మింత్రా చేతికి జబాంగ్: రూ.470 కోట్లు
ఫ్లిప్‌కార్ట్ అనుబంధ కంపెనీ మింత్రా పోటీదారు జబాంగ్‌ను రూ. 470 కోట్లకు సొంతం చేసుకుంది. ఈ లావాదేవీ మొత్తం నగదు రూపంలోనే జరిగిందని జబాంగ్ మాతృ సంస్థ గ్లోబల్ ఫ్యాషన్ గ్రూప్ వెల్లడించింది.

* ప్రధాన పోటీదారులైన అమెజాన్, స్నాప్‌డీల్‌లతో పోటీ పడేందుకు ఫ్లిప్‌కార్ట్‌కు దారులు ఏర్పడతాయి.
* జబాంగ్‌ను సొంతం చేసుకునేందుకు ఫ్యూచర్ గ్రూప్, ఆదిత్యా బిర్లా గ్రూప్, అమెజాన్, స్నాప్‌డీల్
సంస్థలు ప్రయత్నించినట్లు తెలుస్తోంది.
* మహిళా దుస్తుల విభాగంలో జబాంగ్‌కు మంచి పట్టుంది.
* దుస్తులు, పాదరక్షలు, ఫ్యాషన్ యాక్సెసరీస్, సౌందర్య సాధనాలు, గృహాలంకరణ వస్తువులు,
పర్‌ఫ్యూమ్స్, లైఫ్ స్టైల్ ఉత్పత్లును జబాంగ్ ప్రధానంగా విక్రయిస్తుంది.
* 2014లో ఫ్లిప్‌కార్ట్ సంస్థ మింత్రాను కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.
* జబాంగ్ ఖాతాలో 1500 అంతర్జాతీయ బ్రాండ్లు, స్టోర్స్ కంపెనీల ఉత్పత్తులు, దేశీయ డిజైనర్ లేబుళ్లు ఉన్నాయి.
* నెలవారీ 40 లక్షల మంది యాక్టివ్ వినియోగదారులను జబాంగ్ కలిగి ఉంది.
* దేశీయ ఈ-కామర్స్ రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా మేము కూడా సాగుతున్నామని చెప్పేందుకు ఈ కొనుగోలు నిదర్శనమని ఫ్లిప్ కార్ట్ సీఈవో బన్సల్ అన్నారు.
* జబాంగ్ విక్రయం ద్వారా వ్యాపారాలను మరింత విస్తరించడంతో పాటు బ్రాండు రిలేషన్లను పెంచడం, వినియోగదారులకు సరికొత్త అనుభవాలను అందించేందుకు సాధ్యపడుతుందని మింత్రా సీఈవో అనంత్ నారాయణ్ చెప్పుకొచ్చారు.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications