపార సంబంధం ఆధారంగా కార్పొరేట్ సంస్థలకు, వ్యాపార వర్గాల వారికి ఎస్‌బీఐ వేతన ఖాతా ప్రత్యేకమైన ప్యాకేజీలను అందిస్తుంది. గృహ రుణం, ఆటో రుణం, ఎక్స్‌ప్రెస్ క్రెడిట్ లోన్‌లను మంచి వడ్డీ రేటుకు అందుకోవచ్చు.

5. యాక్సిస్ బ్యాంక్ శాలరీ అకౌంట్
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు మాదిరిగానే వేతనం ఆధారంగా యాక్సిస్ బ్యాంకు వివిధ రకాల వేతన ఖాతాలను అందిస్తోంది. ప్రయారిటీ ఖాతాలకు మీ బ్యాంకింగ్ అవసరాలన్నింటికీ ఒక రిలేషన్‌షిప్ మేనేజర్‌ను కేటాయిస్తారు. యాక్సిస్‌బ్యాంకు శాఖలలో అడుగుపెడితే ఖాతా రకం ఆధారంగా మీకు ప్రాముఖ్యతనిస్తారు. ఫోన్ బ్యాంకింగ్ కేంద్రానికి ఫోన్ చేసినా బ్యాంకు అధికారులు స్పందిస్తారు.

6. కొటక్ మహీంద్రా బ్యాంకు
కొటక్ మహీంద్రా బ్యాంకులో ఐఎన్‌జీ వైశ్యా బ్యాంకు కలిసిపోయిన తర్వాత ఆ బ్యాంకుకు దేశవ్యాప్తంగా విస్తృతమైన నెట్ వర్క్ ఏర్పడింది. పొదుపు ఖాతాలో ఉన్న నిల్వకు స్వీప్-ఇన్ సదుపాయాన్ని ఉపయోగించడం ద్వారా అధిక వడ్డీని పొందవచ్చు. కార్డు పోతే రూ. 2 లక్షల వరకూ కార్డు లయబిలిటీ బీమా ఉంటుంది. తక్కువ ప్రాసెసింగ్ రుసుముతో మంచి వడ్డీ రేటులో గృహ, వ్యక్తిగత రుణాలను తీసుకోవచ్చు.


Click it and Unblock the Notifications