జులై నెల‌లో ఫిక్స్‌డ్ డిపాజిట్ల‌కు ఉత్త‌మ వ‌డ్డీ రేట్లు అందించే సంస్థ‌లు

గ‌త కొన్ని త్రైమాసికాల్లో వ‌డ్డీ రేట్లు త‌గ్గిపోయాయి. దీంతో పెట్టుబ‌డిదార్ల‌కు 8-9 శాతం వ‌డ్డీ కూడా రావ‌డం క‌ష్ట‌మైపోయింది. జులై నెల‌కు సంబంధించి 7 ఉత్త‌మ ఫిక్స‌డ్ డిపాజిట్ల గురించి పెట్టుబ‌డిదారులు ఇక్క‌డ తెలుసుకోవ‌చ్చు.


డీహెచ్ఎఫ్ఎల్‌

40 నెల‌ల డీహెచ్ఎఫ్ఎల్ డిపాజిట్‌లో మీకు 8.90 శాతం వ‌డ్డీ ల‌భిస్తుంది. ఈ డిపాజిట్ల‌కు ఏఏఏ రేటింగ్ ఉండ‌టం వ‌ల్ల సుర‌క్షిత‌మైన‌విగా చెప్పుకోవ‌చ్చు. రూ. 50 ల‌క్ష‌ల‌కు మించి చేసే డిపాజిట్ల‌కు 9.15 శాతం వ‌డ్డీని పొందే వీలుంది.

ఆర్‌బీఎల్ బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్స్‌
ఆర్‌బీఎల్ బ్యాంక్‌లో 24 నెల‌ల డిపాజిట్‌కు వ‌డ్డీ 8.77 శాతం వ‌స్తుంది. రాబ‌డి 9.11 శాతం వ‌ర‌కూ వ‌చ్చే అవ‌కాశం ఉంది. ఈ విభాగంలో ఇది బ్యాంక్ వైపు నుంచి చూస్తే మంచిది. మిగిలిన కాల‌ప‌రిమితి డిపాజిట్ల‌కు వ‌డ్డీ రేట్లు త‌క్కువ‌గా ఉన్నాయి.

బ‌జాజ్ ఫైనాన్స్‌
18 నుంచి 60 నెల‌ల ఫిక్స్‌డ్ డిపాజిట్ల‌కు బ‌జాజ్ ఫిన్‌స‌ర్వ్ 8.65 శాతం వ‌డ్డీ రేట్ల‌ను అందిస్తోంది. సీనియ‌ర్ సిటిజ‌న్ల‌కు అద‌నంగా 0.25 శాతం అద‌నంగా ఇస్తారు. ఈ డిపాజిట్ల‌కు ఏఏఏ రేటింగ్ క‌లిగి ఉండ‌టం వ‌ల్ల సురక్షిత‌మైన‌వే.

కేటీడీఎఫ్‌సీ ఫిక్స్‌డ్ డిపాజిట్‌
కేర‌ళ ప్ర‌భుత్వం హామీ ఉండ‌టం మూలంగా ఇవి సుర‌క్షిత‌మైన‌వి. ఈ డిపాజిట్ల‌పై 8.50 వ‌డ్డీ రేటు ల‌భిస్తుంది. సీనియ‌ర్ సిటిజ‌న్ల‌కు 8.75 శాతం వ‌డ్డీ వ‌స్తుంది. 5 ఏళ్ల డిపాజిట్ల‌కు రాబడి 10 శాతం వ‌ర‌కూ రావ‌చ్చు.

శ్రీ‌రామ్ ట్రాన్స్‌పోర్ట్ ఫైనాన్స్‌
4,5 ఏళ్ల ఫిక్స్‌డ్ డిపాజిట్ల‌కు శ్రీ‌రామ్ ట్రాన్స్‌పోర్ట్ ఫైనాన్స్ 8.75 శాతం వ‌డ్డీని అందిస్తుంది. కంపెనీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు అంత సుర‌క్షిత‌మైన‌వి కాద‌ని గుర్తుంచుకోండి. సుర‌క్షిత‌మైన, ఎక్కువ రేటింగ్ క‌లిగిన కంపెనీల్లో పెట్టుబ‌డి పెట్టడానికి ప్ర‌య‌త్నించండి. ఈ కంపెనీ డిపాజిట్ల‌కు ఏఏఏ రేటింగ్‌ను క‌లిగి ఉంది.

మహీంద్రా ఫైనాన్స్‌
అన్ని కాల‌ప‌రిమితి డిపాజిట్ల‌కు మహీంద్రా ఫైనాన్స్ 8.45 శాతం వ‌డ్డీ రేటును అందిస్తుంది. ఈ డిపాజిట్ల‌కు ఏఏఏ రేటింగ్ ఉంది. సాపేక్షికంగా చూస్తే మ‌హీంద్రా గ్రూప్ నుంచి వ‌చ్చినందున ఇవి సుర‌క్షిత‌మైన‌విగా చెప్పుకోవ‌చ్చు.

ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్‌
4 ఏళ్ల ఫిక్స్‌డ్ డిపాజిట్‌కు ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ 8.40 శాతం వ‌డ్డీ రేటును అందిస్తుంది. ప్ర‌స్తుతం వ‌డ్డీ రేట్లు త‌గ్గుతున్న త‌రుణంలో ఇది త‌క్కువేమీ కాదు. కంపెనీ ఫిక్స్‌డ్ డిపాజిట్ల‌కు వ‌డ్డీ ద్వారా వ‌చ్చే డ‌బ్బు రూ. 5 వేల‌కు మించి ఉంటే దానికి టీడీఎస్ వ‌ర్తిస్తుంద‌ని గుర్తుంచుకోండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+