For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అమెరికా సంస్థ ‘విటియోస్’ను చేజిక్కించుకున్న విప్రో

By Nageswara Rao
|

ముంబై: దేశీ ఐటీ దిగ్గజం విప్రో మరింతగా విస్తరిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ఐటీ రంగంలో తన కార్యకలాపాలను సాగిస్తోన్న విప్రో తనకు అనుకూలమైన వివిధ సంస్థలను టేకోవర్ చేసుకుంటూ ముందుకు సాగుతోంది.

తాజాగా అవుట్ సోర్సింగ్ విభాగంలో బాగా పేరుగాంచిన ఆమెరికన్ కంపెనీ ‘విటియోస్' గ్రూపును టేకోవర్ చేసింది. ఈ మేరకు ఇరు కంపెనీల మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పంద విలువ 130 మిలియన్ల అమెరికన్ డాలర్లు.

Wipro to acquire BPaaS provider Viteos Group for $130 mn

2003లో స్థాపించబడిన ‘విటియోస్' కంపెనీ న్యూజెర్సీలోని సోమర్సెట్ ప్రధాన కేంద్రంగా కార్యకలాపాలను కొనసాగిస్తోంది. అమెరికా సహా యూరోప్, ఆసియా దేశాల్లో కార్యకలాపాలు సాగిస్తున్న విటియోస్ 400 మంది ఉద్యోగులతో దూసుకెళ్తోంది.

అమెరికా సహా యూరోప్, ఆసియా దేశాల్లో విటియోస్ కంపెనీ ప్రాసెసింగ్, పోస్ట్-వాణిజ్య కార్యకలాపాలు అనుసంధానించే రంగాలకు చెందిన సర్వీసులను అందిస్తోంది. ఈ కంపెనీని టేకోవర్ చేసిన విప్రో 130 మిలియన్ డాలర్లను చెల్లించనుంది. విటియోస్ టేకోవర్ మార్చి 31తో ముగిసే త్రైమాసికంలోగా పూర్తి కానుందని విప్రో ఆర్థిక విభాగం ప్రెసిడెంట్ షాజీ ఫరూక్ చెప్పారు.

English summary

అమెరికా సంస్థ ‘విటియోస్’ను చేజిక్కించుకున్న విప్రో | Wipro to acquire BPaaS provider Viteos Group for $130 mn

Wipro will acquire Viteos Group, a BPaaS (business process as-a-service)provider for alternative investment management industry for USD 130 million in a all-cash deal. The software company says that the acquisition will expand Wipro's capital markets portfolio in fund accounting services and enhance its business process services capabilities.
Story first published: Wednesday, December 23, 2015, 15:07 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X