జీఎస్టీ అమలు చేయడం వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏటా రూ. 4700 కోట్ల నష్టం వాటిల్లుతుందని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు మీడియాకు వెల్లడించారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం రూ. 23,500 కోట్లను నష్టపరిహారం కింద చెల్లించాల్సి ఉంటుందని ఆయన తెలిపారు. జీఎస్టీ వల్ల రాష్ట్ర ప్రభుత్వాలకు జరిగే అన్యాయానికి కేంద్రం బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు.
జీఎస్టీ కౌన్సిల్ విషయమై కేంద్రం గురించి పలు వ్యాఖ్యలు చేశారు. జీఎస్టీ కౌన్సిల్లో కేంద్ర ఆర్థిక మంత్రి ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వాలకు సభ్యత్వం ఉన్నప్పటికీ కేంద్ర ఆధిపత్యాన్ని వీటో చేయడానికి ఉండదని యనమల అన్నారు. విభజన నేపథ్యంలో రాష్ట్రం గురించి కేంద్రం పట్టించుకోవాల్సి ఉందని, జీఎస్టీ అమలుకు సంబంధించి ఎటువంటి సమస్యలు ఉన్నా కేంద్రం వాటిని తీర్చాలని కోరారు.

అయితే రాజ్యాంగ సవరణ బిల్లును ఆయన స్వాగతించారు. దేశ విశాల ప్రయోజనాల కోసం తెలుగుదేశం పార్టీతో పాటు చాలా పార్టీలు దానికి మద్దతుగా నిలిచాయన్నారు. టీడీపీ ఎప్పుడూ పన్ను సంస్కరణకు మద్దతు తెలిపిందని చెప్పుకొచ్చారు. ఏకరీతి పన్ను వ్యవస్థ కేంద్రం, రాష్ట్రాలకు మంచిదేనన్నారు. జీఎస్టీ అమలు వల్ల వస్తువులపై పన్ను తగ్గి, సేవలపై పన్ను పెరగగలదని ఆయన భావిస్తున్నట్లు చెప్పారు.
More From GoodReturns

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

కోమాలో ఇరాన్ అధినేత.. కోమ్‌లోని రహస్య ప్రాంతంలో అత్యవసర చికిత్స.. టెహ్రాన్‌లో అసలేం జరుగుతోంది..

అమెరికా అధ్యక్ష రేసులో తెలుగింటి అల్లుడు.. ట్రంప్ మీద 25వ సవరణ ప్రయోగిస్తారా.. సాధ్యాసాధ్యాలు ఎలా ఉన్నాయంటే..

బెంగళూరులో తీవ్రమైన ఎల్పీజీ సంక్షోభం..సగం గ్యాస్ స్టేషన్లు మూత..ఆటో డ్రైవర్లు విలవిల..



Click it and Unblock the Notifications