ఈ-ఫైలింగ్ చేసేవారు డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికెట్ కోసం నమోదు చేసుకునే విధానం
ముద్రిత పత్రాలను చేతి సంతకంతో ధ్రువీకరించినట్లే ఎలక్ట్రానిక్ డాక్యుమెంట్లను సైతం ఆన్‌లైన్‌లో ధ్రువీకరించేందుకు డిజిటల్ సిగ్నేచర్‌ను ఉపయోగిస్తారు. కంట్రోలర్ ఆఫ్ సర్టిఫయింగ్ అథారిటీస్(సీసీఏ) కార్యాలయం ఇలాంటి సర్టిఫికెట్లను జారీచేసే అధీకృత సంస్థ. ఈ సర్టిఫికెట్లను మొదట సర్టిఫయింగ్ అధికారులకు జారీ చేస్తే వారు అంతిమ వినియోగదారులకు డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికెట్లను(డీఎస్‌సీ) అందజేస్తారు.

డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికెట్‌కు నమోదు చేసుకునేందుకు అనుసరించాల్సిన దశలు
మొదటి దశ:
ఇన్‌కమ్‌ట్యాక్స్ వెబ్‌సైట్‌లో ఈ-ఫైలింగ్ కోసం లాగిన్ అవ్వాలి
ప్రొఫైల్ సెట్టింగ్స్‌లోకి వెళ్లాలి
డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికెట్ నమోదు కోసం బటన్ మీద క్లిక్ చేయాలి
రెండో దశ:
. పీఎక్స్ఎఫ్ ఫైల్ ఉపయోగించి డీఎస్‌సీ
డీఎస్‌సీ.పీఎక్స్ఎఫ్ ఫైల్ రకాన్ని ఎంచుకోవాలి
బ్రౌజ్ చేసి, కీస్టోర్ ఫైల్‌ను అటాచ్ చేయాలి
ప్రైవేట్‌కీ కి సంబంధించిన పాస్‌వర్డ్ ఎంటర్ చేయాలి
జనరేట్ సిగ్నేచర్ ఫైల్‌పైన క్లిక్ చేయాలి
రెండోదశ(అ):
యూఎస్‌బీ టోకన్‌ను ఉపయోగించి డీఎస్‌సీ
డీఎస్‌సీ యూఎస్‌బీ టోకన్ రకాన్ని ఎంచుకోవాలి
యూఎస్‌బీ టోకన్ సర్టిఫికెట్‌ను సెలెక్ట్ చేయాలి
జనరేట్ సిగ్నేచర్ ఫైల్‌పైన క్లిక్ చేయాలి
మూడో దశ:
ఈ దశలో సిగ్నేచర్ ఫైల్‌ను బ్రౌజ్ చేసి అటాచ్ చేయాలి.
సబ్‌మిట్ మీట నొక్కండి.
డిజిటల్ సిగ్నేచర్‌ను ఉపయోగించి ట్యాక్స్ రిటర్నును ఫైల్ చేస్తే దానికి మళ్లీ ప్రింట్ కాపీని సమర్పించాల్సిన
అవసరం ఉండదు.
డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికెట్ల జారీ కోసం సీసీఏ అనుమతి పొందిన ఏడు ఏజెన్సీలు ఉన్నాయి.
అవి:
www.safescrypt.com
www.nic.in
www.idrbtca.org.in
www.tcs-ca.tcs.co.in
www.mtnltrustline.com
www.ncodesolutions.com
www.e-Mudhra.com


Click it and Unblock the Notifications