'లక్ష్యాన్ని చేరుకున్నాం': కేంద్ర ఖజానాకు భారీ ఆదాయం
న్యూఢిల్లీ: ప్రభుత్వం బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న తరుణంలో కేంద్రానికి ఊరట కలిగించే విషయం. చాలా ఏళ్ల తర్వాత పన్ను వసూళ్ల లక్ష్యాన్ని ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ అధిగమించింది. ఈ విషయాన్ని కేంద్ర రెవెన్యూ శాఖ కార్యదర్శి హస్ముఖ్ అధియా తన ట్విట్టర్‌లో వెల్లడించారు.
2015 -16 సంవత్సరానికి గాను పరోక్ష పన్నుల ఆదాయం సుమారు రూ. 40 వేల కోట్లకు పైగా వసూలవుతుందన్నారు. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో మొత్తం మీద టాక్స్ రెవెన్యూ లక్ష్యాన్ని 100 శాతం అందుకుంటామని, పన్ను విభాగానికి చెందినంతవరకూ 2015-16 ఓ విజయవంతమైన సంవత్సరంగా అభవర్ణించారు.

గత రెండేళ్లుగా పరోక్ష పన్నుల వసూళ్ల లక్ష్యాలను ఆదాయపు పన్ను శాఖ అందుకోలేక పోయిన సంగతి తెలిసిందే. దీంతో లక్ష్యాన్ని కుదించిన కేంద్రం, మొత్తం రూ. 14.99 లక్షల కోట్లను పన్నుల రూపంలో వసూలు చేయాలని నిర్ణయించింది.
ఇందులో రూ. 7.97 లక్షల కోట్ల ప్రత్యక్ష పన్నులు (కార్పొరేట్, ఆదాయపు పన్ను), రూ. 6.47 లక్షల కోట్లు పరోక్ష పన్ను (కస్టమ్స్, ఎక్సైజ్, సేవా పన్ను) రూపంలో ఉంటాయని గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో ఇప్పటి వరకూ రూ. 7.05 లక్షల కోట్ల ప్రత్యక్ష, రూ. 5.42 లక్షల కోట్ల పరోక్ష పన్నులను ఆదాయపు పన్ను శాఖ వసూలు చేసింది.


Click it and Unblock the Notifications