జీఎస్టీ స‌మ‌గ్ర అవ‌గాహ‌న‌

జీఎస్‌టీ అంటే ఏమిటి?

దేశంలో త‌యారయ్యే వివిధ వ‌స్తువుల అమ్మ‌కాలు, వినియోగం, సేవ‌లపైన విధించే ఏక‌రీతి ప‌న్ను.
ఇది ఒక ప‌రోక్ష ప‌న్ను. తుది వినియోగం జ‌రిగే చోట ఈ ప‌న్నును మోపుతారు.

ఎలా ప‌నిచేస్తుంది?

ప్ర‌తి ద‌శ‌లో విలువ జ‌త‌యిన ప్ర‌తిసారి వ్యాపార‌స్థులు ఇన్‌కపుట్ ట్యాక్స్ క్రెడిట్‌ను కోర‌వ‌చ్చు. దీని వ‌ల్ల అంతిమంగా వినియోగ‌దారులు ప‌రోక్షంగా చెల్లించే ప‌న్ను మాత్ర‌మే వ‌స్తువుపై ప‌డుతుంది.

ప్ర‌యోజ‌నాలు:

ప్ర‌భుత్వానికి స‌క్ర‌మంగా ప‌న్ను వ‌సూళ్ల‌కు జీఎస్టీ తోడ్ప‌డ‌గ‌ల‌దు. పార‌ద‌ర్శ‌క‌త‌కు తావుంటుంది.

వినియోగ‌దారుకేంటి?

ప్ర‌స్తుతం వ‌స్తువు వివిధ రాష్ట్రాలను దాటి వ‌స్తూ ఉంటే ప్ర‌తి రాష్ట్రంలో అంత‌రాష్ట్ర ప‌న్ను విధిస్తున్నారు. అన్నింటినీ ఒకే ప‌రిధిలోకి తెచ్చి ఒకేసారి ప‌న్ను విధించ‌డం జీఎస్‌టీలో ఉన్న ప్ర‌త్యేక‌త‌. దీంతో ఉత్త‌మ ధ‌ర‌కు వ‌స్తువు వినియోగ‌దారు చేతికి అందుతుంది. జీఎస్‌టీ వ‌ల్ల త‌యారీదారు పొందుతున్న ప్ర‌యోజ‌నాల‌ను వినియోగదారుల‌కు బ‌ద‌లాయించాల‌నుకున్న‌ప్పుడు మాత్ర‌మే ఇలా జ‌రిగేందుకు అవ‌కాశం ఉంది.

జీఎస్టీ స‌మ‌గ్ర అవ‌గాహ‌న‌

నిర్వ‌హ‌ణ తీరు:

వ‌స్తువు విలువ‌ను బ‌ట్టి, స‌ర‌ఫరా జ‌రిగే చోట ప‌న్ను వేస్తారు. దీన్ని కేంద్రం, రాష్ట్ర ప్ర‌భుత్వాలు వెసులుబాటు ఆధారంగా వ‌సూలు చేస్తాయి.

జీఎస్‌టీఎన్‌

రాష్ట్ర, కేంద్ర ప్ర‌భుత్వాలు సంయుక్తంగా ఏర్పాటు చేసిన లాభ‌ర‌హిత సంస్థ జీఎస్‌టీఎన్‌. ఇన్ఫోసిస్ దీనికి సాప్ట్‌వేర్‌ను అభివృద్ది చేస్తోంది. దీన్ని ఉప‌యోగించి వ్యాపారులు ప‌న్ను క‌ట్ట‌వ‌చ్చు.

ఆర్థిక వ్య‌వ‌స్థ‌పై ప్ర‌భావం

జీడీపీ 2 శాతం పెర‌గొచ్చ‌ని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అంటున్నారు. విశ్లేష‌కులు మాత్రం 0.7 నుంచి 1 శాతం వ‌ర‌కూ ఆర్థిక‌వ్య‌వ‌స్థ ప్ర‌యోజ‌నం పొంద‌గ‌ల‌ద‌ని చెబుతున్నారు.

ద్ర‌వ్యోల్బ‌ణం సంగ‌తేంటి?

స్వ‌ల్ప‌కాంలో ధ‌ర‌ల్లో పెరుగుద‌ల సంభ‌వించ‌వ‌చ్చు. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌, కెనడా దేశాల్లో జీఎస్‌టీ అమ‌లు త‌ర్వాత ఒక‌సారి ద్ర‌వ్యోల్బ‌ణం పెరిగింద‌ని సిటిగ్రూప్ ఆర్థిక‌వేత్త‌ల నివేద‌న‌.
అయితే ప్ర‌ధాన మంత్రి స‌ల‌హాదార్లు మాత్రం జీఎస్‌టీని 18 శాతం ద‌గ్గ‌ర ఉంచితే ద్ర‌వ్యోల్బ‌ణంపై ఈ ప్ర‌భావం అంత‌గా ఉండ‌క‌పోవ‌చ్చంటున్నారు. ఒక‌వేళ అది 22% ఉంటే ద్ర‌వ్యోల్బ‌ణం 0.3 నుంచి 0.7 శాతం వ‌ర‌కూ పెర‌గొచ్చు.

జీఎస్‌టీ మోడ‌ల్‌:

జీఎస్‌టీ మూడు విధాలుగా అమ‌లు కావొచ్చ‌ని భావిస్తున్నారు.
స్టేట్ జీఎస్‌టీ- రాష్ట్ర ప్ర‌భుత్వాలు వ‌సూలు చేస్తాయి
సెంట్ర‌ల్ జీఎస్‌టీ- కేంద్రం వ‌సూలు చేస్తుంది
ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ-కేంద్రం వ‌సూలు చేస్తుంది. (ఒక రాష్ట్రం నుంచి మ‌రో రాష్ట్రం మ‌ధ్య జ‌రిగే లావాదేవీల‌పై)

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+