బీమా క్లెయింను ఉత్త‌మంగా అందించే సంస్థ‌లు

బీమా పాల‌సీ తీసుకునేట‌ప్పుడు ప్ర‌ధానంగా గ‌మ‌నించే అంశాల్లో ఒక‌టి క్లెయిం సెటిల్‌మెంట్ రేషియో. దీని అర్థం ఏంటంటే బీమా హామీ మొత్తాన్ని చెల్లిస్తూ, తిర‌స్క‌ర‌ణ‌లు త‌క్కువ‌గా ఉండ‌టం. 2014-15లో ట‌ర్మ్ ప్లాన్ల‌కు సంబంధించి బీమా క్లెయిం సెటిల్‌మెంట్ ఉత్తమంగా క‌లిగిన 7 కంపెనీల‌ను ఇక్క‌డ‌ చూద్దాం.

ఎల్ఐసీ

ఎల్ఐసీ

ఐఆర్‌డీఏలో ఉన్న స‌మాచారాన్ని బ‌ట్టి చూస్తే ఎల్ఐసీ క్లెయిం సెటిల్‌మెంట్ రేషియో 98.16 శాతంగా ఉంది. ఇది అన్ని బీమా కంపెనీలు అందించే ట‌ర్మ్ ప్లాన్ల‌లో అత్య‌ధికం. అందుకే భార‌త‌దేశంలో ఎక్కువ మంది ట‌ర్మ్ ప్లాన్ల కోసం ఎల్ఐసీనే ఎంచుకుంటారు.

 మ్యాక్స్ లైఫ్‌

మ్యాక్స్ లైఫ్‌

2014-15 ఆర్థిక సంవ‌త్స‌రానికి 96.03 శాతంతో మ్యాక్స్ లైఫ్ క్లెయిం సెటిల్‌మెంట్ల విష‌యంలో రెండో స్థానంలో ఉంది. ప్రైవేటు రంగ బీమా కంపెనీల్లో ట‌ర్మ్ ప్లాన్ల‌లో ఎక్కువ క్లెయిం సెటిల్మెంట్ క‌లిగిన కంపెనీ ఇదే.

 బిర్లా స‌న్‌లైఫ్‌

బిర్లా స‌న్‌లైఫ్‌

బిర్లాస‌న్ లైఫ్ కంపెనీ క్లెయిం సెటిల్‌మెంట్ రేషియో 95.30 శాతంగా ఉంది. ఈ కంపెనీకి క్లెయిం కోసం 8436 ద‌ర‌ఖాస్తులు రాగా గ‌త ఆర్థిక సంవ‌త్స‌రంలో 8055 క్లెయింల‌ను సెటిల్ చేసింది. పెండింగ్‌లో ఉన్న క్లెయింల శాతం 1.7 శాతంగా ఉంది.

ఐసీఐసీఐ ప్రుడెన్షియ‌ల్ లైఫ్‌

ఐసీఐసీఐ ప్రుడెన్షియ‌ల్ లైఫ్‌

ప్రైవేటు బీమా రంగంలో మ‌రో అతిపెద్ద సంస్థ ఐసీఐసీఐ ప్రుడెన్షియ‌ల్ లైఫ్‌. ఈ కంపెనీకి క్లెయింల రేషియో 2014-15లో 94.80 శాతంగా ఉంది. ఇత‌ర ప్ర‌యివేటు బీమా కంపెనీల‌తో చూస్తే ఇది బాగానే ఉంది. 12,309 క్లెయింలు అభ్య‌ర్థ‌న‌కు రాగా 11,546 క్లెయింల‌ను సెటిల్ చేసింది. పెండింగ్ క్లెయింల శాతం 0.8 శాతం.

 టాటా ఏఐఏ

టాటా ఏఐఏ

క్లెయిం సెటిల్‌మెంట్ల విష‌యంలో టాటా ఏఐఏకు మంచి ట్రాక్ రికార్డే ఉంది. ఈ కంపెనీ క్లెయిం సెటిల్‌మెంట్ రేషియో 94.47 శాతంగా ఉంది. ఇక్క‌డ మేము చెబుతున్న‌ది ట‌ర్మ్ ప్లాన్ల‌కు సంబంధించి మాత్ర‌మే అని గుర్తుంచుకోండి. పెండింగ్ క్లెయింలు 1 శాతంగా ఉన్నాయి.

 స్టార్ యూనియ‌న్ డైచీ లైఫ్ ఇన్సూరెన్స్‌

స్టార్ యూనియ‌న్ డైచీ లైఫ్ ఇన్సూరెన్స్‌

దేశీయ బ్యాంకులు బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, జ‌పాన్ బీమా దిగ్గ‌జం డైచీల ఉమ్మ‌డి భాగ‌స్వామ్య సంస్థ స్టార్ యూనియ‌న్ డైచీ లైఫ్ ఇన్సూరెన్స్‌. ఈ కంపెనీ క్లెయిం సెటిల్‌మెంట్ రేషియో 94.08 శాతంగా ఉంది.

 పీఎన్‌బీ మెట్‌లైఫ్‌

పీఎన్‌బీ మెట్‌లైఫ్‌

పంజాబ్ నేష‌న‌ల్ బ్యాంక్‌, మెట్‌లైఫ్ సంస్థ‌ల ఉమ్మ‌డి భాగ‌స్వామ్య సంస్థ పీఎన్‌బీ మెట్‌లైఫ్‌. ఈ సంస్థ క్లెయిం సెటిల్‌మెంట్ రేషియో 92.86 శాతంగా ఉంది. పెండింగ్ క్లెయింల శాతం 1.5 శాతంగా ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+