జులై 31, 2016 లోపు ఆదాయపు పన్ను రిటర్నులు ఫైల్ చేయకపోతే ఏమవుతుంది?
వ్యక్తులకు ట్యాక్స్ రిటర్నులు ఫైల్ చేసేందుకు జులై 31 చివరి తేదీ. మీ ఆదాయం పన్ను పరిమితి అయిన రూ. 2.5 లక్షలకు మించి ఉంటే ఆదాయపు పన్ను రిటర్నులను సమర్పించాలి. ఒకవేళ గడువులోగా రిటర్నులు ఫైల్ చేయకపోతే ఏమవుతుందో చూద్దాం.

పెనాల్టీలు
జులై 31, 2016 లోపు ఆదాయపు పన్ను రిటర్నులు ఫైల్ చేయకపోతే పెనాల్టీలు కట్టాల్సి రావచ్చు. పెనాల్టీ ఎంత, పెనాల్టీ విధిస్తారా లేదా అనే అంశాలు పన్ను లెక్కింపు అధికారిపై ఆధారపడి ఉంటాయి.

పన్ను రిటర్నులను మార్చలేరు
తుది గడువు జులై 31లోపు రిటర్నులను సమర్పించిన వారికి తర్వాత మార్పుచేర్పులకు అవకాశం ఉంటుంది. ఆ లోపు చేయని వారికి పన్ను రిటర్నుల్లో మార్పులు చేసుకోవడానికి అవకాశం ఉండదు.

నోటీసుల జారీ
ఆదాయపు పన్ను త్రెషోల్డ్ పరిమితి రూ. 2.5 లక్షలను దాటి ఉండి, పన్ను రిటర్నులను సకాలంలో సమర్పించకపోతే ఆదాయపు పన్ను శాఖ నోటీసులు జారీ చేస్తుంది.

1 శాతం రుసుము
ఆదాయపు పన్ను శాఖ అధికారులు మీరు పన్ను కట్టాల్సిందిగా గుర్తించి మీరు సకాలంలో చెల్లించకపోయినట్లయితే మీరు రుసుములు చెల్లించాల్సి ఉంటుంది. మీరు పన్ను రిటర్నులను సమర్పించే వరకూ అదనంగా నెలకు 1 శాతం చొప్పున రుసుములను సమర్పించాల్సి ఉంటుంది.

నష్టాలను క్యారీ ఫార్వర్డ్ చేయలేరు
గడువులోగా రిటర్నులను ఫైల్ చేయనివారు ఈ ఏడాది మూలధన నష్టాలను వచ్చే ఏడాదికి క్యారీ ఫార్వర్డ్ చేయలేరు. షేర్లపైన వచ్చే లాభాలు ఉంటే ఇది ఎక్కువగా వర్తిస్తుంది.

నోటీసు వస్తే వృత్తి నిపుణుడిని సంప్రదించండి
ఆలస్యంగా ఫైల్ చేసినదానికి ఇది పరిష్కార మార్గం కాకపోయినా, వృత్తినిపుణున్ని సలహా కోసం సంప్రదించవచ్చు. అసలు ఫైలింగ్ చేయకుండా ఉండి దానికి నోటీసు అందుకుంటే, ఇలాంటి విషయాల్లో అనుభవం ఉన్న చార్టెడ్ అకౌంటెంట్‌ను కలిసి వివరించడం మంచిది.
పన్ను లెక్కింపు అధికారితో మాట్లాడి ఇలాంటి వాటిని పరిష్కరించడంలో వీరు ఏదైనా చేయగలరు.

ట్యాక్స్ రిటర్నులను సమర్పించే చివరి తేదీ
ఫారంలో ఉన్న సమాచారం మేరకు ట్యాక్స్ రిటర్నులను సమర్పించేందుకు చివరి గడువు జులై 31,2016. అంతకుముందు ఏడాది ఐటీ అధికారులు తుది గడువును పెంచారు. ఇలా ప్రతి ఏడాది జరుగుతుందని చెప్పలేము. 2015-16 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఇప్పటివరకూ దీనికి సంబంధించి ఎలాంటి నోటిఫికేషన్ ఇవ్వలేదు.


Click it and Unblock the Notifications