ముంబై: ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణ మూర్తి జీవిత సాఫల్య పురస్కారం అందుకున్నారు. ఎక్సలెన్స్ ఇన్ కార్పొరేట్ గవర్నెన్స్‌కు సంబంధించి ముంబైలో గురువారం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా (ఐసీఎస్‌ఐ) 15వ జాతీయ అవార్డుల కార్యక్రమం జరిగింది.
ఈ కార్యక్రమంలో నేషనల్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఎస్. రామదొరై చేతుల మీదుగా ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు ఎన్.ఆర్. నారాయణ మూర్తి ‘లైఫ్‌టైం అచీవ్‌మెంట్' అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా నారాయణ మూర్తి మాట్లాడుతూ సుపరిపాలన, సామాజిక, ఆర్ధిక అభివృద్ధి కొనసాగించడంతో పాటు ప్రజలను సంక్షేమం వైపు ప్రోత్సహించడానికి గుడ్ గవర్నెన్స్ ఒక విధానమన్నారు.

ఈ మధ్య కాలంలో అభివృద్ధి చెందిన దేశాలు సామాజిక, ఆర్ధిక అంశాలపై ఎంతగానో దృష్టి సారించాయన్నారు. కొత్త ఇండియాను తయారు చేసేందుకు గాను గుడ్ గవర్నెన్స్ సాధించే దిశగా యంగ్ ప్రొపెషనల్స్‌కు సూచన చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు.
ప్రస్తుతం నారాయణ మూర్తి ఇన్ఫోసిస్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా కొనసాగుతున్నారు. కె.వి కామత్ ఆ పదవి నుంచి తప్పుకోవడంతో ఆ స్ధానంలో 2013లో నారాయణ మూర్తిని ఎగ్జిక్యూటివ్ బోర్డులోని సభ్యులు ఎంపిక చేశారు. 1981లో ఇన్ఫోసిస్‌ను ప్రారంభించిన నారాయణమూర్తి 2002 వరకు సీఈఓగా పనిచేశారు.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications