ట‌ర్మ్ డిపాజిట్, టైమ్ డిపాజిట్ రెండు ఒక‌టేనా?

ట‌ర్మ్ డిపాజిట్‌, టైమ్ డిపాజిట్‌(కాల‌ప‌రిమితి డిపాజిట్‌) వంటి ప‌దాల‌ను ఒకే అర్థంలో వాడుతూ ఉంటాం. ఫిక్స్‌డ్ డిపాజిట్ తెరిచేట‌ప్పుడు డిమాండ్ డిపాజిట్‌, ట‌ర్మ్ డిపాజిట్, టైమ్ డిపాజిట్ వంటి ప‌దాల‌ను త‌రుచూ ఉప‌యోగిస్తుండ‌టాన్ని మ‌నం చూస్తుంటాం.
ఏది ఏమైన‌ప్ప‌టికీ, కొన్ని సంద‌ర్భాల్లో ఈ రెండింటి మ‌ధ్య కొంత బేధం ఉన్న‌ప్ప‌టికీ, మ‌రికొన్ని సందర్భాల్లో రెండింటి మ‌ధ్య పెద్ద‌గా తేడా ఉండ‌దు.

difference between term deposit and time deposit

ట‌ర్మ్ డిపాజిట్, టైమ్ డిపాజిట్ మ‌ధ్య ఉండే బేధాలు:
ఫిక్స‌డ్ డిపాజిట్‌కు సాధార‌ణంగా ఎక్కువ‌గా వాడే ప‌దం ట‌ర్మ్ డిపాజిట్‌. ఒక డిపాజిట్‌లో డ‌బ్బు జ‌మ చేసి కొంత కాలం త‌ర్వాత విత్‌డ్రా చేసుకోగ‌ల వీలుండేవే ట‌ర్మ్ డిపాజిట్‌. టైమ్ డిపాజిట్ విష‌యంలో కూడా ఇదే జ‌రుగుతుంది. కొన్ని రోజుల పాటు ఉండే స్వ‌ల్ప‌కాలిక డిపాజిట్ల విష‌యంలో టైమ్ డిపాజిట్ అనే ప‌దాన్ని వాడ‌తారు.
ఉదాహ‌ర‌ణ‌కు ట‌ర్మ్ అనే ప‌ద‌మే దీర్ఘ‌కాలం అన్న అర్థాన్ని స్పురిస్తుంది. అందువ‌ల్ల టైమ్ డిపాజిట్ ప‌దాన్ని స్వ‌ల్పకాలిక డిపాజిట్ల‌కు, ట‌ర్మ్ డిపాజిట్లు అన‌గానే కాస్త ఎక్కువ కాలం ఉండే స్వ‌ల్ప‌కాలిక డిపాజిట్ల‌కు వాడ‌తారు.
అంటే డిపాజిట్లు 15 రోజులు, 20 రోజులు, 45 ర‌జులు ఉండే వాటికి టైమ్ డిపాజిట్ అని వాడితే స‌రిపోతుంది. అంత‌ర్జాతీయంగా చూస్తే టైమ్ డిపాజిట్ల‌ను విత్‌డ్రా చేసేందుకు ఎటువంటి ముంద‌స్తు నోటీసు ఇచ్చే విధానం ఉంది. భార‌త‌దేశంలో ఇటువంటి డిపాజిట్ల విష‌యంలో ఎటువంటి ముంద‌స్తు నోటీసు లేకుండా విత్‌డ్రా చేసుకోవ‌చ్చు. ఇది ఎక్కువ‌గా వ్య‌క్తిగ‌త డిపాజిట్ల విష‌యంలో వ‌ర్తిస్తుంది.

ట‌ర్మ్ డిపాజిట్‌, టైమ్ డిపాజిట్ల విష‌యంలో ప‌న్ను అంశాలు
ట‌ర్మ్ డిపాజిట్, టైమ్ డిపాజిట్ వంటి ప‌దాల విష‌యంలో కాల‌ప‌రిమితిలో తేడా ఉన్నప్ప‌టికీ మిగిలిన విష‌యాలు పెద్ద‌గా మార‌వు. ఉదాహ‌ర‌ణ‌కు ఈ డిపాజిట్ల విష‌యంలో ప‌న్ను ఒకేలా ఉంటుంది. టైమ్ డిపాజిట్‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంటే రూ. 10 వేల వ‌డ్డీ ఆదాయం ఉంటే టీడీఎస్ మిన‌హాయింపు జ‌రుగుతుంది. ట‌ర్మ్ డిపాజిట్ విష‌యంలో కూడా ఇది ఇలానే అమ‌ల‌వుతుంది.

ప‌న్ను లెక్కించేట‌ప్పుడు వ‌డ్డీ ద్వారా సంక్రమించే ఆదాయాన్ని మొత్తం ఆదాయానికి జ‌మ చేస్తారు. ట‌ర్మ్ డిపాజిట్‌కు కానీ టైమ్ డిపాజిట్‌కు కానీ టీడీఎస్ మిన‌హాయింపు కాకుండా చేయాలంటే ఫారం 15జీ లేదా ఫారం 15హెచ్‌ను స‌మ‌ర్పించ‌వ‌చ్చు.


ముగింపు :

పైన తెలిపిన అన్ని అంశాల ఆధారంగా ఈ రెండు డిపాజిట్ల విష‌యంలో పెద్ద‌గా తార‌త‌మ్య‌మేమీ ఉండ‌దు. భార‌త‌దేశంలో దాదాపు రెండింటినీ ఒకే అర్థంలో వాడుతూ ఉంటారు. అయితే టైమ్ డిపాజిట్ అనే ప‌దం వాడ‌కాన్ని త‌క్కువ‌గా ఉప‌యోగించ‌డాన్ని గ‌మ‌నించ‌వ‌చ్చు. చాలా మంది ఫిక్స్‌డ్ డిపాజిట్ అనే ప‌దాన్ని త‌ర‌చూ వింటూ ఉంటారు. వీటిని బ్యాంక‌ర్లు ఎక్కువ ట‌ర్మ్ డిపాజిట్లుగా వ్య‌వ‌హ‌రిస్తుంటారు.

భార‌త‌దేశంలో ట‌ర్మ్ డిపాజిట్ ప‌దాన్ని త‌క్కువ‌గా వాడ‌తారు. దీని వాడ‌కం భార‌త‌దేశం వెలుప‌ల ఎక్కువ‌గా ఉంటుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+