ఫ్లయిట్ మిస్ అయ్యిందా?: స్పైస్‌జెట్ 'ఫ్లయ్ ఫర్ షూర్'కు వెళ్లండి

ముంబై: ప్రముఖ చౌక ధరల విమానయాన సంస్ధ స్పైస్‌‌‌జెట్ ప్రయాణికుల కోసం 'ఫ్లయ్ ఫర్ షూర్' అనే కొత్త ఆఫర్‌ను ప్రకటించింది. ఈ ఆఫర్‌లో భాగంగా స్పైస్‌జెట్ సర్వీసుల నిర్వహణలో 90 నిమిషాల జాప్యం జరిగినా లేదా ఫ్లయిట్ రద్దైనా ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా చూస్తుంది.

ఈ సందర్భంలో ప్రయాణికులు ఇరవై నాలుగు గంటలలోగా మరో ప్రత్యామ్నాయ ఎయిర్ లై‌న్స్‌లో ప్రయాణించేందుకు వీలుగా నగదు రీయింబర్స్ చేస్తామని ప్రకటించింది. అయితే 'ఫ్లయ్ ఫర్ షూర్' ఆఫర్ కొన్ని నిబంధనలకు లోబడి వర్తిస్తుంది.

ఇటీవల కాలంలో వాతవరణం సహకరించక పోవడం లాంటి కారణాలతో విమానాలు రద్దు కావడం లేక జాప్యం జరగడమో అవుతున్న నేపథ్యంలో స్పైస్ జెట్ ఆఫర్‌కు ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే స్పైస్ జెట్ ప్రకటించిన ఈ ఆఫర్‌ను వినియోగించుకునే ప్రయాణికులు టికెట్ బుక్ చేసుకునేటప్పుడే అదనంగా రూ. 299 కట్టాలి.

Missed your SpiceJet flight, fly within 24 hours for just Rs 299

దీనివల్ల విమానం 90 నిమిషాలకు పైగా జాప్యం జరిగినా లేదా విమానం మిస్ అయినా (చెకిన్ సమయం ముగిశాక 30 నిమిషాల గరిష్ట వ్యవధి) ఈ ఆఫర్ వర్తిస్తుందని పేర్కొంది. వేరే విమాన టికెట్టకయ్యే ఖర్చు స్పైస్ జెట్ ప్రయాణికులకు రీయింబర్స్ చేస్తుంది.

టికెట్ నగదుని క్లెయిమ్ చేసుకోవడానికి ప్రయాణం చేసిన తర్వాత ఏడు రోజుల్లోగా నిర్దేశిత పత్రాలు, సమాచారాన్ని స్పైస్ జెట్ సంస్థకు అందజేయాల్సి ఉంటుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+