ఒకపక్క ప్రభుత్వోద్యోగులకు కేంద్రం 7వ వేతన సవరణ కమీషన్ సూచనలను అమలు చేసిన నేపథ్యంలో దాన్ని క్యాష్ చేసుకునే పనిలో ఎస్‌బీఐ ఉంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసేవారు, రక్షణ రంగంలో పనిచేస్తున్న ఉద్యోగుల కోసం దీర్ఘకాల రుణ పథకాన్ని ఎస్‌బీఐ తీసుకొచ్చింది. ప్రభుత్వ ఉద్యోగుల కోసం 'ప్రివిలైజ్ హోం లోన్' రక్షణ రంగ ఉద్యోగుల కోసం 'శౌర్య హోం లోన్' పథకాలను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రవేశపెట్టింది.
"ప్రభుత్వ ఉద్యోగులు 75 ఏళ్ల వయసు వరకూ తమ రుణాలను తీర్చేందుకు వీలుంటుంది. ప్రస్తుతం ఉన్న రుణాల్లో ఇది 70 ఏళ్లుగా ఉంది" అని బ్యాంకు ఒక ప్రకటనలో తెలిపింది. ఈ రెండు గృహ రుణ పథకాల ద్వారా రుణం పొందిన వారికి 5 బేసిస్ పాయింట్ల మేర రాయితీ ఉంటుంది. ఒక బేసిస్ పాయింట్ అంటే 100 శాతం పాయింట్లలో 1 శాతానికి సమానం. అంతే కాకుండా ప్రాసెసింగ్ ఫీజు ఉండదని సైతం బ్యాంకు తెలియజేసింది. ఇతర బ్యాంకుల్లో రుణాలు తీసుకున్న వారు సైతం తమ రుణాలను స్విచ్ఓవర్ చేసుకోవచ్చని బ్యాంకు చెప్పుకొచ్చింది.
పదవీ విరమణ తర్వాత ఈ కొత్త పథకాల ద్వారా రుణ భారాన్ని ఈఎమ్ఐల సర్వీసింగ్ ద్వారా తగ్గించుకోవచ్చని ప్రకటించింది. అంటే ఈఎమ్ఐలను పదవీ విరమణకు ముందు ఎక్కువ చెల్లించేలా తర్వాత కొంచెం తక్కువ ఉండేలా మార్పు చేస్తారు.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications