ట్రేడింగ్‌లో 18 శాతం లాభపడిన షేర్లు
ప్రస్తుత పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లోనే జీఎస్‌టీ బిల్లు పాస్ అవుతుందన్న సెంటిమెంట్ బలపడుతుండటంతో మార్కెట్లు లాభాల్లో నడుస్తున్నాయి. ప్రస్తుతం ట్రేడింగ్‌లో 18 శాతం లాభపడిన 6 కంపెనీల షేర్లను చూద్దాం.

మంగళం టింబర్
జీఎస్‌టీ బిల్లు పాస్ అయితే చిన్న సంస్థలు సైతం పన్ను పరిధిలోకి వస్తాయి. ఈ క్రమంలో మంగళం టింబర్‌పై ఆశలతో పెట్టుబడిదారులు ఆసక్తిచూపడంతో ఆ సంస్థ షేరు 17 శాతానికి పైగా లాభపడింది. ఎన్ఎస్ఈలో ఈ షేరు రూ. 35.25 వద్ద ట్రేడవుతోంది.

ఉషర్ అగ్రో
ట్రేడింగ్‌లో పెట్టుబడిదారుల దృష్టిపడిన మరో షేరు ఉషర్ అగ్రో. ఈ షేరు 16 శాతంపైగా లాభంలో కొనసాగుతోంది. గత ట్రేడింగ్‌లో ఇది రూ.23 వద్ద ఉంది. అతిపెద్ద రైస్ మిల్‌ను కలిగిన ఉషర్ వ్యవసాయ రంగంలో పెద్ద సంస్థ.

జిందాల్ పాలీ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ ఫైనాన్స్ కంపెనీ
షేరు ధరలో గణనీయమైన మార్పు చవిచూసిన స్మాల్ క్యాప్ కంపెనీల్లో ఇది ఉంది. జిందాల్ పాలీ నుంచి డీమెర్జర్ ద్వారా ఏర్పడిన సంస్థ ఇది. 14 శాతం పైకి ఎగసిన ఈ కంపెనీ షేరు రూ. 108 వద్ద ట్రేడవుతోంది.

బరాక్ వ్యాలీ సిమెంట్స్ లిమిటెడ్
అస్సాంలో అతిపెద్ద సిమెంట్ కలిగిన సంస్థ బరాక్ వ్యాలీ సిమెంట్స్ లిమిటెడ్. ఈ కంపెనీ షేరుకు డిమాండ్ ఏర్పడటంతో 14 శాతం లాభపడింది. చివరి ట్రేడింగ్‌లో రూ. 26.85 వద్ద ట్రేడయింది.

డీపీఎస్‌సీ లిమిటెడ్
నేషనల్ స్టాక్ ఎక్స్చేంజీలో ఈ సంస్థ షేరు 12 శాతం లాభపడి రూ. 28.85 వద్ద ట్రేడవుతోంది. ఈ కంపెనీ విద్యుత్ రంగానికి సంబంధించింది.

జిందాల్ స్టెయిన్‌లెస్ హిసార్
గణనీయమైన మెరుగుదలతో జిందాల్ స్టెయిన్‌లెస్ హిసార్ పైకి ఎగబాకింది. చివరి ట్రేడింగ్‌లో రూ. 48.80 ఉన్న ఈ సంస్థ షేరు, 11 శాతం లాభాపడింది.


Click it and Unblock the Notifications