మీకు ఇష్టమైన దేవుళ్లకు షేర్లను సైతం కానుకలుగా ఇవ్వొచ్చు
మీకు ఇష్టమైన దేవుళ్లకు సంబంధించిన గుడికి డీమ్యాడ్ ఖాతా ఉంటే ఇప్పుడు షేర్లను సైతం కానుకలుగా ఇవ్వొచ్చు. బ్యాంకు ఖాతాలాగా ఉండే డీమ్యాట్ ఖాతాలో మీరు షేర్లు, బాండ్లను ఎలక్ట్రానిక్ రూపంలో ఉంచుకోవచ్చు. అయితే షేర్లను ఒక ఖాతా నుంచి మరో ఖాతాకు బదిలీ చేసుకోవచ్చు.
దేశంలో చాలా దేవాలయాలు నగదు, బంగారం, విదేశీ కరెన్సీలను సైతం కానుకలుగా అంగీకరిస్తున్నాయి. ప్రపంచంలో ఉన్న భక్తులెవరైనా ఈ విధమైనా కానుకలను సమర్పించే వీలుంది. ఈ క్రమంలో భక్తులకు సులువుగా ఉండేందుకు ప్రముఖ దేవాలయాలన్నీ డీమ్యాట్ ఖాతాలు తెరిచేస్తున్నాయి. అవి:

తిరుమల తిరుపతి దేవస్థానం
టీటీడీ గతేడాదే సీడీఎస్ఎల్ వద్ద డీమ్యాట్ ఖాతా సంఖ్య 16010100 00384828ను తెరిచింది.
ఇప్పటికే చాలా మంది భక్తులు దీనికి షేర్లను పంపిస్తున్నారు.

సిద్ధి వినాయక దేవాలయం
ఎస్‌బీఐ క్యాప్ సెక్యూరిటీస్‌తో ఒప్పందం కుదుర్చుకున్న దేవాలయ యాజమాన్యం సీడీఎస్ఎల్ వద్ద డీమ్యాట్ ఖాతాను తెరిచింది. ఖాతా పేరు శ్రీ సిద్ది వినాయక గణపతి టెంపుల్ ట్రస్ట్(ప్రభాదేవి), ముంబయి.
వినాయక స్వామి భక్తులు ప్రస్తుతం ఈ విధంగా కానుకలు సమర్పించే భాగ్యాన్ని పొందారు. ఖాతా సంఖ్య 12047200 11413505 పేరిట ఉన్న డీమ్యాట్ అకౌంట్‌కు షేర్లను పంపవచ్చని సీడీఎస్ఎల్ ఒక ప్రకటనలో తెలిపింది.

ఉజ్జయిని మహాంకాళి దేవాలయం
వార్తలను బట్టి చూస్తే ఉజ్జయిని మహాంకాళి దేవాలయ నిర్వాహకులు సైతం డీమ్యాట్ తెరిచేందుకు మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది.
భక్తులు దేవత, దేవుళ్ల పేరిట షేర్లలో పెట్టుబడి పెట్టేందుకు అవకాశం కల్పిస్తారు.

భవిష్యత్తు జాబితా
వినాయకుడికి చెందిన ఖజ్‌రానా గుడి, మధ్యప్రదేశ్‌లోని రంజిత్ హనుమాన్ గుడి సైతం ఖాతాలు తెరిచేందుకు ఆసక్తి కనబరుస్తున్న జాబితాలో ఉన్నాయి.
మరో మీడియా కథనం ప్రకారం ముంబయి బాబుల్‌నాథ్ మందిర్, శ్రీనాథ్‌జీ దేవాలయం, స్వామినారాయణ్ హిందూ దేవాలయం సైతం డీమ్యాట్ తెరిచే క్రమంలో ఉన్నాయి.

షేర్లను కానుకగా ఇవ్వండి
వ్యాపార వర్గాలకు చెందిన ఎంతో మంది భక్తులకు ప్రధానంగా సమయం ఉండదు. నేరుగా దేవాలయాలకు వెళ్లే వీలుండకపోవచ్చు. వారంతా షేర్లను కానుకలుగా ఇవ్వవచ్చు. లేదా దేవాలయాల పేరిట ఉన్న ఖాతాల్లో పెట్టుబడులు పెట్టొచ్చు.


Click it and Unblock the Notifications