పెట్టుబడిదారుల లాభాల స్వీకరణతో రెండేళ్ల గరిష్ట స్థాయి నుంచి తగ్గిన బంగారం ధరలు
పెట్టుబడిదారులు అధిక ధరల వద్ద లాభాల స్వీకరణకు మొగ్గుచూపడంతో బంగారం ధరలు రెండేళ్ల గరిష్ట స్థాయి నుంచి పడిపోయాయి. అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ ఔన్స్‌కు 1345 డాలర్లు(0.7శాతం) తగ్గింది. గత రెండేళ్లలో బంగారం ఒక దశలో ఔన్సుకు 1357.60డాలర్లు పెరిగింది.

దేశీయ మార్కెట్లలో బంగారం రూ. 32 వేల అధిక స్థాయికి వెళ్లి ఇటీవలి పరిణామాలతో మళ్లీ దిగి వచ్చింది. ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్‌లో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 31, 300 గాను, 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 29,240 గాను ఉంది.
బంగారంలో కొనసాగుతున్న ర్యాలీ స్వల్పకాలమేనని, ఆ తర్వాత లాభాల స్వీకరణ ఉంటుందని డీలర్లు చెబుతున్నారు. బ్రెగ్జిట్ భయాలతో అందరూ బంగారం వైపు చూస్తున్నారు. దీన్నినియంత్రించేందుకు ప్రస్తుతం ఏ సాధనాలు లేనందున అలాగే కొనసాగుతోంది.
గత కొన్ని రోజుల్లో రూపాయి కాస్త బలపడింది. దీంతో బంగారం కొద్దిగా తక్కువ ధరలకు లభించడం జరిగింది. అయితే అంతర్జాతీయంగా బంగారం ధరల్లో ఇంత హెచ్చుతగ్గులు లేవు.
మామూలుగా బంగారం ధరలు పెరిగినప్పుడు ఈక్విటీలను అమ్మేస్తారు. అయితే దానికి భిన్నంగా బంగారం, ఈక్విటీలు ఒకేసారి పెరుగుతూ వచ్చాయి.
Read in English: Gold Falls From 2-Year Highs As Investors Book Profit


Click it and Unblock the Notifications