ఆంధ్రా బ్యాంకు బంగారు బాండు
ఆంధ్రాబ్యాంక్ దేశ వ్యాప్తంగా ఉన్న 2,826 శాఖల్లో భారత ప్రభుత్వంచే జారీ చేస్తున్న సావరిస్ గోల్డ్ బాండ్ పథకం నాల్గో విడత సోమవారం నుంచి అమల్లో ఉంటుందని ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పథకం జులై 18 నుంచి 22 వరకూ అమల్లో ఉంటుందని కేంద్రం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ గోల్డ్ బాండ్లు దేశీయులైన వ్యక్తులు, హిందూ ఉమ్మడి కుటుంబాలు, ట్రస్ట్‌లు, విశ్వవిద్యాలయాలు, ధార్మిక సంస్థలకు మాత్రమే పరిమితమన్నారు.
* కనిష్టంగా ఒక గ్రాము నుండి గరిష్టంగా ఐదు వందల గ్రాముల వరకు ఈ పథకంలో గోల్డ్ బాండ్లను కొనుగోలు చేసుకోవచ్చని తెలిపారు.
* బాండ్ కాలపరిమితి ఎనిమిది సంవత్సరాలుగా ఉంటుందని, ఐదు సంవత్సరాల తరువాత ముందస్తుగా రద్దు చేసుకునే సదుపాయం ఉందన్నారు.
* ఈ విడత గోల్డ్ బాండ్ పథకంలో వడ్డీ రేటును సాలుకు 2.75 శాతంగా, గ్రాము బంగారం ధర రూ.3,119 గానూ భారతీయ రిజర్వు బ్యాంకు నిర్థారించినట్లు పేర్కొన్నారు.
* గోల్డ్ బాండ్ పథకంలో ప్రజలు బంగారాన్ని కొనకుండానే బంగారంపై పెట్టుబడి పెట్టే సదుపాయాన్ని ఆంధ్రాబ్యాంక్ కల్పిస్తోందన్నారు.
* బాండ్ నిర్ణీత గడువు ముగిసిన తరువాత ఎంతైతే బంగారం రూపంలో బాండ్‌లో పెట్టుబడి పెట్టారో అంతే బంగారాన్ని రిజర్వు బ్యాంకు నిర్థారించిన మార్కెట్ రేటుకు అనుగుణంగా రూపాయిలలో పొందవచ్చు.
* దాంతో పాటుగా ఆరు నెలలకోసారి ప్రాతిపధికపై పెట్టుబడి మీద వడ్డీని పొందగలిగే సదుపాయాన్ని కూడా కల్పించడం జరుగుతుందన్నారు.
* పెట్టుబడి కాల వ్యవధిలో బంగారపు ధరల పెచ్చుతగ్గుల నుండి ఈ పథకం సరైన రక్షణ కల్పిస్తుంది.
* గోల్డ్ బాండ్ పథకంలో పెట్టుబడి పెట్టదలచిన వారు సమీపంలోని ఆంధ్రాబ్యాంక్ శాఖను సంప్రదించి పథకం పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.


Click it and Unblock the Notifications