ప్రకటనల ఉద్దేశం మార్కెటింగ్‌తో పాటు, ఉత్పత్తి గురించి ప్రచారం చేసుకోవడం. అయితే నేటి ప్రకటనలు పోటీ వల్ల అలా ఉండటం లేదు. దీంతో వాటిపై నిత్యం ఫిర్యాదులు అందుతున్నాయి.అడ్వర్టైజింగ్ స్టాండర్డ్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా పతంజలితో పాటు హెచ్‌యూఎల్, పెప్సికో, బ్రిటానియా, పిజ్జా హట్, అమెజాన్, ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్, వోల్టాస్, యాక్సిస్ బ్యాంకు, ఎయిర్‌ఏసియా, ఫ్లిప్‌కార్ట్ వంటి పలు సంస్థలను తప్పుపట్టింది. ఈ సంస్థలు ఇచ్చే ప్రకటనలు వినియోగదారులను తప్పుదారి పట్టించేలా ఉన్నాయని కౌన్సిల్ అభిప్రాయపడింది. మే నెలలో వచ్చిన 155 ఫిర్యాదుల్లో 109 కేసుల్లో కంపెనీలను తప్పు పట్టినట్లు ఒక ప్రకటనలో తెలిపారు.
తప్పు పట్టిన జాబితాలోని పలు ప్రకటను ఇక్కడ చూడండి

పతంజలి
రాందేవ్ బాబా ఆధ్వర్యంలోని పతంజలిపై 10 ఫిర్యాదులను కంపెనీ తప్పు పట్టింది. ఇందులో విచారించదగ్గ విషయం ఉన్నట్లు తెలుస్తోంది. జీరా బిస్కెట్, కచ్చి ఘనీ మస్టర్డ్ ఆయిల్, కేష్ కాంతి, దంత్‌కాంతి వంటి ఉత్పత్తుల ప్రకటనలపై ఫిర్యాదులు అందాయి. గతంలో మార్చి, ఏప్రిల్‌నెలలో సైతం పతంజలి ప్రకటనలను ఆస్కీ తప్పుపట్టింది.

హెచ్‌యూఎల్, పెప్సీ
పెప్సీకోకు సంబంధించి 'హర్ బాటిల్ పర్ పేటీఎమ్ క్యాష్ పక్కా' అని ఇచ్చిన ప్రకటన వినియోగదారులను పెప్సీ బాటిళ్లను కొనేలా ప్రేరేపిస్తున్నట్లు, ఇది వినియోగదారుల ప్రయోజనాలకు విరుద్దంగా ఉన్నట్లు ఆస్కీ వినియోగదారుల ఫిర్యాదుల సెల్ అభిప్రాయపడింది. హెచ్‌యూఎల్ సంస్థకు సంబంధించి సన్‌సిల్క్ షాంపూ యాడ్ తప్పుగా ఉన్నట్లు ఆస్కీ గుర్తించింది.

బ్రిటానియా ఇండస్ట్రీస్
హోల్ వీట్ బ్రెడ్‌కు సంబంధించి బ్రిటానియా ఇస్తున్న '100 శాతం వీట్ బ్రెడ్' యాడ్ సరిగా లేదన్నట్లు ఆస్కీ వెల్లడించినట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఆ ఉత్పత్తిలో ఉన్న గోదుమ ఉత్పత్తుల శాతం 50 నుంచి 65 శాతం వరకేనట.

పిజ్జా హట్
పిజ్జా హట్ ఇస్తున్న ప్రకటన సైతం నిబంధనలను పాటించేలా లేదని ఆస్కీ మందలించింది. 'ఎనీ పిజ్జా ఎనీ సైజ్ @199' ప్రకటన ప్రాథమిక నిబంధలను ఉల్లంఘించడం వల్ల తప్పుదారిపట్టించే విదంగా ఉందని ఆస్కీ తెలిపింది.

టాటా గ్రూప్ వోల్టాస్
'టూ ఎయిర్ కండిషనర్స్ ఎట్ ది కాస్ట్ ఆఫ్ వన్' అని టాటా గ్రూప్ సంస్థ వోల్టాస్ ఇస్తున్న ప్రకటన డిస్‌క్లెమీయర్స్‌లో ఇచ్చిన విధంగా ఉన్నదానికి విరుద్దంగా ఉన్నట్లు గుర్తించారు.

ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్
ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్ చెప్పుకుంటున్న విధంగా 'ది ఏసీ దట్ సేవ్‌స్ ఎవ్రీ డే. ఎల్‌జీ-నం. 1 ఎయిర్ కండిషనర్ స , మస్కిటో అవే వంటివి వాస్తవ నిరూపణలకు నిలబడేవిగా లేవని ఆస్కీ చెప్పింది.

యాక్సిస్ బ్యాంక్
యాక్సిస్ బ్యాంకుకు అందిస్తున్న అన్ని సేవల్లో కొన్ని షరతులతో కూడుకుని ఉన్నందున, అది చెప్పుకుంటున్న 'కంప్లీట్ బ్యాంకింగ్ సొల్యూషన్స్' ప్రకటన తప్పేనని ఆస్కీ వెల్లడించింది.

ఎయిర్‌ఏసియా
చెన్నై నుంచి ఆస్ట్రేలియా విమాన ప్రయాణం రూ. 4999 నుంచి మొదలవుతుందన్న ఈ సంస్థ ప్రకటన తప్పుగా ఉన్నట్లు ఆస్కీ ప్రకటన తెలిపింది.


Click it and Unblock the Notifications