బడాబాబులు: అప్పు ఎగవేతదారుల్లో మనోళ్లు(ఫోటోలు)

కార్పోరేట్ రుణాల్లో అత్యధిక బకాయిలు కలిగిన టాప్ టెన్ కంపెనీల్లో తెలుగు వాళ్లవే. ఆ పదింట్లో లాంకో, జీఎంఆర్, జీవీకే తెలుగు రాష్ట్రాలకు చెందిన కంపెనీలే కావడం గమనార్హం. 50 మంది రుణ వేగదారులు ప్రభుత్వ రంగ బ్యాంకులకు ఏకంగా రూ. 40 వేల కోట్ల మేరకు బకాయిలు పడ్డాయని ఏడాది కిందట ఏపీ బ్యాంక్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ (ఏపీబీఈఎఫ్) జాబితా విడుదల చేసింది.

ఆ జాబితాలో మొదటి వరుసలో ఉన్నది ఐసీఎస్ఏ ఇండియా లిమిటెడ్(రూ. 646 కోట్లు). ఆ తర్వాతి వరుసలో ఎంబీఎస్ జువెల్లర్స్ ప్రైవేట్ లిమిటెడ్ (రూ. 524 కోట్లు), ఏపీ రాజీవ్ స్వగృహ కార్పోరేషన్ లిమిటెడ్ (రూ. 385 కోట్లు), ప్రొగ్రెసివ్ కన్ స్ట్రక్షన్స్ లిమిటెడ్ (రూ. 351 కోట్లు), సుజనా యూనివర్సల్ ఇండస్ట్రీస్ (రూ. 330 కోట్లు) ఉన్నాయి.

అప్పు ఎగవేతదారుల్లో మనోళ్లు

అప్పు ఎగవేతదారుల్లో మనోళ్లు

కేవలం ఈ ఐదు కంపెనీలే బ్యాంకులకు రూ. 2742 కోట్ల మేరకు బకాయి పడ్డాయని ఏపీబీఈఎఫ్ వెల్లడించింది. ఇక దేశవ్యాప్తంగా 400 మంది ఎగవేతదారులు ఏకంగా రూ. 70,300 కోట్లు మేరకు బకాయి పడ్డారని అఖిల భారత బ్యాంకు ఉద్యోగుల సంఘం వెల్లడించింది.

అప్పు ఎగవేతదారుల్లో మనోళ్లు

అప్పు ఎగవేతదారుల్లో మనోళ్లు

దేశవ్యాప్తంగా ఈ జాబితాలో అగ్రస్థానంలో కింగ్ ఫిషర్ కంపెనీ ఉంది. కింగ్ ఫిషర్ ఏకంగా రూ. 2673 కోట్ల మేరకు దేశంలోని పలు బ్యాంకులకు బకాయి పడింది. ఇక ప్రముఖ మీడియా సంస్థ దక్కన్ క్రానికల్ హోల్డింగ్స్ బకాయిల మొత్తం 1000 కోట్లకు పైమాటగానే ఉంది.

అప్పు ఎగవేతదారుల్లో మనోళ్లు

అప్పు ఎగవేతదారుల్లో మనోళ్లు

ఇప్పటికే దీని ప్రమోటర్ తిక్కవరపు వెంకట్రామ్ రెడ్డిపై బ్యాంకులు, ఆర్ధిక సంస్థలు పలు కేసులు తాఖలు చేశాయి. ఆస్తులను జప్తు చేసుకునే ప్రయత్నాలు కూడా చేస్తున్నాయి. కాగా కేంద్ర మంత్రి సుజనా చౌదరికి చెందిన సుజనా గ్రూప్‌పై కూడా బ్యాంక్ ఆఫ్ రాజస్థాన్, ఎస్‌బీఐ సిడ్బి రుణాల వసూల కోసం వ్యాజ్యాలు దాఖలు చేసినట్టుగా క్రెడిట్ ఇన్ ఫర్మేషన్ బ్యూరో ఆఫ్ ఇండియా (సిబిల్) డేటా వెల్లడిస్తోంది.

అప్పు ఎగవేతదారుల్లో మనోళ్లు

అప్పు ఎగవేతదారుల్లో మనోళ్లు

గోకరాజు శ్రీనివాస చక్రవర్తి రాజు ప్రమోటర్‌గా ఉన్న వివాదాస్పద వెంచర్ లియో మెరిడియన్ ఇన్‌ఫ్రా ప్రాజక్ట్స్ సుమారు 488 కోట్ల రూపాయలు బకాయిలు పడింది. కాగా ఐ శ్యామ్ ప్రసాద్ రెడ్డి ప్రమోటర్‌గా ఉన్న ఇందూ ప్రాజెక్ట్స్ ఎగవేతల మొత్తం 80 కోట్ల రూపాయలకు పైమాటే.

 అప్పు ఎగవేతదారుల్లో మనోళ్లు

అప్పు ఎగవేతదారుల్లో మనోళ్లు

నరసరావు పేట ఎంపీ రాయపాటి సాంబశివరావుకు చెందిన శ్రీ జయలక్ష్మీ స్పిన్నింగ్ మిల్స్ లిమిటెడ్ 2012 నాటి రికార్డుల ప్రకారమే 121 కోట్ల రూపాయల మేరకు బకాయి పడింది. ఇక టాలీవుడ్ హీరో నాగర్జున మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్న అన్నపూర్ణ స్డూడియోస్‌ను ఆంధ్రాబ్యాంకు ఉద్దేశ పూర్వకంగా రుణం చెల్లించని (విల్‌పుల్ డిఫాల్టర్) గా ప్రకటించింది.

 అప్పు ఎగవేతదారుల్లో మనోళ్లు

అప్పు ఎగవేతదారుల్లో మనోళ్లు

బ్యాంకు రుణాలు, వ్యక్తులు/సంస్ధల క్రెడిట్ రేటింగ్‌కు అత్యంత ప్రామాణికమైన సిబిల్ వెబ్ సైట్ ప్రకారం అన్నపూర్ణ స్డూడియోస్‌ ఒక్క ఆంధ్రా బ్యాంకు లోనే రూ. 222.54 కోట్ల బకాయి పడింది. ఈ బకాయి వసూలుకు ఆంధ్రా బ్యాంకు కేసు కూడా ఫైల్ చేసింది. సిబిల్ వెబ్‌సైట్‌లోని సూట్ ఫైల్డ్ కేసుల విభాగంలో 'అన్నపూర్ణ స్డూడియోస్‌' పేరు కూడా ఉంది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+