ముంబై: ఇండియాలోని రెండవ అతిపెద్ద ఐటీ సేవల సంస్థ ఇన్ఫోసిస్ కంపెనీ సీఈఓగా విశాల్ సిక్కా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత కంపెనీని లాభాల బాట పట్టిస్తున్నారు. నాలుగో త్రైమాసిక గణాంకాలను శుక్రవారం విడుదల చేసింది. మార్కెట్ విశ్లేషకుల అంచనాలను అధిగమిస్తూ ఇన్ఫోసిస్ మెరుగైన ఫలితాను నమోదు చేసింది.
గత త్రైమాసికం కంటే అధికంగా 3.9శాతం లాభాలను ఆర్జించిన ఇన్ఫోసిస్, ఈ నాలుగో త్రైమాసికంలో రూ.3597 కోట్ల నికర ఆదాయాన్ని నమోదు చేసింది. చివరి త్రైమాసికంలో ఈ కంపెనీ నికర ఆదాయం రూ.3465 కోట్లగా ఉంది. మార్కెట్ విశ్లేషకుల అంచనాలకు మించిన ఆదాయం, లాభాలను ఇన్ఫోసిస్ అందుకోవడం ఇది నాలుగోసారి.
"ఈ త్రైమాసికంలో మేము సాధించిన ఫలితాలను చూసి గర్వపడుతున్నాం. ఐటీ పరిశ్రమలోనూ సంకేతాలు బాగున్నాయి. భవిష్యత్తులో మా ప్రయాణం మరింత సుఖవంతమవుతుందని భావిస్తున్నాం" అని ఫలితాల విడుదల సందర్భంగా శిక్కా వ్యాఖ్యానించారు. ఈ ఏడాది ఐటీలో 10 నుంచి 12 శాతం ఆదాయవృద్ధిని అంచనా వేస్తుండగా, ఇన్ఫోసిస్ 11.5 నుంచి 13.5 శాతం వరకూ ఆదాయ వృద్ధి ఉంటుందని ఆయన అన్నారు.

ఇన్ఫోసిస్ ఫలితాలు సోమవారం నాడు స్టాక్ మార్కెట్ ను ప్రభావితం చేస్తాయని విశ్లేషకులు భావిస్తున్నారు. శ్రీరామనవమి కారణంగా శుక్రవారం మార్కెట్లకు సెలవన్న సంగతి తెలిసిందే. ఆపై శని, ఆదివారాల తరువాత, సోమవారం నాడు ఇన్ఫోసిస్ మంచి లాభాలను నమోదు చేస్తుందని, దాని ప్రభావం ఇతర ఐటీ కంపెనీలపైనా ఉంటుందని అంచనా వేస్తున్నారు.
కాగా, 2015-16 ఆర్థిక సంవత్సరపు తుది డివిడెండ్ గా ఒక్కో ఈక్విటీకి రూ. 14.25ను అందిస్తున్నట్టు ఫలితాలను ఆమోదించిన వేళ, బోర్డు డైరెక్టర్లు తెలిపారు. మేనేజ్ మెంట్ మార్పులకూ ఆమోదం తెలుపుతూ మోహిత్ జోషి, రవి కుమార్, సందీప్ దడ్లానీలను వారి విభాగాల్లో ప్రెసిడెంట్లుగా నియమిస్తున్నామని, ఈ నిర్ణయాలు తక్షణం అమల్లోకి వస్తాయని ఇన్ఫోసిస్ వెల్లడించింది.
సోమవారం రోజు ప్రారంభమయ్యే ట్రేడింగ్ లో ఇన్ఫోసిస్ షేర్లు లాభాల బాట పట్టే అవకాశం ఉంటుందని నిపుణులంటున్నారు. దీని ప్రభావం ఇతర ఐటీ కంపెనీలపై కూడా ఉండి, లాభాలను నమోదుచేస్తాయని అంచనావేస్తున్నారు.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!



Click it and Unblock the Notifications