నిబంధన మార్పు: ఆధార్ కార్డు స్థానంలో పాన్ కార్డు
న్యూఢిల్లీ: జాతీయ పెన్షన్ పథకం(ఎన్‌పీఎస్) ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన నిబంధనల్లో మార్పులు చేస్తున్నట్లు పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా(పీఎఫ్‌ఆర్‌డీఏ) తెలిపింది.
ఇందులో భాగంగా ప్రస్తుతం ఉన్న ఆధార్ కార్డు స్థానంలో పాన్ కార్డును ప్రవేశపెట్టింది. ఇకపై ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునేవారి నుంచి ధ్రువీకరణ కోసం ఇకపై ఆధార్‌కు బదులుగా ఐటీ శాఖ జారీ చేసే పాన్ కార్డు నెంబర్‌ను సమర్పించాల్సి ఉంటుందని పీఎఫ్‌ఆర్‌డీఏ చైర్మన్ హేమంత్ జీ కాంట్రాక్టర్ స్పష్టం చేశారు.

పైలట్ ప్రాజెక్టు కింద ఆన్‌లైన్‌లో ఎన్‌పీఎస్ దరఖాస్తు కోసం ఆధార్‌నే కేవైసీగా స్వీకరించినప్పటికీ, అక్టోబర్ నెలలో సామాజికి సంక్షేమ పథకాలకు ఆధార్ కార్డును నిర్భంధంగా వినియోగించడంపై గల పరిమితులను ఎత్తివేసిన నేపథ్యంలో నిబంధనల్లో మార్పులు చేసినట్లు ఆయన చెప్పారు.
ఎన్‌పీఎస్‌తో భాగస్వామ్యం గల ఆరు బ్యాంకులైన ఎస్‌బీఐ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాటియాలా, ఓరియెంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సౌత్ ఇండియన్ బ్యాంక్, సిండికేట్ బ్యాంక్ వీటిలో ఎందులో ఆన్‌లైన్ ఖాతా ఉన్న ఎన్‌పీఎస్‌కు ఆన్‌లైన్‌లోనే నమోదు చేసుకోవచ్చు.
పీఎఫ్‌ఆర్‌డీఏ గణాంకాల ప్రకారం ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వోద్యోగులు, ప్రైవేట్ సంస్థల ఉద్యోగులు, అవ్వవస్థీకృత రంగంలోని వారు కలిసి 93,80,174 మంది చందాదారులున్నారు. ఆయా ఖాతాల కింద ఎన్‌పీఎస్ నిర్వహణలో ఆస్తుల విలువ 1,02,878 కోట్ల రూపాయిలుగా ఉంది.


Click it and Unblock the Notifications