2016లో భారత్‌లో పనిచేసేందుకు 10 ఉత్తమమైన కంపెనీలు
భారత్‌లో పనిచేసేందుకు 10 ఉత్తమ కంపెనీల జాబితాను ఎకనమిక్ టైమ్స్(ఈటీ) తయారుచేసింది. స్నేహపూర్వక పనివాతావరణం, అనుకూలమైన పనిగంటలు, మహిళలకు అనువైన పాలసీలు, ఎక్కువ ప్రేరణ పొందే ఉద్యోగులు వంటి కారణాల రీత్యా ఆయా కంపెనీలు జాబితాలో చోటు దక్కించుకున్నాయి.

గూగుల్ ఇండియా
సమస్యను పరిష్కరించే నైపుణ్యాలు, వారి స్థానానికి తగ్గ జ్ఞానం, వేగంగా పనిపూర్తిచేయడం వంటివి గూగుల్ ఉద్యోగులకు సంబంధించి అతిముఖ్యమైన అంశాలని ఈటీ నివేదిక పేర్కొంది. దీంతో గూగుల్ ఇండియా మొదటి స్థానాన్ని దక్కించుకుంది.

అమెరికన్ ఎక్స్‌ప్రెస్ ఇండియా
అమెరికాకు చెందిన ప్రముఖ క్రెడిట్ కార్డ్ కంపెనీ ఇది. ఈ కంపెనీకి అమెరికా వెలుపల భారత్‌లోని కార్యాలయంలోనే అతి ఎక్కువగా 11 వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు.

ఉజ్జీవన్ ఫైనాన్సియల్ సర్వీసెస్
ఈ కంపెనీ గతంలో ఉన్న 24 వ స్థానం నుంచి ఈ ఏడాది మూడో స్థానానికి ఎగబాకింది. ఈ కంపెనీ ప్రత్యేకత ఏంటంటే ఇందులో ఉద్యోగులకు జాబ్ టైటిల్స్ లేకపోవడం.

టెలిపర్‌ఫార్మెన్స్
స్పూర్తి రగిలించే పనివాతావరణాన్ని సృష్టించడం, శుభ్రమైన, అధునాతన పని ప్రదేశం, శిక్షణ సౌకర్యాలు, ఆహ్లాదకరమైన సమావేశ మందిరాలు వంటివాటిని తయారుచేయడంలో కంపెనీ పెట్టుబడులు పెట్టడంతో జాబితాలో చోటు సంపాదించింది.

గోద్రెజ్ కన్స్యూమర్స్
సర్వే గోద్రెజ్ కన్స్యూమర్స్ ప్రైవేట్ లిమిటెడ్‌ను ఎందుకు గుర్తించిందంటే ఆ సంస్థ తమ ఉద్యోగులను సాధికారత, సవాళ్లు, పనివాతావరణాన్ని ఆస్వాదించేలా నడిపించినందుకు.

మ్యారియట్ హోటల్స్ ఇండియా
మ్యారియట్ హోటల్స్ వ్యవస్థాపకుల తత్వానికి అనుగుణంగా ఆ సంస్థలో పనిచేసే ఉద్యోగులకు గొప్పవాటిలో ఒకటిగా తయారైంది.

శ్యాప్‌ల్యాబ్స్ ఇండియా
ఉత్తమ కంపెనీల జాబితాలో గతేడాది 5వ స్థానంలో ఉన్న శ్యాప్‌ల్యాబ్స్ ఇండియా ఈ సంవత్సరం 7వ స్థానానికి పడిపోయింది.

ఒబెరాయ్ గ్రూప్
ట్రావెల్+ లీజర్ పాఠకులు 2015లో ఒబెరాయ్ హోటల్స్& రిసార్ట్స్‌ను ప్రపంచ ఉత్తమ హోటల్‌గా ఎంచుకున్నారు. ప్రఖ్యాతిగాంచిన ఈ హోటల్ ఉద్యోగులు వినియోగదారుల అంచనాలను చేరుకోవడంతో ఈ సంస్థ 8వ స్థానాన్ని దక్కించుకుంది.

లెమన్ ట్రీ హోటల్స్
లెమన్ ట్రీ హోటల్స్‌లో మేనేజర్లంతా సైగలతో మాట్లాడే భాషను తెలుసుకుని ఉండాలి. ఇందుకోసం ఇప్పటి వరకూ 800 ఉద్యోగులు ఈ రకమైన శిక్షణను పొందారని ఈటీ నివేదించింది.

ఇన్‌ట్యూట్ ఇండియా ప్రాడక్ట్
ఇన్‌ట్యూట్ ఇండియా ఇంతకుముందు ఉన్న 7వ స్థానం నుంచి పదో స్థానానికి దిగజారింది.


Click it and Unblock the Notifications