రాజకీయ పార్టీలు కార్పొరేట్లను అనవసరంగా రాజకీయాల్లోకి లాగొద్దు: గౌతమ్ అదానీ
తమ సంస్థ ఆస్ట్రేలియాలో పర్యావరణ అనుమతుల విషయంలో ఎదుర్కొంటున్న కష్టాలను చూసిన గౌతమ్ అదానీ, రాజకీయ నాయకులు అనవసరంగా కార్పొరేట్లను రాజకీయాల్లోకి లాగడంపై స్పందించారు. ఎకనమిక్ టైమ్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జైరామ్ రమేష్ చేసిన ఆరోపణపై స్పందించారు. ఇంకా పలు విషయాలపై ఆయన తన అభిప్రాయాలనున వెలిబుచ్చారు.

కాంగ్రెస్ సీనియర్ నేత ఇటీవల 200 కోట్ల ఫైన్‌కు సంబంధించి గౌతమ్ అదానీ, భాజపా ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ఏ చట్టం ప్రకారమైనా రూ. 200 కోట్ల ఫైన్‌ను విదించజాలరని అదానీ అన్నారు. సునీతా నరైన్ నివేదిక తర్వాత యూపీఏ ప్రభుత్వం తమ సంస్థకు షోకాజ్ నోటీసు జారీ చేసిందని అయితే దానికి తాము సమాధానమిచ్చామని తర్వాత వారు(ప్రభుత్వం) ఏమీ చేయాలో నిర్ణయించలేకపోయారన్నారు. ఈ సంఘటన దురదృష్టకరమైనదని అదానీ అన్నారు. తాము రాజకీయ చదరంగంలో పావులు కాదలుచుకోలేదని ఆయన చెప్పారు. కార్పరేట్లను రాజకీయాల్లోకి లాగడం దేశానికి మంచిది కాదని అదానీ అభిప్రాయపడ్డారు.
" మేము ప్రతి రాజకీయ పార్టీతో కలిసి పనిచేస్తున్నాం. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో సైతం నిబద్ధతతో పనిచేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వాల మద్దతు లేకుండా మౌలిక సదుపాయాల కల్పన జరగదు. అభివృద్దికి మద్దతు ఇచ్చే రాష్ట్రాలకు మేము వెళతాం. " అని అదానీ చెప్పుకొచ్చారు.
రఘురామ్ రాజన్‌పై పలువురు చేసిన విమర్శలపై ఈటీ అడిగిన ప్రశ్నకు ఈ విధంగా స్పందించారు. " ఏ వ్యవస్థకైనా వ్యక్తిగత విమర్శలు మంచివి కావు. రఘురామ్ రాజన్ ఆర్‌బీఐ గవర్నర్, సుబ్రమణియన్ స్వామి పార్లమెంట్ సభ్యుడు. వ్యక్తులు వారి వారి అభిప్రాయాలను వెలిబుచ్చేందుకు సరైన వేదికలు ఉన్నాయి. అలాంటి వ్యవస్థలకు, ప్రజా ప్రతినిధులకు ట్విట్టర్ ఒక వేదిక కాకూడదు. "


Click it and Unblock the Notifications