బెంగుళూరు: భారత ఐటీ రంగంలో అత్యధిక పారితోషకం అందుకుంటున్న సీఈఓల జాబితాలో ఇన్ఫోసిస్ సీఈఓ విశాల్ సిక్కా చేరారు. ఏడాదికి 11 మిలియన్ డాలర్ల జీతాన్ని అంటే సుమారు రూ. 75 కోట్ల జీతాన్ని విశాల్ సిక్కా అందుకున్నారు. ఇటీవల కాలంలో ఆర్ధిక ఫలితాల్లో ఇన్ఫోసిస్ మంచి ఫలితాలను ప్రకటిస్తుంది.
ఈ క్రమంలో తొలుత సుమారు రూ. 54 కోట్లు ( 7.8 మిలియన్ డాలర్లు) ఉండే విశాల్ సిక్కా పారితోషికం అమాంతం పెరిగిపోయింది. సిక్కాకు ఏడాదికి 11 మిలియన్ డాలర్లు ప్యాకేజి ఉండగా, అందులో మిలియన్ డాలర్లను బేసిక్ శాలరీగా నిర్ణయించారు.

మరో 3 మిలియన్ డాలర్లను వేరియబుల్ పే, 2 మిలియన్ డాలర్ల స్టాక్ ఆప్షన్లు, మరో 5 మిలియన్ డాలర్లు స్టాక్ ఆప్షన్స్ కలిపి మొత్తం 11 మిలియన్ డాలర్ల వేతనాన్ని సిక్కా ప్రస్తుతం పొందుతున్నారు. దీంతో భారత ఐటీ దిగ్గజాల్లోని అత్యధిక వేతనం పొందుతున్న కాగ్నిజెంట్ సీఈఓ ఫ్రాన్సిస్కో డిసౌజా 2014-15 సంవత్సరానికి గాను (11.3 మిలియన్ డాలర్లు)కు దగ్గరకు చేరుకున్నారు.
కాగా 2013-14 సంవత్సరంలో టీసీఎస్ సీఈఓ ఎన్ చంద్రశేఖరన్ ప్యాకేజి 3.15 మిలియన్ డాలర్లు, అదే సంవత్సరం షేర్లు మినహా మాజీ విప్రో చీఫ్ టి.కె. కురియన్ ప్యాకేజీ 1.5 మిలియన్ డాలర్లు ఉన్నట్లు తాజా లెక్కల ప్రకారం తెలుస్తోంది.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..



Click it and Unblock the Notifications