చెన్నై: ప్రముఖ చౌకధరల విమానయాన సంస్థ ఎయిర్ ఏషియా.... హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డుదారులకు ప్రత్యేక డిస్కౌంట్ ఆఫర్‌ను అందిస్తోంది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డులను కలిగి ఉన్న వినియోగదారులకు విమాన చార్జీల్లోని బేస్ ధరలో 20 శాతం డిస్కౌంట్ ఆఫర్ చేస్తున్నామని ఎయిర్ ఏషియా ఒక ప్రకటనలో తెలిపింది.
ఫిబ్రవరి 21 వరకూ చేసుకునే బుకింగ్స్‌కు ఈ ఆఫర్ వర్తిస్తుందని పేర్కొంది. ఈ ప్రమోషనల్ ఆఫర్‌లో భాగంగా ఈ ఏడాది జులై 1 నుంచి సెప్టెంబర్ 30 వరకూ తేదీల్లో ప్రయాణించాల్సి ఉంటుందని ఎయిర్ ఏషియా ఇండియా సీఈఓ, ఎండీ మిట్టు చాండిల్య పేర్కొన్నారు.

కస్టమర్లు తన సీట్లను బుక్ చేసుకునేందుకు గాను ఈ ప్రత్యేక ఆఫర్ కోసం www.airasia.com/hdfcpromo వెబ్‌సైట్‌ను వీక్షించొచ్చు. గోవా, కొచ్చి, ఛత్తీస్‌గడ్, విశాఖపట్నం, జైపూర్, గౌహతి లాంటి భారత్‌లోని సిటీల్లో ప్రయాణించే వారికి కూడా ఈ ప్రత్యేక ఆఫర్ వర్తిస్తుందని పేర్కొన్నారు.
ఏయిర్ ఏషియా ఇండియా, ఎయిర్ ఏషియా బెర్హాద్, ఎయిర్ ఏషియా ఎక్స్, థాయ్ ఎయిర్ ఏషియా విమాన సర్వీసులకు ఈ ఆఫర్ వర్తిస్తుందని వివరించారు. అందరికీ విమానయానం తమ లక్ష్యమని, అందుకు ఈ ఆఫర్లనిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications