5 మ‌హిళా స్టార్ట‌ప్‌లు

భార‌త ఆర్థిక వ్య‌వ‌స్థ గ‌త ప‌దేళ్లుగా స‌త్వ‌ర మార్పుల‌కు లోన‌వుతోంది. వీటిలో ప్ర‌ధానంగా చెప్పుకోవాల్సింది స్టార్ట‌ప్‌ల గురించే. యువ‌త మైండ్ సెట్ మార‌డమే దీనికి ప్ర‌ధాన కార‌ణం. ఇంత‌కుముందు ఏదో ఉద్యోగం గురించి క‌ల‌లు క‌నే గ్రాడ్యుయేట్లు నేడు సొంత వ్యాపారాల‌కే మొగ్గు చూపుతున్నారు. జీవ‌న శైలి మారింది. విద్య‌, వైద్యం, ప్ర‌యాణాలు, హోట‌ళ్లు ఒక‌టేమిటి స‌రికొత్త అవ‌కాశాలు ఉన్న ప్ర‌తి రంగంలోకి యువ‌త నేడు వేగంగా ప్ర‌యాణిస్తోంది. అవ‌కాశాల‌ను అందిపుచ్చుకొని త‌మ‌వైన వ్యాపారాల‌తో స్టార్ట‌ప్‌ల‌ను త‌క్కువ పెట్టుబ‌డి ఎక్కువ ప్ర‌యోజ‌నాల‌న్న‌ట్లుగా మొద‌లుప‌పెడుతున్నారు. అందునా గ‌త కొన్నేళ్ల‌లో చెప్పుకోద‌గ్గ ఇంకో మార్పు మ‌హిళా వ్యాపార‌వేత్త‌ల ఆగ‌మ‌నం. జివామి(Zivame), యాత్రా.కామ్‌( Yatra.com), షాప్‌క్లూస్‌(Shopclues), మెన్ట్ర్సూపీడియా(Menstrupedia), చుంబాక్‌(Chumbak) , త్రిల్లొఫీలియా(Thrillophilia) వంటి స్టార్ట‌ప్‌ల‌ను మ‌హిళ‌లే ప్రారంభించి వారే న‌డుపుతున్నారు. ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న పెట్టుబ‌డిదారుల‌ను ఆక‌ర్షించ‌డంలో మ‌హిళా స్టార్ట‌ప్‌లు సైతం త‌మ వంతు పాత్ర వ‌హిస్తున్నాయి.

ఇక్క‌డ అలాంటి 5 స్టార్ట‌ప్‌ల గురించి వివ‌రంగా చూద్దాం

షిరోస్.ఇన్‌(Sheroes.in):

షిరోస్.ఇన్‌(Sheroes.in):

ఎక్కువ శాతం మ‌హిళ‌ల‌కు మిడ్ కెరీర్ ఎంపిక ఎంతో సవాలుతో కూడుకున్న అంశం. ఈ స‌మ‌యంలో ఎప్పుడో చేసిన ఉద్యోగం ఆస‌క్తి లేకో, లేదా కొత్త‌గా ఉద్యోగానికి వెళ్లేందుకు మొగ్గుచూప‌కో కొత్త‌గా ఆలోచించే వారుంటారు. వారు ఏదైనా వ్యాపారం, వృత్తినో చేప‌ట్టేందుకు ఆలోచిస్తారు. ఇంకొంత మంది ఇంటి నుంచే ప‌నిచేసుకునే వీలుండే ఉద్యోగాల కోసం చూస్తారు. ఈ క్ర‌మంలో పిల్ల‌ల‌ను చూసుకునేందుకో, కుటుంబ బాధ్య‌త‌ల‌ను స‌మ‌ర్థ‌వంతంగా చేప‌ట్టేందుకో ఎక్కువ మంది ప్రాధాన్యాతను ఇస్తారు. ఈ ఇబ్బందుల‌ను అధిగ‌మించేందుకు ఓ స‌రికొత్త ఆలోచ‌న‌తో సైరీ చ‌హాల్ ముందుకు వ‌చ్చారు. 2014లో షిర‌స్‌.ఇన్ ప్రారంభించారు. ఉద్యోగం-ఇంటి ప‌ని మ‌ధ్య స‌మ‌తౌల్యం సాధించే విధంగా ఈ వెబ్‌సైట్ దృష్టి పెడుతుంది. మెంటార్స్‌, స‌రైన వ‌న‌రుల‌ను ఉద్యోగాలు ఇంటి నుంచే చేయ‌గ‌లిగే మ‌హిళ‌ల‌ను షిరోస్ అనుసంధానిస్తుంది. 2015లో రాఘ‌వ్ బాల్‌, రితు క‌పూర్ ఆధ్వ‌ర్యంలోని క్వింటిల్లియ‌న్ మీడియాల‌ నుంచి రూ. 5 కోట్ల ఫండింగ్‌ను ఈ స్టార్ట‌ప్‌ రాబ‌ట్టింది. పెట్టుబ‌డులు పెట్టిన వారిలో పేటీఎమ్ విజ‌య్ శేఖ‌ర్ వ‌ర్మ‌, రాజ‌న్ ఆనంద‌న్‌, బిన్నీ బ‌న్స‌ల్‌, మెకిన్ మ‌హేశ్వ‌రి, గిరీష్ మాతృభూత‌మ్‌, ఇండ‌స్ కైటాన్‌, క్రిష్ణ మెహ్రా ఉన్నారు. ప్ర‌స్తుతం షిరోస్‌.ఇన్ 3 ల‌క్ష‌ల విమెన్ ప్రొఫెష‌న‌ల్స్‌ను క‌లిగి ఉండ‌ట‌మే గాక‌, దీని ద్వారా 10 వేల మంది త‌మ‌కు న‌ప్పే ఉద్యోగాల్లో చేరారు.

 స్ప్రింగ్‌బోర్డ్‌

స్ప్రింగ్‌బోర్డ్‌

ఆన్‌లైన్ కోర్సుల గురించి విచారించేందుకు సెర్చ్ ఇంజిన్‌లాగా స్ప్రింగ్‌బోర్డ్ 2013లో ప్రారంభ‌మైంది. బెంగుళూరు, సిలికాన్ వ్యాలీల‌లో ఆస‌క్తి క‌లిగించే కొత్త లెర్నింగ్ మార్గాల‌ను అన్వేషించింది. దీనికి ఎన్నో బృందాలు నిరంత‌రం ప‌నిచేస్తున్నాయి. టెక్నాల‌జీ ప‌రిశ్ర‌మ‌లో శిక్ష‌ణ పొందిన డేటా సైంటిస్ట‌ల‌కు, యూఎక్స్ డిజైన‌ర్ల‌కు డిమాండ్ ఉంటుంద‌ని ముందే అంచ‌నా వేసిన ప‌రూల్ గుప్తా దీన్ని ప్రారంభించారు. ఈ స్టార్ట‌ప్ ప్ర‌ధాన ఉద్దేశం కెరీర్ సంబంధిత నైపుణ్యాల‌ను స‌మ‌కూర్చ‌డం, వృత్తి నిపుణుల‌ను త‌యారు చేయ‌డం. త‌ద్వారా ప‌రిశ్ర‌మ‌కు త‌గిన వ‌న‌రులు స‌మ‌కూరుతాయ‌నేది అస‌లు ఆలోచ‌న‌. దీంతో పాటు వ్యాపారం వృద్ది చెందుతుంది. 100 మంది డేటాసైంటిస్టులు, డిజైన‌ర్లు మెంటార్లుగా క‌లిగిన ఈ సంస్థ ఆరు ఖండాల నుంచి నిరంత‌రం డిమాండ్‌ను చ‌విచూస్తోంది. ఎంతో మంది స్ప్రింగ్ బోర్డు పాత విద్యార్థులు ఐబీఎమ్‌, బోయింగ్, రెడ్డిట్‌(Reddit) వంటి ప్ర‌ముఖ‌ సంస్థ‌ల్లో ఉద్యోగాలు పొందారు. లింక్‌డ్ ఇన్ స‌హ‌వ్య‌వ‌స్థాప‌కుడు అలెన్ బ్లూ, ఇన్‌మొబి స్థాప‌కులు న‌వీన్ తివారి, అమిత్ గుప్తా లాంటి కొంత మంది పెట్టుబ‌డిదార్ల నుంచి 1.7 మిలియ‌న్ డాల‌ర్ల‌ను ఈ స్టార్ట‌ప్ రాబ‌ట్టుకోగ‌లింది. దీంతో వ‌చ్చే కొద్ది సంవ‌త్స‌రాల్లో సామ‌ర్థ్యం పెంపుకు కృషి చేయ‌డంతో పాటు ఉత్ప‌త్తుల్లో న‌వీక‌ర‌ణ‌కు ప్ర‌య‌త్నిస్తామ‌ని సంస్థ యాజ‌మాన్యం ధీమాగా ఉంది.

 కార్యా

కార్యా

నిధి అగ‌ర్వాల్ ప్రారంభించిన వెంచ‌ర్ కార్యాకు ఫండింగ్‌ను రాబ‌ట్ట‌డంలో 2015 సంవ‌త్స‌రం చాలా మంచి ఫ‌లితాల‌ను ఇచ్చింద‌నే చెప్పాలి. మ‌హిళ‌ల దుస్తుల్లో నాన్ క్యాజువ‌ల్ వ‌స్త్రాల‌కు సంబంధించి 18 ర‌కాల సైజుల్లో ఈ స్టార్ట‌ప్ ప‌నిచేస్తుంది. మొద‌ట్లో ర‌తాన్ టాటా నుంచి పెట్టుబ‌డుల‌ను రాబ‌ట్టిన కార్యా త‌ర్వాత రౌండ్లో టీవీ మోహ‌న్‌దాస్ ప‌య్, ది సాహా ఫండ్ నుంచి నిధుల‌ను రాబ‌ట్టుకోగ‌లింది.

ప్ర‌స్తుతం నెల‌కు 3500 పైగా ఆర్డ‌ర్ల‌ను కార్యా సాధించ‌గ‌లుగుతోంది. మైంత్రా, జ‌బాంగ్‌, ఫ్లిప్‌కార్ట్‌, స్నాప్ డీల్, లైమ్ రోడ్‌, పేటీఎమ్ వంటి ఈకామ‌ర్స్ వెబ్‌సైట్ల‌లో ఈ సంస్థ ఉత్ప‌త్తుల‌ను కొనుక్కోవ‌చ్చు. ప్ర‌పంచ‌వ్యాప్తంగా వెస్ట‌ర్న్ దుస్తుల‌కు గ్లోబ‌ల్ బ్రాండ్‌గా కార్యాను తీర్చిదిద్దాల‌న్న ల‌క్ష్యంతో అగ‌ర్వాల్ ప‌నిచేస్తున్నారు.

 క్యాష్ క‌రో.కామ్‌

క్యాష్ క‌రో.కామ్‌

దేశంలో అతిపెద్ద క్యాష్‌బ్యాక్‌, కూప‌న్ ప్లాట్ ఫాం క‌లిగిన సంస్థ‌ల్లో క్యాష్‌క‌రో.కామ్ ఒక‌టి. 2015 జ‌న‌వ‌రి నుంచి ఈ సంస్థ నిధులు రాబ‌ట్టుకునే ప‌నిలో ప‌డింది. న‌వంబ‌రులో క‌ల‌రీ క్యాపిట‌ల్ నుంచి 25 కోట్ల రూపాయ‌ల‌ను పెట్టుబ‌డిగా రాబ‌ట్టుకోగ‌లిగింది. త‌ర్వాత ర‌తాన్ టాటా సైతం ఇందులో పెట్టుబ‌డులు పెట్టారు. గుర్‌గావ్ ప్ర‌ధాన కేంద్రంగా క‌లిగిన ఈ సంస్థ 2013 లో ప్రారంభ‌మైంది.

స్వాతి భార్గ‌వ్ మ‌దిలో మెరిసిన ఐడియా నుంచి ఆయ‌న భ‌ర్త‌తో క‌లిసి ఈ స్టార్ట‌ప్‌ను ప్రారంభించారు. యోగాలో ఆస‌క్తి క‌లిగి, గ‌ణితంలో దిట్ట అయిన స్వాతి, యూకేలో గ‌తంలో పౌరింగ్‌పౌండ్స్‌కు నేతృత్వం వ‌హించారు. త‌ర్వాత సొంత సంస్థ‌ను ప్రారంభించే క్ర‌మంలో ఇండియాకు వ‌చ్చారు.

ది న్యూస్ మినిట్‌

ది న్యూస్ మినిట్‌

బెంగుళూరు కేంద్రంగా ప‌నిచేసే దిన్యూస్ మినిట్ 2014లో ప్రారంభ‌మ‌యింది. 5 ద‌క్షిణాది రాష్ట్ర మార్కెట్లే దీని ప్ర‌ధాన ల‌క్ష్యం. పేరెన్నిక‌గ‌న్న జ‌ర్న‌లిస్ట్, ర‌చ‌యిత చిత్రా సుబ్ర‌హ్మ‌ణ్యం, మాజీ టైమ్స్ నౌ బ్యూరో ఛీప్ ధ‌న్య రాజేంద్ర‌న్‌, ఒక సాఫ్ట్‌వేర్ సంస్థ‌లో హెచ్ ఆర్‌గా ప‌నిచేసిన విగ్నేష్ వెల్లూర్ సంయుక్తంగా దీన్ని స్థాపించారు.

2015లో ఈ సంస్థ రాఘ‌వ్ బాల్, రిత్‌క‌పూర్ క్వింటిల్లియ‌న్ మీడియా ల నుంచి నిధిఉల‌ను రాబ‌ట్టింది. బ్రేకింగ్ న్యూస్‌, బృంద రిపోర్టింగ్; ప‌్ర‌త్యేక ఫీచ‌ర్లు, వార్తా విశ్లేష‌ణ‌, ఓపినీయ‌న్ ఆర్టిక‌ల్స్‌, బ్లాగ్‌ల‌పై ప్ర‌ధానంగా దిన్యూస్ మినిట్ దృష్టి కేంద్రీక‌రించింది. ద‌క్షిణ భార‌తదేశంలోని వార్త‌ల‌కు జాతీయ ప్రాధాన్యం ల‌భించే దిశ‌లో ఇది ప‌నిచేస్తుంది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+