విశ్లేషణ: 2016 మార్కెట్‌కు సానుకూలమేనా?
ముంబై: స్టాక్ మార్కెట్ ఎప్పుడు లాభాలను తెలుస్తుందో, ఎప్పుడు నష్టాలను మూటగడుతుందో చెప్పడం కష్టం. 2015లో స్వల్ప లాభాలతో ముగిస్తే, 2014లో 40 శాతం మేర భారీ లాభాలతో ముగిసింది. అయితే ఈ ఏడాది కూడా భారీ లాభాలు వస్తాయని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
ఈ ఏడాది స్థూల ఆర్థిక గణాంకాలు మెరుగవుతుండడం, ప్రభుత్వం తీసుకుంటున్న సంస్కరణల చర్యలను బట్టి ఈ ఏడాది మెరుగైన పరిస్థితులు కనిపించవచ్చని అంటున్నారు. కంపెనీల ఫలితాలు సైతం రాణించొచ్చని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో మదుపర్లకు 20 నుంచి 25 శాతం వరకు లాభాలు రావచ్చని అంచనా వేస్తున్నారు.

స్టాక్‌మార్కెట్‌కు సానుకూలమేనా?
2015లో సెన్సెక్స్ 6 శాతం దాకా నష్టపోయింది. ఇందుకు చాలా కారణాలున్నాయి. జీఎస్‌టీ వంటి కీలక బిల్లుల విషయంలో ఆలస్యమైన సంగతి తెలిసిందే. ఆదాయాల వృద్ధి మందగించింది. తొలి భాగంలో ఆర్‌బీఐ కఠిన వైఖరి అవలంబించడంతో అంతర్జాతీయంగా కమొడిటీ మార్కెట్లు పతనమయ్యాయి.

స్టాక్‌మార్కెట్‌కు సానుకూలమేనా?
కానీ ఈ ఏడాది మెరుగ్గా ఉండొచ్చని ఆర్ధిక నిపుణులు భావిస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే తీసుకొచ్చిన సంస్కరణలు ఈ ఏడాదిలో లాభాలను అందజేయవచ్చన్న అంచనా వేస్తున్నారు. ఆర్థిక వ్యవస్థ రికవరీలో మందగమనం ఉన్నా, స్థిరంగా ముందుకెళుతోంది.

స్టాక్‌మార్కెట్‌కు సానుకూలమేనా?
కొన్ని సవాళ్లు ఉన్నప్పటికీ, స్టాక్ మార్కెట్లు పుంజుకోవడానికి సానుకూలత ఉంది. అంతర్జాతీయంగా చూస్తే, ముడి చమురు ధరలు మన ద్రవ్య పరిస్థితిని మరింత మెరుగ్గా ఉండేలా చేయనున్నాయి. తద్వారా మూలధన పెట్టుబడులను ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లడానికి వీలవుతుంది. అంతేకాదు పెద్దమొత్తంలో విదేశీ పెట్టుబడులను ఆకర్షించగలుగుతుంది.

స్టాక్‌మార్కెట్‌కు సానుకూలమేనా?
ఈ రంగాలు రాణంచే అవకాశం ఉంది. వినియోగ సంబంధిత రంగాలు, కంపెనీలు తమ ప్రగతిని కొనసాగించనున్నాయని ఆర్ధిక విశ్లేషకులు అంచనా వేశారు. ఏడో వేతన సంఘం అమలు కారణంగా ప్రజల వద్ద అధికాదాయం చేరడం వల్ల ఈ రంగాలు రాణించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

స్టాక్‌మార్కెట్‌కు సానుకూలమేనా?
ముఖ్యంగా ఈ ఏడాది ప్రజల ఆర్థిక కార్యకలాపాలు పెరుగుతున్నందున ఆర్థిక సేవల కంపెనీలు, ప్రైవేటు రంగ బ్యాంకులు ప్రయోజనం పొందనున్నాయి. వీటితో పాటు వాహన, ప్రైవేటు బ్యాంకింగ్, పట్టణ మౌలిక, ఆరోగ్య సంరక్షణ రంగాలు సైతం ఈ ఏడాది ఓ వెలుగు వెలగనున్నాయి. గతేడాదితో పోలిస్తే వీటి ఆదాయం ఈ సారి పెరగవచ్చన్న అంచనా వేస్తున్నారు.


Click it and Unblock the Notifications