తమ అవసరాలను బట్టి ఎన్ఆర్‌ఐలంతా ఎన్ఆర్‌ఈ, ఎన్ఆర్‌వో ఖాతాలను నిర్వహించుకోవాల్సి ఉంటుంది. విదేశీ పెట్టుబడుల ద్వారా ఖాతాను రూపాయి కరెన్సీల్లో నిర్వహించుకునేందుకు వీలు కల్పించేదే ఎన్ఆర్‌ఈ సేవింగ్స్ అకౌంటు. ఈ ఖాతాల్లోని సొమ్మును భారత్ నుంచి అనుమతి పొందిన దేశాల్లో ఎక్కడికైనా తీసుకుపోవచ్చు. ఈ ఖాతా నుంచి ఎన్ఆర్‌వో ఖాతాకు నిధులను బదిలీ చేసుకోవచ్చు.
ఎన్ఆర్‌వో ఖాతాలో సొమ్ముపై వచ్చే వడ్డీకి టీడీఎస్ ఉన్నందున ఇలా చేయకపోవడమే మంచిది.
విదేశీ బ్యాంకు శాఖలు, వడ్డీ రేట్ల పరంగా ఉత్తమమైన 8 బ్యాంకు ఖాతాల గురించి తెలుసుకుందాం.

యెస్ బ్యాంక్
యెస్ బ్యాంక్‌కు చెందిన ఎన్ఆర్‌ఈ సేవింగ్స్ ఖాతా ద్వారా ప్రవాస భారతీయు(ఎన్ఆర్‌ఐ)లు 6 శాతం వడ్డీని పొందవచ్చు. ఏ సమయంలోనైనా ఆ ఖాతాలోని సొమ్మును వడ్డీతో సహా భారతదేశం నుంచి తీసుకురావచ్చు. వడ్డీపై పన్ను చెల్లింపుకు మినహాయింపు కలదు.

ఇండస్ ఇండ్ బ్యాంక్
రూ. 10 లక్షల వరకూ ఖాతాల్లో ఉన్న మొత్తానికి ఇండస్ఇండ్ బ్యాంక్ 4 శాతం వడ్డీ రేటును చెల్లిస్తుంది. రూ. 10 లక్షలు దాటితే వడ్డీ 6 శాతం.

కొటక్ మహీంద్రా బ్యాంక్
ఎన్ఆర్‌ఈ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వినియోగదారులకు కొటక్ మహీంద్రా బ్యాంక్ 8.90 శాతం వడ్డీని అందిస్తోంది. అంతే కాకుండా ఈ ఎఫ్‌డీలపై వచ్చే వడ్డీపై పన్ను ఉండదు. వీటిని భారత్ నుంచి ఎప్పుడైనా తీసుకుపోవచ్చు. ఎన్ఆర్‌ఈ సేవింగ్స్ ఖాతాల్లో ఉన్న నిల్వకు 4 శాతం వడ్డీ అమలవుతుంది.

ఐసీఐసీఐ బ్యాంక్ ఎన్ఆర్‌ఈ సేవింగ్స్ అకౌంటు
ఈ ఖాతాలో ప్రవాస భారతీయులు రూ. 10 వేల కనీస నిల్వను నిర్వహించుకోవాల్సి ఉంటుంది. లేదా కస్టమర్ ఐడీ స్థాయిలో అయితే రూ. 25000 కనీస నిల్వగా ఉంది. ఈ బ్యాంకు భారత్‌లో ఉన్న కుటుంబ సభ్యులకు ఇవ్వడానికి ఉచిత ఖాతా వివరాల కార్డు, చెక్కు పుస్తకాన్ని అందిస్తుంది. తద్వారా వారు ఎప్పుడైనా, ఎక్కడైనా ఖాతాను వాడే వీలుంటుంది.

ఎస్‌బీఐ ఎన్ఆర్‌ఈ ఖాతా
ఈ ఖాతాలో వినియోగదారులు కనీసం రూ. 1000 నిల్వను నిర్వహించాల్సి ఉంటుంది. వార్షిక వడ్డీ 4 శాతంగా లభిస్తుంది. దీన్ని రోజువారీగా లెక్కిస్తారు. యూకే, అమెరికా, కెనడా, మధ్య ఆసియా దేశాల్లో ఎస్‌బీఐ శాఖలున్నాయి.

హెచ్‌డీఎఫ్‌సీ ఎన్ఆర్‌ఈ ఖాతా
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు పలు సేవలను ఉచితంగా అందిస్తోంది. క్విక్ రెమిట్, ఇండియాలింక్, టెలిగ్రాఫిక్ ట్రాన్స్‌ఫర్స్, చెక్కు, డ్రాఫ్టులను ఉపయోగించి నిధులను బదిలీ చేసుకోవచ్చు. ఈ ఖాతాదారుల భారత్‌లోని కుటుంబ సభ్యులకు ఏటీఎమ్ కార్డును ఉచితంగా అందిస్తారు.

సిటీబ్యాంక్ ఎన్ఆర్‌ఈ ఖాతా
ఇండియాలో ఉన్న ఆఫ్‌షోర్ బ్రాంచిల ద్వారా ప్రవాసులకు పలు ఉత్పత్తులు, సేవలను సిటీబ్యాంక్ అందిస్తోంది. ఈ ఖాతాలను తెరిచేందుకు అమెరికా, కెనడాలలో 5000 డాలర్లు అవసరం. మిగిలిన దేశాలలో ఇది వేరుగా ఉంటుంది. తమ ఖాతాదారులకు బ్యాంక్ ప్లాటినమ్ డెబిట్ కార్డును ఉచితంగా ఇస్తుంది.

యాక్సిస్ బ్యాంక్ ఎన్ఆర్‌ఈ ఖాతా
ఖాతా కనీస నిల్వగా రూ. 5 వేలను నిర్వహించాల్సి ఉంటుంది. ఎప్పుడైనా, ఎక్కడైనా ఖాతాను వాడుకునేలా ఫ్రీ ఐకనెక్ట్ సౌకర్యం ద్వారా సురక్షిత ఇంటర్నెట్ బ్యాంకింగ్ సదుపాయం ఉంటుంది.
More From GoodReturns

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..



Click it and Unblock the Notifications