హైదరాబాద్: ప్రముఖ క్యాబ్ సర్వీసుల సంస్ధ ఓలా పూణె, హైదరాబాద్‌లో క్యాబ్ షేరింగ్ సర్వీసులను ప్రారంభించింది. దీంతో ఇండియాలోని ఏడు పట్టణాల్లో ఓలా షేరింగ్ సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి. ఇప్పటికే బెంగుళూరు, ఢిల్లీ, ముంబై, కోల్‌కత్తా, చెన్నై పట్టణాల్లో ఓలా సంస్ధ ఈ సర్వీసులను అందిస్తోంది.
ఓలా యాప్ ద్వారా ఒక వాహనంలో ఒకే మార్గంలో వేర్వేరు వ్యక్తులు ప్రయాణించడాన్నే షేరింగ్‌గా పిలుస్తుంటాం. ఎవరైనా ప్రయాణికులు ఒకే మార్గంలో క్యాబ్‌లో వెళ్లాలని భావిస్తే, ఒక రైడ్‌లో ముగ్గురు వరకూ క్యాబ్‌లో వెళ్లేలా ఓలా షేరింగ్‌లో కొత్త ప్రణాళికలను తీసుకొచ్చింది.

కస్టమర్లు ఓలా యాప్‌లో రైడ్ నౌ ద్వారా షేరింగ్ బటన్‌ను నొక్కి వెళ్లాల్సిన ప్రాంతం పేరు టైప్ చేస్తే సరిపోతుంది. అయితే ఓలా షేరింగ్‌లో అయ్యే చార్జీని ప్రయాణానికి ముందు డ్రైవర్‌కు చెల్లించాల్సి ఉంటుంది. లాంచింగ్ ఆఫర్‌లో భాగంగా ప్రయాణ చార్జీల్లో 50 శాతం వరకు ఆదా చేసుకోవచ్చని కంపెనీ వెల్లడించింది.
ఓలా షేరింగ్‌లో పూర్తి స్థాయిలో ఓలా సెక్యూరిటీ ఫీచర్లైన ట్రాక్ యువర్ రైడ్, షేర్ రైడ్ వివరాలు, ఎమర్జెన్సీ కాంటాక్ట్స్ లాంటి వాటి గురించి యాప్‌లో తెలుసుకోవచ్చు. భారత్‌లో రాబోయే రోజుల్లో షేరింగ్ మొబిలిటీ కీలక పాత్ర పోషిస్తుందని ఓలా కేటగిరి హెడ్ ఇషా గుప్తా తెలిపారు. ఓలా యాప్‌లో ఓలా షేర్ ప్రత్యేకమైన కేటగిరిగా విభజించామన్నారు.
More From GoodReturns

విజయవాడ - హైదరాబాద్ హైవే అప్డేట్.. పనులు ఎక్కడి దాకా వచ్చాయంటే..

Hyderabad: సిటీలో అతిపెద్ద డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్.. ఇక ఆ రూట్లో ట్రాఫిక్ కష్టాలుండవ్!

హైదరాబాద్‌లో పెట్రోల్, డీజిల్ కొరత.. క్లారిటీ ఇచ్చిన పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్..

Hyderabad: హైదరాబాద్‌లో పెట్రోల్ కష్టాలు.. బంకుల దగ్గర భారీ క్యూలు.. అసలు కారణం ఇదే!

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications