నాలుగో దశ సార్వభౌమ బంగారు బాండ్ల పథకం జులై 18 నుంచి ప్రారంభం కానుంది. ఇందుకోసం దరఖాస్తులను జులై 18 నుంచి జులై 22 మధ్య స్వీకరించనున్నారు. ఆగస్టు 5 న బాండ్ల కేటాయింపు జరుగుతుందని ఆర్థిక శాఖ గురువారం ఒక ప్రకటనలో వెల్లడించింది.

* ఈ బాండ్లను బ్యాంకులు, స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, నిర్దేశిత పోస్టాఫీసు కార్యాలయాలు, గుర్తింపు పొందిన స్టాక్ ఎక్స్చేంజీలైన ఎన్ఎస్ఈ, బీఎస్ఈ వంటి వాటి ద్వారా అందుబాటులో ఉంచుతారు.
* ప్రభుత్వ సెక్యూరిటీలను గ్రాముల బంగారం రూపంలో అమ్మడాన్నే సార్వభౌమ బాండ్లుగా వ్యవహరిస్తున్నారు.
* నాలుగో దశ నుంచి కనీస పరిమాణాన్ని 2 గ్రాముల నుంచి 1 గ్రాముకు తగ్గించారు. ఈ బాండ్లను ప్రభుత్వం తరపున ఆర్‌బీఐ విడుదల చేస్తుంది.
* 2016-17 ఆర్థిక సంవత్సరంలో మొదటిసారి విడుదల చేస్తున్న బాండ్లు కావడంతో ఈ ఏడాది మొత్తానికి సంబంధించిన పరిమితి ఇప్పటి నుంచి వచ్చే ఏడాది మార్చి నెల వరకూ 500 గ్రాములుగా వర్తించనుంది.
అంటే ఇప్పటి నుంచి ఆర్థిక సంవత్సరం ముగిసే వరకూ ప్రతి వ్యక్తి వారి అర్హతలను బట్టి 500 గ్రాముల వరకూ బంగారు బాండ్లలో పెట్టుబడే పెట్టే వీలుంది.
More From GoodReturns

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

భారీగా పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎంతకు చేరిందంటే.. ఏప్రిల్ 1, బుధవారం ధరలు ఇవే..

బంగారం, వెండి పెట్టుబడిదారులకు బిగ్ అలర్ట్.. సెబీ కొత్త నియమాలు తెలుసుకుని కొనుగోలుకు వెళ్లండి..

బంగారం ధరలు పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎంతకు చేరిందంటే.. మార్చి 31, మంగళవారం ధరలు ఇవే..

Gold: ఐసీఐసీఐ బ్యాంక్లో భారీ గోల్డ్ లోన్ కుంభకోణం! నకిలీ బంగారంతో రూ. 23 కోట్లు మాయం!

ఇరాన్ యుద్దం దెబ్బ.. బంగారం కొనడం మానేసి అమ్మేసుకుంటున్న కేంద్ర బ్యాంకులు.. కారణం ఏంటంటే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాలంటే రూపాయి బలపడాల్సిందే.. ఆర్థిక నిపుణులు ఏమంటున్నారంటే..

ఓ వైపు బంగారం.. మరో వైపు చమురు.. ఇరాన్ యుద్ధం వేళ రష్యా దిమ్మతిరిగే ప్లాన్..



Click it and Unblock the Notifications