ఈ కామర్స్ మార్కెటింగ్ దిగ్గజం అమెజాన్ ఎప్పటికప్పుడు వ్యూహాలను మారుస్తోంది. సీజన్ల వారీ అమ్మకాల ఆఫర్లతో పాటు వినియోగదారులకు చేరువయ్యేందుకు కొత్త సదుపాయాన్ని ప్రవేశపెట్టింది. ఆ సంస్థ ప్రైమ్ మెంబర్ షిప్ ప్రోగ్రాంను మంగళవారం ప్రకటించింది. దేశంలో 100కు పైగా నగరాల్లో తన సేవలు అందిస్తున్న అమెజాన్ ఈ సేవను ప్రవేశపెడుతోంది. ఈ సేవలను పొందాలనుకునే వారు సంవత్సరానికి రూ. 499 చెల్లించాల్సి ఉంటుంది. దీని ద్వారా ఆర్డర్ చేసిన రెండు మూడురోజుల్లోనే ఆయా ఉత్పత్తులు వినియోగదారుల చెంత చేరనున్నాయి. ప్రైమ్ సేవలను మొదట ట్రయల్ పీరియడ్‌లో ఉచితంగా అందించనున్నారు.
అంతేకాదు ప్రైమ్ సభ్యులకు అదనంగా ప్రత్యేక అవకాశాలు,స్పెషల్ డీల్స్ ను అందించనున్నట్టు ఒక ప్రకనటలో తెలిపింది. మినిమం కొనుగోలు నిబంధన లేకుండా ఈ అవకాశాన్ని ప్రైమ్ మెంబర్స్ అపరిమిత వేగంతో డెలివరీలు పొందే అవకాశాన్ని వినియోగించుకోవచ్చని తెలిపింది.

ఇది తమ వ్యాపార వృద్ధి మరింత తోడ్పాటు అందిస్తుందని అమెజాన్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ అమిత్ అగర్వాల్ పేర్కొన్నారు. దేశ వ్యాప్తంగా ఉన్న తమ వినియోగదారులకు అన్ లిమిటెడ్ ఉచిత సేవలతోపాటు ప్రైమ్ డెలీవరీని అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించారు. సభ్యత్వం పొందిన తమ సభ్యులు 20 నగరాల్లో 10,000 పైగా ఉత్పత్తులపై రూ .50 పైగా రాయితీతో అదే రోజు, ఉదయం లేదా షెడ్యూల్ డెలివరీని ఎంచుకోవచ్చని ప్రకటించింది.
More From GoodReturns

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

Gold Prices: ఆకాశాన్ని తాకుతున్న పసిడి.. శ్రీరామ నవమి రోజున రేట్లు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications