దేశ ప్రజలందరికీ బ్యాంకింగ్ సేవలందించేందుకు ప్రధానమంత్రి ప్రతిపాదించిన జన్‌ధన్ యోజన నెమ్మదిగా ఫలితాలను రాబడుతోంది. జూన్ 29 నాటికి మొత్తం ఖాతాల్లోని నిల్వలు రూ. 39251.57 కోట్లకు చేరాయి. ఇందులో ప్రభుత్వ రంగ బ్యాంకుల వాటా రూ. 30,991 కోట్లు ఉండగా, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల వాటా రూ. 6788 కోట్లుగాను, ప్రయివేటు బ్యాంకుల్లో అతి తక్కువగా రూ. 1472.51 కోట్లుగాను ఉన్నాయి. జీరో బ్యాలెన్స్ అకౌంట్లకు సంబంధించి ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 25.61 శాతం, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల్లో 21.35 శాతం, ప్రయివేటు బ్యాంకుల్లో 37.33 శాతంగా ఉన్నాయి. మొత్తం మీద బ్యాంకింగ్ రంగంలో చూస్తే ఈ పథకం కింద ఉన్న జీరో బ్యాలెన్స్ ఖాతాలు 25.29 శాతంగా ఉన్నాయి.

ఈ పథకం రెండు దశల్లో అమలు చేయబడుతోంది. మొదటి దశలో ఆగస్టు 15,2104 నుంచి ఆగస్టు 14,2015 మధ్య దేశంలో బ్యాంకింగ్ రంగానికి దూరంగా ఉన్న వారి చేత ఖాతాలను తెరిపించారు. రెండో దశలో 15 ఆగస్టు 2015 నుంచి 14 ఆగస్టు, 2018 మధ్య అందరికీ సూక్ష్మ బీమాను అందించడం. ఈ క్రమంలోనే ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, అటల్ పెన్షన్ యోజన పథకాలను ప్రారంభించారు. ఈ మూడింటిలో అటల్ పెన్షన్ యోజనకు స్పందన తక్కువగా వస్తోంది.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!



Click it and Unblock the Notifications