జీవితంలో సంపాదన పెరిగే కొద్దీ పన్ను సందేహాలు అందరికీ ఉంటాయి. అయితే మొదటిసారి సంపాదన మొదలెట్టిన తర్వాత ఆదాయపు పన్ను రిటర్నులు సమర్పించాలంటే మదిలో ఎన్నో సందేహాలు ఉంటాయి. ఎన్నో రకాల ప్రశ్నలకు ఇక్కడ సమాధానాలు ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం. రిటర్నులు సమర్పించే ముందు తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలను ముందు చర్చించాం. జులై 31తో వ్యక్తులు ఆదాయపు పన్ను రిటర్నులు సమర్పించే గడువు ముగుస్తుంది.
రిటర్నులను సమర్పించిన తర్వాత చేయాల్సిన పనులేంటో చూద్దాం.

ఇంటికెళ్లి పన్ను రిటర్నులను సరిచూసుకోవాలి
చాలా మంది వ్యక్తులు తమ ఆదాయంలో బ్యాంకు పొదుపు ఖాతాపై వచ్చిన వడ్డీని చూపడం మరిచిపోతారు. అదే విధంగా వివిధ రకాల ఆదాయాలన్నింటినీ ప్రస్తావించారా లేదా చూసుకోవాలి.
పన్ను రిటర్నులను సవరించేందుకు మీకు జులై 31 వరకూ సమయం ఉంది. మీరు ఏదైనా మరిచిపోయి ఉంటే, లేదా ఉద్దేశపూర్వకంగా ప్రస్తావించకపోయి ఉంటే సరిచేసుకోండి. తప్పు వివరాలు సమర్పించే కంటే అన్ని వివరాలు సక్రమంగా తెలియజేస్తే భవిష్యత్తులో ఇబ్బందులు ఉండవు.

బ్యాంకు ఖాతా వివరాలు, చిరునామా
మీరు తెలిపిన చిరునామా, ఇచ్చిన బ్యాంకు ఖాతాలకే నేరుగా ట్యాక్స్ రీఫండ్ వస్తుంది. ఒకవేళ ఏమైనా మార్పులు చేయాలనిపిస్తే చేయండి. అన్నీ సరిగా ఉంటే మంచిదే.

ఐటీఆర్ కాపీ పోస్ట్
ఐటీఆర్ 5 అక్‌నాలెడ్జ్‌మెంట్‌ను సెంట్రల్ ప్రాసెసింగ్ సెంటర్, బెంగుళూరుకు పంపడం మరిచిపోవద్దు. వాటి పైన కచ్చితంగా సంతకాలు ఉండాలి. కొరియర్‌లో కాకుండా పోస్ట్‌లో పంపండి.
ఆధార్ అనుసంధానించబడి మొత్తం ఆన్‌లైన్ పద్దతిలో చేసేట్లయితే పోస్ట్‌లో ఎటువంటి పత్రాలను పంపాల్సిన పని లేదు.

ఐటీ డిపార్ట్ మెంట్ పంపే ఈ-మెయిల్ కోసం చూసుకోవాలి
మీరు ఐటీ రిటర్నులు ఫైల్ చేసి అవి అధికారులకు అంది ఉంటే, ఐటీ అధికారులు మీరు రిటర్నులు సమర్పించినట్లుగా తిరిగి మెయిల్ పంపుతారు. అందుకే నిత్యం మెయిల్ చెక్ చేసుకోవాలి. పోస్ట్‌లో పంపిన వారు కచ్చితంగా క్రమంగా మెయిల్ చూసుకోవాల్సిందే.

ఇన్‌కమ్ ట్యాక్స్ రీఫండ్ స్టేటస్
ఆదాయపు పన్ను(ఇన్‌కమ్ ట్యాక్స్) రీఫండ్ స్టేటస్‌ను ఎప్పటికప్పుడు ఎన్ఎస్‌డీఎల్ వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చు. అందుకోసం లెక్కింపు సంవత్సరం, పాన్ కార్డు వివరాలు నమోదు చేస్తే చాలు.

రిటర్నుల ఫైలింగ్ కోసం చివరి తేదీ
ఆదాయపు పన్ను రిటర్నులను ఫైల్ చేసేందుకు చివరి తేదీ జులై 31, 2016 అని గుర్తుంచుకోండి.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications