హైదరాబాద్: భాగ్యనగరం కేంద్రంగా హైపర్ లోకల్ మార్కెట్ సేవలు అందిస్తున్న యాడ్‌రోబ్.. స్థానిక వర్తకులు, రిటైలర్లు తమ ఉత్పత్తులు, సేవలను ప్రమోట్ చేసుకోవడంతో పాటు వాటిని వినియోగదారులకు అందించే వీలును కూడా కల్పిస్తోంది. త్వరలో యాడ్‌రోబ్ చిన్న నగరాలకు కూడా విస్తరించనుంది.
www.adrobe.in ఇటు వినియోగదారులకు, అటు వ్యాపారులకు సంధానకర్తగా పని చేస్తుందని చెప్పవచ్చు. ఇది అమ్ముకునేవారికి, వినియోగదారులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
ఇందులో, వ్యాపారులు అడ్వర్టయిజ్‌మెంట్ల రూపంలో ఉత్పత్తులను ప్రచారం చేసుకొని విక్రయించుకునే సౌలభ్యం ఉంది. ప్రస్తుతం ఈ సంస్థలో వెయ్యి మంది వెండర్స్ నమోదయ్యారు.
ఇక కష్టమర్ల పరంగా ఆలోచిస్తే... గాడ్జెట్స్, ఎలక్ట్రానిక్, ఫ్యాషన్.. ఇలా వందకు పైగా కేటగిరీలు ఉన్నాయి. వీటి ద్వారా సుమారు నాలుగు వేలకు పైగా ఉత్పత్తులను కొనుగోలు చేసుకునే వీలు ఉంది. ఉచితంగా 24 గంటలలో డెలివరీ చేస్తారు.
దీనిని కేశిరెడ్డి రాజిరెడ్డి గత ఏడాది అక్టోబర్ నెలలో రూ.కోటి పెట్టిబడితే స్థాపించారు. గ్రోత్ క్యాపిటల్ కోసం నిధుల సమీకరణ చేయాలని ఆయన నిర్ణయించనున్నారు. కొద్ది రోజుల క్రితం ముంబైకి చెందిన ఓ ప్రయివేట్ ఈక్విటీ ప్లేయర్లతో ప్రాథమిక చర్చలు జరిగాయి. రూ.30 కోట్లకు పైగా పెట్టుబడులకు సిద్ధంగా ఉన్నారు.

ప్రస్తుతం వెయ్యి మంది వర్తకులు ఈ యాడ్‌రోబ్‌లో నమోదై ఉన్నారు. రెండు మూడు నెలల్లో దీనిని అయిదు వేలకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. తొలి ఏడాది రూ.3కోట్ల టర్నోవర్ లక్ష్యంగా పెట్టుకున్నారు. 2016-17 ఆర్థిక సంవత్సరం ముగింపు నాటికి 10 పట్టణాలకు విస్తరించనున్నారు.
ఈ ఏడాది చివరి కల్లా విజయవాడ, విశాఖ, గుంటూరు, వరంగల్, తిరుపతిలకు విస్తరించనున్నారు. వచ్చే నెలలో వరంగల్‌లో ప్రారంభమవుతుంది.
యాడ్‌రోబ్ ప్రత్యేకతలు...
యాడ్‌రోబ్ వ్యాపారులకు, వినియోగదారులకు సంధానకర్తగా పని చేస్తుంది.
వ్యాపారులు అడ్వర్టయిజ్‌మెంట్ రూపంలో తమ వస్తువులను విక్రయించుకోవచ్చు.
వినియోగదారులకు వేలాది ఉత్పత్తులు అందుబాటులో ఉంటాయి. 24 గంటలలోనే డెలివరీ.
ప్రతి వ్యాపారికి ఓ ప్రత్యేక పేజీ ఉంటుంది. అందులో వారి పూర్తి వివరాలు ఉంటాయి.
కొనుగోలులో సందేహాలు ఉంటే పుష్ టు కాల్, పుష్ టు మెయిల్ ఆప్షన్లు ఉంటాయి. వీటిని క్లిక్ చేస్తే నేరుగా మీరు వెండర్‌కు కనెక్ట్ కావొచ్చు.
మీరు ఉన్న పరిధిలోనే.. బెస్ట్ ఆఫర్ల్ చూసుకొని కొనుక్కోవచ్చు.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications