5 ఏళ్ల కాలపరిమితి దాటిన పెట్టుబడులను దీర్ఘకాల పెట్టుబడులుగా పరిగణిస్తారు. ఈ రకంగా పెట్టిన పెట్టుబడులను పిల్లల చదువు, వివాహం లేదా పదవీ విరమణ నిధి వంటి వాటి కోసం ఉపయోగించవచ్చు. వేతన ఉద్యోగులు ఆర్థికంగా భద్రత సమకూర్చుకునేందుకు క్రమంగా పెట్టుబడులు పెడుతూ ఉండాలి. పింఛను సెక్యూరిటీ లేని కారణంగా ప్రయివేటు ఉద్యోగులు మరింత ఎక్కువగా పొదుపు చేసి పెట్టుబడులు పెట్టాల్సి ఉంటుంది. అయితే ఈ పెట్టుబడులు పెట్టేటప్పుడు దాని గురించి సమగ్రంగా విచారించడమే కాకుండా అందులో నష్టభయాల గురించి అవగాహన కలిగి ఉండాలి.
పెట్టుబడి వృద్ది చెందేందుకు తక్కువ వ్యవధి ఉన్న కారణంగా స్వల్ప కాల పెట్టుబడుల మార్గం కొంచెం నష్టభయం ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. ఆర్థిక ప్రణాళిక నిపుణులు చెప్పేదాని ప్రకారం పెట్టుబడులను ఒక రంగంలో లేదా ఒకే ఆర్థిక సాధనంలో ఉంచకూడదు. ఒక్కొక్క వ్యక్తి ఉద్యోగం, ఆదాయం, కుటుంబ వాతావరణాన్ని బట్టి వారి ప్రణాళికలు వేరువేరుగా ఉంటాయి. నష్టభయం, కుటుంబ వ్యయం ఆధారంగా పెట్టుబడులు పెడుతూ వెళ్లాలి.
అయితే పెట్టుబడిదారులు అన్ని రకాల మార్గాలను అన్వేషించాలి. నష్టభయం తక్కువ ఉండేలా రాబడులను పెంచుకునేందుకు చూడాలి. ఆ కోవకు చెందిన 8 దీర్ఘకాల పెట్టుబడులను ఇక్కడ చూద్దాం.

స్థిరాస్తి పెట్టుబడులు
స్థిరాస్తిలో పెట్టే పెట్టుబడులు సాధారణంగా దీర్ఘకాలంలో మంచి రాబడులను ఇస్తాయి. ఇల్లు, స్థలం కొనుగోలు చేయడం మూలంగా భవిష్యత్తులో ఎక్కువ ధరకూ అమ్మినా ఆదాయం వస్తుంది. లేదా లీజు, అద్దె రూపంలో క్రమ ఆదాయాన్ని రాబట్టుకోవచ్చు. ఒకవేళ గృహ రుణం తీసుకుని ఇల్లు కట్టుకునే ఆలోచన ఉంటే, గృహ రుణం దాని వడ్డీలను చూపడం ద్వారా ఆదాయపు పన్ను నుంచి తప్పించుకోవచ్చు.

ఈక్విటీ పెట్టుబడులు
ఈక్విటీ పెట్టుబడులు అనగానే ఎక్కువ మంది రిస్క్ అని భావిస్తారు. దీర్ఘకాలంలో మంచి రాబడులను ఆశిస్తూ ఉన్నట్లయితే ఈక్విటీ పెట్టుబడులను మంచి పెట్టుబడి మార్గంగా ఎంచుకోవచ్చు. స్టాక్ మార్కెట్ దీర్ఘకాలంలో మంచి రాబడులను ఇస్తూనే ఉండేందుకు అవకాశాలు ఎక్కువ. రిస్క్‌ను తగ్గించుకోవాలనుకుంటే బ్లూచిప్ స్టాక్స్‌ను కొనుగోలు చేయవచ్చు లేదా రిస్క్ తక్కువ ఉండే రంగాన్ని ఎంపిక చేసుకోవాలి.

మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు
నష్టభయం, రాబడులను దృష్టిలో పెట్టుకుని రకరకాల మ్యూచువల్ ఫండ్లలోంచి మనకు సరిపోయే వాటిని ఎంచుకోవచ్చు. మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడులు పెట్టేందుకు ఉత్తమ మార్గం సిప్(సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్). ప్రతి నెలా చిన్న మొత్తాల్లో పెట్టుబడులు పెడుతూ దీర్ఘకాలంలో పెద్దమొత్తాల్లో పొదుపు చేసుకోవచ్చు. దీర్ఘకాలంలో మ్యూచువల్ ఫండ్స్ మంచి రాబడులనే అందిస్తున్నట్లుగా ఆర్థిక ప్రణాళిక నిపుణులు చెపుతూ ఉంటారు.

బాండ్లలో పెట్టుబడులు
వేతన జీవులు దీర్ఘకాల పెట్టుబడి పెట్టాలంటే మరో మార్గం బాండ్లు. అధిక పన్ను పరిధిలో ఉండేవారు మంచి రాబడులు పొందాలంటే బ్యాంకు డిపాజిట్ల కంటే బాండ్లు మంచి మార్గం.

పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్
భారత్‌లో బాగా ఆదరణ పొందుతున్న దీర్ఘకాల పెట్టుబడి మార్గాల్లో పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ మరొకటి. ఇక్కడ పెట్టుబడి ద్వారా వచ్చే రాబడులకు పన్ను ఉండదు కాబట్టి ఉద్యోగులకు మంచి ప్రయోజనకరంగా ఉంటాయి.

బంగారంలో పెట్టుబడులు
అప్పుడప్పుడు బంగారం ధరలు తగ్గుతూ, పెరుగుతూ ఉండొచ్చు. అయితే పెట్టుబడుల వైవిధ్యీకరణ కోసం బంగారం మరో ఉత్తమ మార్గం. కొంచెం పెట్టుబడిని బంగారంలో ఉంచడం తప్పేమీ కాదు. అయితే బంగారంలో పెట్టుబడి పెట్టేందుకు భౌతిక రూపంలోనే ఉంచుకోనక్కర్లేదు. గోల్డ్ ఈటీఫ్‌లు, బంగారు కాయిన్లు, బంగారు బిస్కెట్లు, బంగారు బాండ్లను ఆశ్రయించవచ్చు.

ఐపీవోల్లో పెట్టుబడులు
గతేడాది కాలంగా ఐపీవోల్లో పెట్టుబడిన పెట్టుబడులు మంచిగా రాణిస్తున్నాయి. సరైన రాబడులు రావాలంటే మంచి కంపెనీల్లో పెట్టుబడులు పెట్టేలా చూసుకోవాలి.

యులిప్స్
బీమా, పెట్టుబడి కలగలిపి ఉన్నందున ఇదివరకే సాధారణ జీవిత బీమా ఉన్న వారు సైతం యునిట్ లింక్‌డ్ ఇన్సూరెన్స్ ప్లాన్స్(యులిప్) వైపు చూడటం కూడా మంచిదే. ఈక్విటీలు, డెట్‌ల్లో యులిప్‌లు పెట్టుబడులు పెడుతూ ఉంటాయి కనుక మార్కెట్ ఆధారంగా పెట్టుబడులను సవరిస్తూ ఉంటారు. దీంతో దీర్ఘకాలంలో మంచి రాబడులకే అవకాశం ఉంటుంది. అయితే స్వల్ప కాలం పెట్టుబడులు పెట్టాలనుకునేవారికి యులిప్స్ సూచనీయం కాదు.

ముగింపు
ఈ ఆర్థిక సాధనాలన్నీ ముందు సంవత్సరాల్లో మంచి రాబడులనే ఇచ్చినప్పటికీ భవిష్యత్తులో ఎలా ఉంటాయనేది మార్కెట్లు ఎలా స్పందిస్తాయనే దానిపైన ఆధారపడి ఉంటుంది. ఒక రకమైన పెట్టుబడిలో ఒడిదుడుకులు ఉన్నప్పటికీ పోర్ట్‌ఫోలియో సమతుల్యంగా ఉండేలా చూసుకోవాలి.
More From GoodReturns

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

ప్రపంచం ముప్పు ముంగిట్లో ఉంది.. ఈ మూడు ఆస్తులు తప్ప మిమ్మల్ని ఏవీ కాపాడలేవంటున్న కియోసాకి..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?



Click it and Unblock the Notifications