ఫిక్స్‌డ్ డిపాజిట్లు సాధారణ బ్యాంకు ఖాతా కంటే ఎక్కువ వడ్డీని అందిస్తాయి. పెట్టుబడులపై ఎక్కువ రిస్క్ తీసుకులేని వారికి సహేతుకమైన వడ్డీ రావాలంటే ఫిక్స్‌డ్ డిపాజిట్లు మంచి మార్గం. కంపెనీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు బ్యాంకు డిపాజిట్లతో పోలిస్తే కాస్త నష్టభయం అధికంగా కలిగినవి. ఇక్కడ కంపెనీ ఫిక్స్‌డ్ డిపాజిట్లతో సహా కొన్ని ఉత్తమ ఫిక్స్‌డ్ డిపాజిట్ల వివరాలను ఇస్తున్నాం. అలాంటి 7 ఎఫ్‌డీలను ఇక్కడ చూడండి.

దీవాన్ హౌసింగ్
దీవాన్ హౌసింగ్ 9 శాతం వరకూ వడ్డీని అందిస్తోంది.కేర్ అండ్ బీడబ్ల్యాఆర్ ఈ కంపెనీ ఫిక్స్‌డ్ డిపాజిట్‌కు ఏఏఏ రేటింగ్ ఇచ్చాయి. అంటే ఇవి సురక్షితమైనవని అర్థం. 40 నెలల డిపాజిట్లకు 8.90 శాతం వడ్డీని చెల్లిస్తున్నారు. మిగిలిన కాలపరిమితి డిపాజిట్లకు 8.75 శాతం వడ్డీ అందిస్తారు. రూ. 50 లక్షల పైబడిన ఫిక్స్‌డ్ డిపాజిట్లకు 9 శాతం వరకూ వడ్డీ రేట్లు ఉన్నాయి.

బజాజ్ ఫైనాన్స్
బజాజ్ ఫైనాన్స్ క్యుములేటివ్ ఫిక్స్‌డ్ డిపాజిట్లకు 18 నెలల నుంచి 60 నెలల కాలానికి 8.65 శాతం వడ్డీ వస్తుంది. బ్యాంకులు గరిష్టంగా 7.50 శాతం వరకూ వడ్డీని అందిస్తున్నాయి.
డిపాజిట్లకు ఏఏఏ రేటింగ్ ఉండటం మూలంగా ఇవి సురక్షితమైనవనే చెప్పవచ్చు. సీనియర్ సిటిజన్స్‌కు అదనంగా 0.25 శాతంతో మొత్తం దాదాపు 9 శాతం వరకూ వడ్డీ వచ్చే అవకాశం ఉంది.

మహీంద్రా ఫైనాన్స్
మహీంద్రా ఫైనాన్స్ 8.45 శాతం వడ్డీని ఆఫర్ చేస్తోంది. డిపాజిట్లకు ఏఏఏ రేటింగ్ ఉండటం మూలంగా సురక్షితమైన ఎఫ్‌డీల కోవలోకి ఇవి వస్తాయి. చక్రవడ్డీని పరిగణనలోకి తీసుకుంటే 60 నెలల డిపాజిట్లకు గరిష్టంగా 10 శాతం వరకూ రాబడి వస్తుంది. రూ. 5 వేల డిపాజిట్‌పై 5 ఏళ్లలో రూ. 7501 వరకూ వస్తుంది.

హెచ్‌డీఎఫ్‌సీ డిపాజిట్లు
22 నెలల డిపాజిట్‌కు హెచ్‌డీఎఫ్‌సీ 8.30 శాతం వడ్డీని ఇస్తోంది. 44 నెలల డిపాజిట్లపై శాతం 8.30 శాతం వడ్డీనే ఆఫర్ చేస్తున్నారు. ఇది బ్యాంకుల కంటే కాస్త అధికమే. ఈ డిపాజిట్ల రేటింగ్ ఏఏఏగా ఉంది. త్రైమాసిక వడ్డీ ప్లాన్లలో 8.05 శాతం వడ్డీ వరకూ మీరు పొందుతారు.

ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్
క్యుములేటివ్ డిపాజిట్ పథకం కింద మీరు 8.25 శాతం వడ్డీని పొందగలరు. 5 ఏళ్ల డిపాజిట్లకు ఇంకాస్త ఎక్కువగా 8.35 శాతం వడ్డీ వస్తుంది. సీనియర్ సిటిజన్లకు సాధారణ డిపాజిట్లపై అదనంగా 0.25 శాతం వడ్డీ వస్తుంది.

పీఎన్‌బీ హౌసింగ్
48 నెలల డిపాజిట్ల నుంచి 84 డిపాజిట్ల వరకూ పీఎన్‌బీ హౌసింగ్ ఫైనాన్స్ 8.25 శాతం వరకూ వడ్డీని అందిస్తోంది. 10 ఏళ్ల డిపాజిట్లకు రాబడి 11.79 శాతం వరకూ ఉండొచ్చు. ఇవి చాలా సురక్షితమైన డిపాజిట్లు. పంజాబ్ నేషనల్ బ్యాంకింగ్ ఏర్పాటు చేసిన ఉప సంస్థే పీఎన్‌బీ హౌసింగ్.

గృహ్ ఫైనాన్స్
36 నెలల గృహ్ ఫైనాన్స్ డిఇపాజిట్ ద్వారా మీకు 8 శాతం రాబడి వస్తుంది. ఇది అంత ఎక్కువ వడ్డీ రేటు అనిపించకపోయినప్పటికీ దేశంలో చాలా బ్యాంకుల ఎఫ్‌డీ వడ్డీ రేటు కంటే ఇది ఎక్కువగానే ఉంది.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదల ఎంతో తెలుసా.. మార్చి 20, శుక్రవారం ధరలు ఇవే..

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Bengaluru: ట్రాఫిక్ కష్టాలకు గుడ్ బై.. ఈ యువతి ఐడియా నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది!

క్రెడిట్ కార్డు క్లోజ్ చేసిన 10 ఏళ్ళ తర్వాత రూ. 33 లక్షలు కట్టాలని బ్యాంక్ నోటీసులు.. కస్టమర్ ఏం చేశాడంటే..



Click it and Unblock the Notifications