ప్రభుత్వ రంగ బ్యాంకుల మూలధన కోసం కేటాయించిన నిధుల్లో మొదటి విడత నిధులను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది ఈ ఆర్థిక సంవత్సరంలో 25వేల కోట్ల రూపాయల కేటాయించిన ప్రభుత్వం రూ22,915 కోట్లను విడుదల చేస్తోంది. ఈ నిధులను 13 ప్రభుత్వ రంగ బ్యాంకులకు ఈ పంపిణీ చేయనుంది. బ్యాంకుల సామర్థ్యం, క్రెడిట్, నిక్షేపాలు, ఖర్చుల తగ్గింపు తదితర కార్యకలాపాల పనితీరుతో ముడిపడి మిగిలిన మొత్తం నిధుల జారీ ఉంటుందని తెలిపింది.
ఇందులో సింహ భాగం రూ. 7575 కోట్లు దేశంలోనే అతిపెద్ద బ్యాంకు అయిన ఎస్‌బీఐకు వెళ్లనున్నాయి.
కేంద్ర బడ్జెట్ లో ప్రకటించిన 'ఇంద్రధనుష్' పథకం కింద ఈ నిధులను విడుదల చేయనున్నట్టు ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. ప్రస్తుత సంవత్సరం మూలధనం, వార్షిక వృద్ధి రేటు, గత ఐదు సంవత్సరాలుగా క్రెడిట్ వృద్ధి రేటు ఆధారంగా ఈ కేటాయింపులు చేసినట్టు తెలిపింది. ద్రవ్యత మద్దతు అందించడానికి వీలుగా 75 శాతం నిధులును అందజేయనున్నట్టుస్పష్టం చేసింది.
బ్యాంకులకు అందజేసిన మూలధనం వివరాలు ఈ విధంగా ఉన్నాయి
ఎస్ బీఐ - రూ.7,575 కోట్లు
ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్- రూ 3,101 కోట్లు
పంజాబ్ నేషనల్ బ్యాంక్ - రూ. 2,816 కోట్లు.
బ్యాంక్ ఆఫ్ ఇండియా -రూ. 1,784 కోట్లు
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ 1,729 కోట్లు
సిండికేట్ బ్యాంక్ - రూ. 1,034 కోట్లు
యూకో బ్యాంక్- రూ. 1033 కోట్లు
కెనరా బ్యాంక్ - రూ. 997 కోట్లు
యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా- రూ. రూ. 810 కోట్లు
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా- రూ. 821 కోట్లు
కార్పొరేషన్ బ్యాంక్- రూ. 677 కోట్లు
దేనా బ్యాంక్- రూ. 594 కోట్లు
అలహాబాద్ బ్యాంక్- రూ. 44 కోట్లు
ఈ ఆర్థిక సంవత్సరంలో 25వేల కోట్ల రూపాయలను బ్యాంకులకు మూలధనంగా అందించనున్నట్లు ప్రభుత్వం బడ్జెట్‌లో ప్రకటించింది. దీనిపై స్పందించిన నిపుణులు ప్రభుత్వం కేటాయించిన దాని కన్నా బ్యాంకులకు మరింత మూలధనం అవసరపడుతుందనే అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే ఇవే అంతిమ నిధులు కావాలని, అదనపు నిల్వలు కావాల్సిన పరిస్థితుల్లో ప్రత్యామ్నాయాల ఏర్పాటుపై దృష్టి సారిస్తామని జైట్లీ హామి ఇచ్చిన సంగతి తెలిసిందే.
మొత్తానికి ఈ విడతలో ప్రభుత్వ రంగ బ్యాంకుల్లోకి రూ. 22,915 కోట్ల మూలధనం వెళ్లనుంది.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications