నెల‌వారీ వ‌డ్డీకి మంచి ఫిక్స్‌డ్ డిపాజిట్లు

చాలా మంది పెట్టుబ‌డిదార్లు నెల‌వారీ ఆదాయం వ‌చ్చేందుకు మొగ్గుచూపుతారు. ప‌ద‌వీ విర‌మ‌ణ చేసిన వారు ఈ కోవ‌లో ఎక్కువ‌గా ఉంటారు. అయితే నెల‌వారీ ఉత్త‌మ వ‌డ్డీ రేట్లు అందించే మంచి ఫిక్స్‌డ్ డిపాజిట్ల కోసం అంద‌రూ వెతుకుతుంటారు.
నెల‌వారీ ఫిక్స్‌డ్ డిపాజిట్ల కోసం చూసేట‌ప్పుడు వాటిపై వ‌చ్చే వ‌డ్డీకి ఒక ప‌రిమితి త‌ర్వాత ప‌న్ను ఉంటుంద‌ని గుర్తుంచుకోవాలి. ఇక్క‌డ నెల‌వారీ ఆదాయం వ‌చ్చే మ్యూచువ‌ల్ ఫండ్ ప‌థ‌కాల గురించి ఇవ్వ‌ట్లేదు. సూచ‌న‌ప్రాయంగా మంత్లీ ఇన్‌క‌మ్ ఫిక్స్‌డ్ డిపాజిట్ల గురించి ఇస్తున్నాం.
కంపెనీ ఫిక్స్‌డ్ డిపాజిట్ల విషయంలో వ‌డ్డీ ఆదాయం రూ. 5 వేల‌కు మించితే టీడీఎస్ మిన‌హాయిస్తారు. బ్యాంకు డిపాజిట్ల‌కు వ‌చ్చే వ‌డ్డీ రూ. 10 వేలు మించిన‌ప్పుడే టీడీఎస్ మిన‌హాయిస్తారు.
నెల‌వారీ మంచి ఆదాయాన్నిచ్చే ఉత్త‌మ ఫిక్స్‌డ్ డిపాజిట్ల గురించి ఇక్క‌డ చూడండి.

1. డీహెచ్ఎఫ్ఎల్ ఆశ్ర‌య్ ఫిక్స్‌డ్ డిపాజిట్లు

1. డీహెచ్ఎఫ్ఎల్ ఆశ్ర‌య్ ఫిక్స్‌డ్ డిపాజిట్లు

12 నెల‌ల ఫిక్స్‌డ్ డిపాజిట్‌కు డీహెచ్ఎఫ్ఎల్ ఆశ్ర‌య్ 8.10 శాతం వ‌డ్డీ రేటును అందిస్తోంది.

14 నెల‌ల నుంచి 120 నెల‌ల పాటు ఉండే డిపాజిట్ల విష‌యంలో వ‌డ్డీ 8.35 శాతంగా ఉంటోది.

బ్యాంకుల‌తో పోలిస్తే ఇవి ఉత్త‌మ వ‌డ్డీ రేట్లు.

 2. బ‌జాజ్ ఫిన్‌స‌ర్వ్‌

2. బ‌జాజ్ ఫిన్‌స‌ర్వ్‌

నెల‌వారీ మంచి వ‌డ్డీ అందుకోవాల‌ని చూస్తుంటే బ‌జాజ్ ఫిన్ స‌ర్వ్ సైతం ఆ కోవ‌లోకి వ‌స్తుంది. 12-17 నెల‌ల ఫిక్స్‌డ్ డిపాజిట్ల‌కు వ‌డ్డీ రేటు 8.23శాతం ఉంటుంది. 18-60 నెల‌ల మ‌ధ్య ఉండే డిపాజిట్ల‌కు వ‌డ్డీ రేటు 8.32 శాతం వ‌స్తుంది. వ‌డ్డీని నెల‌వారీ చెల్లిస్తారు.

ఇవి ఏఏఏ రేటెడ్ డిపాజిట్లు కాబ‌ట్టి సాపేక్షికంగా సుర‌క్షిత‌మైన‌వి, నెల‌వారీ ఆదాయానికి మంచి ఎఫ్‌డీలు.

 3. శ్రీ‌రామ్ ట్రాన్స్‌పోర్ట్ ఫైనాన్స్‌

3. శ్రీ‌రామ్ ట్రాన్స్‌పోర్ట్ ఫైనాన్స్‌

శ్రీ‌రామ్ ట్రాన్స్‌పోర్ట్ 7.95 శాతం వ‌డ్డీ రేటును అందిస్తోంది. నెల‌వారీ ఆదాయం రూపేణా 12 నెల‌ల డిపాజిట్ల‌కు ఈ వ‌డ్డీ రేటు ఉంది. 2, 3 ఏళ్ల డిపాజిట్ల‌కు వ‌డ్డీ రేటు 8.19 శాతం ఉంది. ఐదేళ్ల డిపాజిట్ల‌కు వ‌డ్డీ రేటు 8.42 శాతం వ‌స్తుంది.

 4. పోస్టాఫీసు నెల‌వారీ ఆదాయ ప‌థకం

4. పోస్టాఫీసు నెల‌వారీ ఆదాయ ప‌థకం

నెల‌వారీ ఆదాయానికి పోస్టాఫీసు ఫిక్స్‌డ్ డిపాజిట్ మంచి మార్గం. హెచ్‌డీఎఫ్‌సీ నెల‌వారీ ఆదాయ ఫిక్స్‌డ్ డిపాజిట్ల కంటే కొంచెం త‌క్కువ వ‌డ్డీ రేటు వీటి ద్వారా వ‌స్తుంది.

ప్ర‌స్తుతం వ‌డ్డీ రేటు 7.8 శాతంగా ఉంది. పోస్టాఫీసు డిపాజిట్ల‌కు భార‌త ప్ర‌భుత్వం గ్యారెంటీ ఉండే అవ‌కాశం ఉన్నందున ఇవి సుర‌క్షిత‌మైన‌వి. నెల‌వారీ ఆదాయం కోరుకునేవారికి ఇవి ఉత్త‌మ ఫిక్స్‌డ్ డిపాజిట్లు.

 5. ఫెడ‌ర‌ల్ బ్యాంక్ నెల‌వారీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు

5. ఫెడ‌ర‌ల్ బ్యాంక్ నెల‌వారీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు

ఫిక్స్‌డ్ డిపాజిట్ల‌పై నెలవారీ ఆదాయాన్నిందించే కోవ‌లో ఉన్న మ‌రో ఫిక్స్‌డ్ డిపాజిట్ ఫెడ‌ర‌ల్ బ్యాంక్‌.

వ‌డ్డీ రేట్లు 7.25 నుంచి 7.50 మ‌ధ్య ఉండొచ్చ‌ని అంచ‌నా. అయితే స‌రైన వ‌డ్డీ రేట్ల కోసం ఫెడ‌ర‌ల్ బ్యాంకును సంప్ర‌దించండి. ఎందుకంటే కాల‌ప‌రిమితి బ‌ట్టి వడ్డీ రేట్లు మారుతుంటాయి.

6. యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

6. యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

ఫెడ‌ర‌ల్ బ్యాంకు లాగే యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సైతం నెల‌వారీ వ‌డ్డీని అందించే ఫిక్స్‌డ్ డిపాజిట్ల‌ను అందుబాటులో ఉంచింది. ఈ బ్యాంకు వ‌డ్డీ రేటు పైన తెలిపిన బ్యాంకింగేత‌ర ఆర్థిక సంస్థ‌ల వ‌డ్డీ రేటు కంటే త‌క్కువ ఉండొచ్చు. దాదాపు 7.0 నుంచి 7.25 శాతం మ‌ధ్య ఉండొచ్చు. అధిక వివ‌రాల కోసం బ్యాంకు శాఖ‌ను సంప్ర‌దించండి

7. యుకో బ్యాంకు

7. యుకో బ్యాంకు

యుకో బ్యాంకు సైతం మంత్లీ ఇన్‌క‌మ్ ప్లాన్‌ను అందిస్తోంది. 2013 డిసెంబ‌రులో ఈ ప‌థ‌కాన్ని ప్ర‌వేశ‌పెట్టింది. డిపాజిట్ కాల‌ప‌రిమితి 5 సంవ‌త్స‌రాలు. క‌నీసం రూ. 50 వేలు, గ‌రిష్టంగా రూ. కోటి వ‌ర‌కూ డిపాజిట్ చేయ‌వ‌చ్చు.

సాధ్య‌మైనంత వ‌ర‌కూ మేము ఏఏఏ రేటింగ్ ఉన్న డిపాజిట్ల‌ను గురించి ఇచ్చేందుకు ప్ర‌య‌త్నిస్తున్నాం. అన్నీ ఒక‌టికి రెండుసార్లు చూసుకుని డిపాజిట్ చేసేందుకు చూడాలి. ఒక‌సారి డిపాజిట్ చేస్తే కాల‌పరిమితి లోపు వెన‌క్కి తీయాలంటే 1 నుంచి 2 శాతం వ‌డ్డీని కోల్పోవాల్సి వ‌స్తుంది. అందుకే జాగ్ర‌త్త‌గా డిపాజిట్ చేయాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+