తమిళ తలైవార్ కబాలి మొదలెట్టినప్పటి నుంచి దాని గురించి ఏ వార్త అయినా ఆసక్తి కరమే. అన్నింటినీ మించి ఫోర్బ్స్ మ్యాగజైన్ నిన్న ఒక ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. శుక్రవారం నుంచి థియేటర్లలో విడుదలవుతున్న ఈ సినిమా దేశ సినిమా వర్గాల్లోనే కాకుండా వ్యాపార వర్గాల్లో సైతం సంచలనాలకు తెరతీస్తోంది.
ఇప్పటికే అమెరికాలో రిలీజయిన ఈ సినిమా హిట్ టాక్ తెచ్చుకుంది. ప్రపంచవ్యాప్తంగా అమెరికా, మలేషియా, సింగపూర్, జపాన్ సహా చాలా దేశాల్లో సినిమా విడుదలవుతోంది. దీంతో ఎవరెవరు ఈ సినిమాను ఎలా మార్కెట్ చేసుకుంటున్నారో ఫోర్బ్స్ వెల్లడించిన విషయాలను చూద్దాం.

రజనీ అభిమానులను ఆకట్టుకునేందుకు ఎయిర్ ఏషియా తన విమానానికి పోస్టర్లను అంటించింది. ఏయిర్ ఏషియా సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్న నిర్మాతల బృందం ఓ విమానాన్ని కబాలి పేరుతో సిద్దం చేయడం గమనార్హం. ఈ విధంగా తలైవార్ రజనీకి, ఆయన అభిమానులకు ట్రిబ్యూట్ ఇస్తున్నట్లుగా ఎయిర్‌ఏషియా ఇండియా సీఈవో అమర్ చెప్పారు. అంతే కాకుండా శుక్రవారం రోజున ఆ సినిమా అభిమానుల కోసం ప్రత్యేక విమానాన్ని బెంగళూరు నుంచి చెన్నైకి నడుపుతున్నారు. దీనికి ప్రత్యేక ప్యాకేజీని ఏర్పాటు చేసి 120 డాలర్లను వసూలు చేస్తున్నారు. మలేషియాలోని అభిమానుల కోసం సైతం ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేసినట్లు సమాచారం.
దేశీయ టెలికాం దిగ్గజం భారతి ఎయిర్‌టెల్ కబాలి రిచార్జీ ప్యాక్‌తో అన్‌లిమిటెడ్ 2జీ ఇంటర్నెట్‌ను ఇస్తోంది. కబాలి సిమ్ ప్యాక్‌లు సైతం మార్కెట్‌లో సిద్దంగా ఉన్నాయి. అదే విధంగా సినిమా విడుదల సందర్భంగా తమ అభిమాన నటుడిని విష్ చేసేందుకు ఎయిర్‌టెల్ ప్రత్యేక ఎస్ఎంఎస్ హాట్‌లైన్ ఏర్పాటు చేసింది. దీని ద్వారా వచ్చిన సందేశాలను చిన్న పుస్తకంగా తయారు చేసి రజనీకాంత్‌కు అందిస్తారు.
కేరళ బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ ముత్తూట్ ఫిన్ కార్ప్ రజనీ చిత్రంతో కూడిన వెండి కాయిన్లను విడుదల చేసింది. 5 గ్రాముల నాణేల ధర 5.30 డాలర్లు.
కోల్‌కత కన్సూమర్ గూడ్స్ కంపెనీ ఇమామీ, ఫెయిర్ అండ్ హ్యండ్‌సమ్‌ను కబాలి బ్రాండ్ పార్ట్‌నర్‌గా ప్రకటించింది. "#BeTheFire" పేరుతో ఇమామి ఒక పోటీని మొదలెట్టింది. ఇందులో వినియోగదారులు ఫెయిర్ అండ్ హ్యాండ్‌సమ్‌ను కొని ఒక సెల్ఫీ తీసుకుని ఫేస్‌బుక్ లేదా ట్విట్టర్‌లో తమ వాల్‌పై పోస్ట్ చేయాలి. "#BeTheFire" అని ట్యాగ్ చేయాలి. 50 మంది అదృష్టవంతులకు కబాలి విజయోత్సవానికి వారికి ఎక్స్‌క్లూజివ్ పాసెస్ ఇస్తారు.
కబాలి ప్రత్యేక విమానం బెంగుళూరులో శుక్రవారం ఉదయం 6.10 గంటలకు బయల్దేరి చెన్నైలో 7.10 గంటలకు ల్యాండ్ అవుతుంది. ప్యాసెంజర్లంతా చెన్నై సత్యం సినిమా థియేటర్‌కు వెళతారు. 9 గంటలకు ఫస్ట్ షో చూస్తారు.
రజనీకాంత్ అభిమానుల కోసం ఓలా సైతం సన్నద్దమైంది. చెన్నైలో రజనీకాంత్ అభిమానులు ఓలా క్యాబ్ ప్రయణాల చేస్తే ఉచిత సినిమా టిక్కెట్లను ఇచ్చే ఏర్పాటు చేసింది. ఇంతే కాకుండా థింక్ మ్యూజిక్, ఎస్ ఎస్ మ్యూజిక్ కంపెనీలతో భాగస్వామ్యం ఏర్పరుచుకుంది. అదృష్ట రైడర్లు మూవీ టిక్కెట్లను లేదా మ్యూజిక్ యూఎస్‌బీలను ఉచితంగా గెలుచుకునే అవకాశం ఉంటుంది. జులై 15 న ప్రారంభమైన ఈ ఆఫర్ ఈరోజు(జులై 21)న ముగుస్తుంది. కోడ్: SUPERSTAR
నియమ నిబంధనల కోసం blog.olacabs.com చూడండి
More From GoodReturns

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..



Click it and Unblock the Notifications