హైదరాబాద్: భాగ్యనగరం కేంద్రంగా హైపర్ లోకల్ మార్కెట్ సేవలు అందిస్తున్న యాడ్‌రోబ్.. స్థానిక వర్తకులు, రిటైలర్లు తమ ఉత్పత్తులు, సేవలను ప్రమోట్ చేసుకోవడంతో పాటు వాటిని వినియోగదారులకు అందించే వీలును కూడా కల్పిస్తోంది.
ప్రస్తుతం తమ యాడ్‌రోబ్‌లో జంటనగరాల నుంచి వెయ్యి మందికి పైగా స్థానిక వ్యాపారులు నమోదు చేసుకున్నారని వ్యవస్థాపకులు, ఎండీ కేశిరెడ్డి రాజిరెడ్డి సోమవారం నాడు చెప్పారు. వీటి ద్వారా మూడవేల ఉత్పత్తులను ఎంచుకునే వీలుందని తెలిపారు.
www.adrobe.in ద్వారా హైదరాబాద్‌లో లాంఛనంగా కార్యకలాపాలను ప్రారంభించింది. ఈ సందర్భంగా రాజిరెడ్డి మాట్లాడారు. జంట నగరాలతోపాటు పట్టణాల్లోని చిన్న వ్యాపారులు ఆన్‌లైన్‌లో విక్రయాలు చేయడానికి యాడ్‌రోబ్ అవకాశం కల్పిస్తుందన్నారు.

త్వరలో బెంగళూరు, చెన్నై, విశాఖ, విజయవాడ, వరంగల్, తిరుపతి వంటి నగరాలకు విస్తరించాలని భావిస్తున్నట్లు చెప్పారు. నిత్యవసర సరుకులు నుంచి ఫ్యాషన్ దుస్తులు, ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల వరకూ 100 విభాగాల్లో మూడువేల రకాల వస్తువులను తమ వెబ్‌సైట్ ద్వారా విక్రయానికి ఉంచామన్నారు.
హైదరాబాద్‌కు చెందిన వెయ్యి మంది విక్రేతలు ఇప్పటికే తమ వస్తువులను విక్రయిస్తున్నారని, త్వరలో ఐదు వేల మందికి పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఆర్డర్ ఇచ్చిన రోజునే తమ సరుకులను డెలివరీ చేస్తామని చెప్పారు.
కాగా, యాడ్‌రోబ్ ఆండ్రాయిడ్ యాప్‌ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇప్పటికే ఐదువేల మందికి పైగా దీనిని డౌన్‌లోడ్ చేసుకున్నారు. ఈ ఏడాది ముగింపు నాటికి నగరాలకు విస్తరిస్తామని చెప్పారు. ఇందుకోసం తొలిసారి నిధుల సమీకరణ చేయాలని నిర్ణయించుకున్నామన్నారు.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications