ఇన్ఫోసిస్ ఫలితాల్లో ఏ అంశాలను చూడాలి?
ఇన్ఫోసిస్ ఈ ఏడాది మొదటి త్రైమాసిక ఫలితాలు ఈ రోజు రాబోతున్నాయి. ఏప్రిల్‌లో నాలుగో త్రైమాసిక ఫలితాలను ప్రకటించినప్పుడు డాలరు రెవెన్యూ వృద్ది లక్ష్యాన్ని 13.8% గా నిర్దేశించుకుంది. ప్రస్తుతం అంతా ఈ లక్ష్యాన్ని పునః సమీక్షిస్తుందా లేదా అనే దానిపై దృష్టి సారించబోతున్నారు. బ్రెగ్జిట్ తర్వాతి పరిణామాలతో చాలా అంశాలు మారిపోయాయి. గత నెలలో డాలరు, రూపాయిలతో పోలిస్తే స్టెర్లింగ్ 13 శాతం పడిపోయింది. ఈ నేపథ్యంలో ఇన్ఫోసిస్ ఫలితాల్లో గమనించాల్సిన 5 ముఖ్యాంశాలను చూద్దాం.

ఏప్రిల్-జూన్ త్రైమాసికానికి ఇన్ఫోసిస్ 3.9% రెవెన్యూ వృద్దిని సాధిస్తుందని బ్రోకరేజీ సంస్థ బీఎన్‌పీ పరిబస్ అంచనా వేస్తోంది. ఇది మంచి ఆరంభమే అని మార్గెట్ వర్గాలు భావిస్తున్నాయి. వాస్తవ రెవెన్యూ వృద్ది ఎలా ఉంటుందో చూడాలి.
బ్రెగ్జిట్ పరిణామాలపై కంపెనీ స్పందన:
బ్రెగ్జిట్ పరిణామాలతో ఏదైనా బ్యాంకింగ్ క్లైంట్లు ముందే అనుకున్న సాంకేతిక వ్యయం మీద పునరాలోచిస్తోరేమో చూడాలి. గత త్రైమాసికంలో కంపెనీ ప్రాజెక్టుల్లో బీమా విభాగంలో తక్కువ డిమాండ్‌ను చూశాం. వీటన్నింటికి సంబంధించి కంపెనీ వ్యూహాలేమిటో తెలుసుకోవాలి.
ప్రధాన క్లైంట్ల పనితీరు:
నాలుగు ప్రధాన ఐటీ కంపెనీలను చూసినప్పుడు, విశాల్ సిక్కా ఆగస్టు 2014లో సీఈవోగా పగ్గాలు చేపట్టినప్పటి నుంచి దాని త్రైమాసిక ఆదాయం వృద్ది రేటు 11.13% మిగిలిన వాటి కంటే ఎక్కువ. భవిష్యత్తులో కంపెనీ ఆదాయం ఇలా కొనసాగాలంటే క్లైంట నుంచి ప్రస్తుత ప్రాజెక్టులు కొనసాగడంతో పాటు, నూతన క్లైంట్ల అన్వేషణ కొనసాగాలి. అతిపెద్ద క్లైంట్ల నుంచి కంపెనీ ఎలాంటి రాబడిని కొనసాగిస్తుందో చూడాలి.
ప్రధాన గణాంకాలు
ఒక్కో ఉద్యోగి నుంచి వచ్చే ఉత్పాదకతను పెంచి తద్వారా కంపెనీ లాభదాయకతను 4 శాతం పెంచడం ద్వారా 30 శాతాన్ని అందుకోవాలని కంపెనీ యోచిస్తోంది. అయితే సెప్టెంబరు, 2014 నుంచి ఒక్కో ఉద్యోగిపై వచ్చే ఉత్పాదకత తగ్గుతోంది. వీటిపై కంపెనీ ఏ విధమైన లక్ష్యాలను ప్రకటిస్తుందో గమనించాలి.
బలహీనమైన విషయాలు:
కంపెనీకి సంబంధించి ఎడ్జ్‌వెర్వ్, ఇన్ఫోసిస్ బీపీవోలు ఊహించిన దాని కంటే తక్కువ సామర్థ్యంతో పనిచేస్తున్నాయి. గతేడాది రెండూ కలిసి దాదాపు 13 శాతం స్వల్ప వృద్దితో 9.5 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని రాబట్టాయి. వీటి రాబడిని ఎలా పునరిద్దరిస్తారోనని పెట్టుబడిదారులు ఎదురుచూస్తున్నారు.


Click it and Unblock the Notifications