For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అత్యంత విలువైన కంపెనీ: యాపిల్‌ను దాటిన ఆల్ఫాబెట్

By Nageswara Rao
|

ప్రపంచంలో అత్యంత విలువైన కంపెనీగా గూగుల్ పేరెంట్ కంపెనీ ఆల్ఫాబెట్ నిలిచింది. కంపెనీ ప్రకటించిన Q4 ఫలితాల్లో ఆల్ఫాబెట్ మెరుగైన ఆర్ధిక ఫలితాలను సాధించడం, షేర్ల విలువ ప్రకారం చూస్తే ప్రపంచంలోనే అత్యధిక మార్కెట్ విలువ కలిగిన కంపెనీగా యాపిల్‌ను వెనక్కినెట్టి అగ్రస్థానంలో నిలిచింది.

సోమవారం ట్రెడింగ్ ముగిసిన తర్వాత యాపిల్‌ మార్కెట్‌ విలువ 535 బిలియన్‌ డాలర్లు కాగా ఆల్ఫాబెట్‌ మార్కెట్‌ విలువ 570 బిలియన్ డాలర్లకు చేరింది. ఇదే లాభాలను మంగళవారం కూడా నిలబెట్టుకుంటే, షేర్ మార్కెట్ విలువ పరంగా ప్రపంచంలోనే అతిపెద్ద కంపెనీగా ఆల్ఫాబెట్‌ అధికారికంగా నిలుస్తుంది.

ఇటీవల కాలంలో ఆన్‌లైన్‌ ప్రకటనల ఆదాయం ఊతంగా నిలవడంతో డిసెంబర్ త్రైమాసికానికి సంబంధించిన లాభం 5శాతం వృద్ధి చెంది 4.92 బి. డాలర్లుగా నమోదయింది. ఇటు పీసీలు, అటు మొబైల్ పరికరాల విభాగాల్లోను ప్రకటనల ఆదాయం గణనీయంగా వచ్చినట్లు గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ తెలిపారు.

2010, ఫిబ్రవరిలో యాపిల్‌తో పోలిస్తే, గూగుల్ కంపెనీ అత్యంత విలువైన కంపెనీగా అవతరించింది. ఆ సమయంలో రెండు కంపెనీల మార్కెట్ విలువ 200 బిలియన్లగా ఉంది. ఆ సమయంలో యాపిల్ కంపెనీ తన తొలి ఐప్యాడ్‌ని మార్కెట్లోకి విడుదల చేసేందుకు సిద్ధంగా ఉంది.

English summary

అత్యంత విలువైన కంపెనీ: యాపిల్‌ను దాటిన ఆల్ఫాబెట్ | Google parent Alphabet passes Apple market cap at the open

Shares of Alphabet opened nearly 3 percent higher Tuesday, pushing the technology giant's market capitalization past Apple to become the world's most valuable public company.
Story first published: Wednesday, February 3, 2016, 13:26 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X