వే2ఎస్‌ఎంఎస్‌ను ‘వే2’గా రీ బ్రాండింగ్: సంస్థ సీఈఓ
ఉచిత అపరిమిత ఎస్‌ఎంఎస్‌లను అందిస్తోన్న కంపెనీ వే2ఎస్‌ఎంఎస్ సంక్షిప్త వార్తల రంగంలోకి ప్రవేశించింది. దీని కోసం ప్రత్యేకించి ‘వే2' పేరుతో ప్రత్యేక యాప్ విడుదల చేసింది. ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుంటే ఎప్పటికప్పుడు తాజా సంక్షిప్త వార్తలను ఉచితంగా ఎస్‌ఎంఎస్‌ల రూపంలో అందుతాయి.
వివిధ పత్రికలు, చానెళ్లలో వచ్చిన ముఖ్య వార్తలను సంక్షిప్త రూపంలో 400 అక్షరాలకు మించకుండా అందిస్తోంది. పూర్తి వార్తను చదవాలనుకునేవారు శీర్షికపై క్లిక్‌చే స్తే చాలు. ప్రస్తుతం ఇంగ్లీషుతో పాటు హిందీ, తెలుగు, మరాఠీ, మలయాళం, తమిళం, బెంగాలీ, గుజరాతీ, కన్నడ భాషల్లో కంపెనీ ఈ సంక్షిప్త వార్తలను అందిస్తోంది.

15 నెలల క్రితం ప్రారంభించిన వే2 యాప్‌ను ఇప్పటికే 50 లక్షల మంది డౌన్‌లోడ్ చేసుకున్నారని కంపెనీ సీఈఓ వానపాల రాజు చెప్పారు. రోజూ ఆరు లక్షల మందికిపైగా తమ సైట్ ద్వారా సంక్షిప్త వార్తలు చూస్తున్నట్లు ఆయన తెలిపారు. వే2 యాప్‌ను ప్రస్తుతం రోజుకి 14,000 మంది ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుంటున్నారన్నారు.
వచ్చే మూడేళ్లలో ఈ యాప్ ద్వారా దాదాపు 10 కోట్ల మంది కస్టమర్లను సంపాదించాలని వే2 భావిస్తోందని తెలిపారు. వే2ఎస్‌ఎంఎస్‌ను కూడా ‘వే2'గా రీ బ్రాండింగ్ చేస్తున్నట్టు ప్రకటించారు. ఎస్‌ఎంఎస్‌ల ద్వారా సంక్షిప్త వార్తలకు దేశంలో మంచి భవిష్యత ఉందని వానపాల రాజు చెప్పారు. ఆన్‌లైన్‌లో వార్తలు చదివేవారి సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో సంక్షిప్త వార్తల రంగంలోకి ప్రవేశిస్తున్నట్టు ఆయన చెప్పారు.


Click it and Unblock the Notifications