న్యూఢిల్లీ: మారుతున్న టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో బ్యాంకులు సైతం ముందు వరుసలో ఉంటున్నాయి. కొత్త కస్టమర్లను సంపాదించుకోవడానికి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటున్నాయి. గతంలో బ్యాంకు అకౌంట్ తెరవాలంటే ఎంతో సమయం పట్టేది.
టెక్నాలజీ ఎంతో అభివృద్ధి చెందడంతో ఈ తరం యువత అంత సమయం కేటాయించడం లేదు. దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వ రంగం బ్యాంకు అయినటువంటి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (యుబిఐ) స్మార్ట్ ఆలోచన చేసింది. ఈ మధ్య కాలంలో స్మార్ట్ ఫోన్ ఉన్న వారు సెల్ఫీలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్న సంగతి తెలిసిందే.

దీన్ని ఆధారంగా చేసుకునే సెల్ఫీతో బ్యాంకు ఖాతాను వెంటనే తెరిచే సదుపాయాన్ని బ్యాంకింగ్ రంగంలోనే తొలిసారిగా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (యుబిఐ) అందుబాటులోకి తెచ్చింది. దీన్ని ఉపయోగించుకుని బ్యాంకు ఖాతా తెరవాలనుకునే వారు ఆండ్రాయిడ్ మొబైల్‌ను వినియోగిస్తుంటే గూగుల్ ప్లేస్టోర్ నుంచి యాపిల్ మొబైల్‌ను వినియోగిస్తున్న వారైతే యాప్ స్టోర్ నుంచి యూనియన్ బ్యాంకు సెల్ఫీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.
యాప్‌ను తెరిచిన తర్వాత వారికి సమీపంలోని శాఖను ఎంచుకోవాలి. యాప్ ద్వారా సెల్ఫీని తీసుకోవాలి. దీనితోపాటు ఆధార్ కార్డును స్కాన్ చేయాల్సి ఉంటుంది. ఖాతాదారుకు సంబంధించిన పుట్టిన తేదీ, ఇతర వివరాలను కూడా నమోదు చేయాల్సి ఉంటుంది.
అంతే యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (యుబిఐ)లో మీరు ఖాతా ఓపెన్ చేసినట్టే. మీరు రిజిస్టర్ చేసుకున్న బ్యాంకు శాఖ వద్దకు వెళితే మీ ఖాతాకు సంబంధించిన వెల్‌కమ్ కిట్‌ను ఇస్తారు. ప్రైవేటు రంగంలోని అన్ని బ్యాంకులు తమ వెబ్‌సైట్ ద్వారా సేవింగ్స్ ఖాతాను తెరిచే సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చాయి.


Click it and Unblock the Notifications