ఆన్‌లైన్‌లో టర్మ్ పాలసీలను బీమా కంపెనీలను తక్కువ ప్రీమియంకే ప్రవేశపెడుతున్నాయి. ఇది చాలా ఆసక్తికరమైన అంశంతో పాటు పాలసీదారులకు కొంచెం డబ్బును మిగల్చగలదు. టర్మ్ పాలసీ తీసుకునేముందు పాలసీ ధర అంత ప్రధాన అంశంగా కాకుండా ఉండేలా చూసుకోవాలి. అయితే టర్మ్ పాలసీని ఆన్‌లైన్‌లో తీసుకోవాలా? లేదా ఎప్పటిలాగే ఆఫ్‌లైన్ మోడ్‌లో తీసుకోవాలో తెలుసుకోవాలంటే ఇవి చదవండి.

ప్రీమియం ధర
తక్కువ ప్రీమియం ఒకటే మదిలో ఉండకూడదు. పాలసీ నియమ నిబంధనలను జాగ్రత్తగా పరిశీలించాలి. ఆన్‌లైన్ టర్మ్ పాలసీల్లో మొదట ఆఫర్ చేసిన దానికంటే వైద్య పరీక్షల తర్వాత ప్రీమియం 25 శాతం వరకూ పెరుగుతున్న సందర్భాలు ఉన్నాయి. అంతే కాకుండా పాలసీ వద్దనుకుంటే వైద్య పరీక్షలకు అయిన మొత్తాన్ని మినహాయిస్తారు.
అయితే కొన్ని కంపెనీలు వినియోగదారులను ఆకట్టుకునేందుకు టర్మ్ పాలసీలను ఆన్‌లైన్ మోడ్‌లో వైద్య పరీక్షల అవసరం లేకుండా అందిస్తున్నాయి. అయితే ఇది అందరికీ కాకపోవచ్చు. బీమా హామీ మొత్తం కనీసం రూ. 50 లక్షలు కలిగిన వాటికి ఇది వర్తిస్తుంది. అందుకోసం పాలసీదారు వైద్య చరిత్ర, బీమా కంపెనీ అడిగిన ఇతర వివరాలను సరిగా వెల్లడించాలి. క్లెయిం సమయంలో కంపెనీ వీటి సాయంతో క్రాస్‌చెక్ చేస్తుంది.

క్లెయిం సెటిల్‌మెంట్ రేషియో
ఆన్‌లైన్ బీమా పాలసీలకు సంబంధించి క్లెయిం శాతాలను వెల్లడించాలని ఐఆర్‌డీఏ నిబంధనేమీ లేదు. బీమా కంపెనీలు వెల్లడించే క్లెయిం రేషియో ఆన్‌లైన్; ఆఫ్‌లైన్ రెండూ కలిసి ఉంటుంది. కేవలం ఆన్‌లైన్ పాలసీలకు సంబంధించిన క్లెయిం రేషియోలను తెలుసుకోవడం సందిగ్దంగా ఉంది. కంపెనీలు ఆన్‌లైన్ పాలసీలను ప్రవేశపెట్టి ఐదారేళ్లే అవుతున్నందన దీనిపై ఐఆర్‌డీఏ స్పష్టమైన విధానాలను విడుదల చేయాల్సి ఉంది.

కస్టమర్ సపోర్ట్
టర్మ్ పాలసీ ప్రధానమైన ఉద్దేశం పాలసీదారుడికి ఏదైనా జరిగి మరణిస్తే బీమాహామీ మొత్తం రక్షణ కల్పిస్తుందని. పాలసీదారు కుటుంబానికి బీమా హామీ మొత్తం సాధ్యమైనంత త్వరగా అందాలి. ఆఫ్‌లైన్ పాలసీల్లో అడ్వైజర్ లేదా బ్రోకర్‌ను సంప్రదించే వీలుంది. బీమా కంపెనీ వద్ద మీ తరపున అతడు ప్రతినిధిగా ఉంటాడు. అదే ఆన్‌లైన్ పాలసీల్లో వివరాలను పూరించేటప్పుడు ఏ మాత్రం తప్పు చేసినా క్లెయిం రద్దయ్యే అవకాశం లేకపోలేదు.

ప్రీమియం పోల్చి చూడటం
ఆన్‌లైన్ టర్మ్ పాలసీల ప్రీమియం కంపెనీలను బట్టి మారుతూ ఉంటుంది. ఇది వినియోగదారులకు అంత సులువుగా అర్థమయ్యే అంశం కాదు. మరణాల రేటు, మార్కెటింగ్, వైద్య పరీక్షల ఖర్చులు, బీమా పాలసీ హామీ మొత్తం వంటి అంశాల ఆధారంగా ప్రీమియం నిర్ణయం అవుతుంది. రూ. 50 లక్షల పైబడి బీమా హామీ మొత్తం కలిగిన పాలసీలకు కొన్ని కంపెనీలు వైద్య ఖర్చులను వినియోగదారుల నుంచి వసూలు చేయకుండా టర్మ్ ఇన్సూరెన్స్‌ను అందిస్తున్నాయి. అలాంటి పాలసీలు ఎక్కువ శాతం అదనపు రైడర్లను అందించట్లేదు.

ముగింపు:
ఆన్‌లైన్ పాలసీలకు సంబంధించి కంపెనీ కస్టమర్ సేవలు అంత నాణ్యతగా ఉండకపోవచ్చు. అయితే ఆఫ్‌లైన్ పాలసీల్లో అయితే ఏజెంటు లేదా బ్రోకరు లేదా ఆర్థిక సలహాదారు వంటి వారు అండగా ఉంటారు. అందుకే టర్మ్ పాలసీని తీసుకునేముందు ప్రీమియంను ఒకదాన్నే దృష్టిలో ఉంచుకోకుండా అన్ని అంశాలను బేరీజు వేసుకోవాలి. అన్నీ సంతృప్తిగా అనిపిస్తే మీకు ఇష్టమైన రీతిలోనే పాలసీని కొనుగోలు చేయండి.

టర్మ్ పాలసీ వర్సెస్ ఎండోమెంట్ పాలసీ
టర్మ్ పాలసీ పూర్తిగా రిస్క్ కవరేజీని అందిస్తుంది. ఎండోమెంట్ పాలసీ బీమా, పెట్టుబడి రెండింటినీ కలగలిపి ఉంటుంది. బీమా ప్రాథమిక ఉద్దేశం ఆర్థిక రక్షణ. ఎండోమెంట్ పాలసీలో పెట్టుబడి కూడా కలిసి ఉండటం మూలంగా ఇది పూర్తి రక్షణ కల్పించదు. అందువల్ల ప్రీమియం సైతం ఎండోమెంట్ పాలసీలకు ఎక్కువ ఉంటుంది. ఎండోమెంట్ పాలసీ తీసుకోవడానికి బదులు ఒక టర్మ్ పాలసీ తీసుకుని మిగిలిన ప్రీమియంను ఇతర పెట్టుబడి పథకాలకు మళ్లిస్తే దీర్ఘకాలంలో మంచి రాబడులను సాధించవచ్చు.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications