6వ స్థానం: ఊపందుకున్న హైదరాబాద్ రియల్టీ (ఫోటోలు)
హైదరాబాద్: రియల్ ఎస్టేట్ పెట్టుబడుల కన్సల్టెన్సీ నైట్‌ఫ్రాంక్ నిర్వహించిన తాజా సర్వేలో హైదరాబాద్ తొలిసారి ఆరో స్థానంలో నిలిచింది. 2010 సంవత్సరపు నివేదికలో రియల్టీ పెట్టుబడలకు ఆకర్షణీయమైన నగరాలుగా ముంబై, పూణె, చెన్నై, బెంగుళూరు, ఎన్‌సీఆర్‌లు ఉండగా 2016 సంవత్సరానికి గాను రూపొందించిన నివేదికలో హైదరాబాద్ 6వ స్ధానంలో నిలిచింది.
గత కొన్నేళ్లుగా సాగిన ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం, అంతర్జాతీయ మాంద్యం ప్రభావం వల్ల హైదరాబాద్ రియల్టీ రంగం దెబ్బతిందని, ఆ తర్వాత క్రమక్రమంగా సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయని నైట్ ఫ్రాంక్ చీఫ్ ఎకనామిస్ట్, నేషనల్ డైరెక్టర్ సమంతక్ దాస్ చెప్పారు.

6వ స్థానం: ఊపందుకున్న హైదరాబాద్ రియల్టీ
హైదరాబాద్‌లో ఇన్‌ఫ్రా నానాటికీ మెరుగుపడుతూ ఉండడంతో పాటు స్టార్ట్‌ప్‌లు పెద్ద సంఖ్యలో ఏర్పాటవుతూ ఉండడం వల్ల ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ఆయన పేర్కొన్నారు. కొత్త ఐటీ కారిడార్లకు చేరువలో ఉన్నందువల్ల పుప్పాల్ గూడ, నార్సింగి ప్రాంతాల్లో ధరలు సమీప భవిష్యత్తులో విశేషంగా పెరిగే ఆస్కారం ఉన్నదని అంచనా వేశారు.

6వ స్థానం: ఊపందుకున్న హైదరాబాద్ రియల్టీ
ప్రస్తుతం ఆ ప్రాంతాల్లో చదరపు అడుగు 2,900 రూపాయలకు అందుబాటులో ఉండగా 2020 నాటికి 4,100 రూపాయలు పలిక్ ఆస్కారం ఉన్నట్టు తమ నిపుణులు అంచనా వేశారని ఆయన అన్నారు. రానున్న రోజుల్లో ఆ ప్రాంతాల్లో జీవన ప్రమాణాలు పరంగా స్పష్టమైన మార్పు కనిపించబోతున్నదని, రియల్టీకి మంచి అవకాశలున్న ఆరు నగరాల్లో ఎంపిక చేసిన 11 ప్రదేశాల్లో పుప్పాల్ గూడ, నార్సింగి 11వ స్థానంలో నిలిచాయని సమంతక్ దాస్ చెప్పారు.

6వ స్థానం: ఊపందుకున్న హైదరాబాద్ రియల్టీ
ప్రస్తుతం హైటెక్ సిటీ, గచ్చిబౌలి వంటి ప్రదేశాలు భాగంగా ఉన్న హైదరాబాద్ పడమటి ప్రాంతంలో 5.2 కోట్ల చదరపు అడుగులు జత కాబోతున్నాయని నైట్ ఫ్రాంక్ హైదరాబాద్ డైరెక్టర్ వాసుదేవన్ అయ్యర్ చెప్పారు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది కొత్త ప్రాజెక్టల సంఖ్య 13 వేల నుంచి 10 వేలకు తగ్గిందని ఆయన తెలిపారు.

6వ స్థానం: ఊపందుకున్న హైదరాబాద్ రియల్టీ
తాజాగా జత అయినా వాటితో కలిపి జంటనగరాల్లో ఇప్పటికీ 30 వేల ఫ్లాట్లు ఖాళీగా ఉన్నట్టు ఆయన చెప్పారు. అయితే మౌలికవసతులు, ఉపాధి అకాశాలకు దూరంగా ఉన్న ప్రాంతాల్లో తప్పితే మిగతా ప్రాంతాల్లో కొనుగోళ్లు ఫర్వాలేదని ఆయన చెప్పారు.

6వ స్థానం: ఊపందుకున్న హైదరాబాద్ రియల్టీ
త్వరలో పూర్తి కానున్న మెట్రోరైలు, ఇతర మౌలికి వసతులు పెరిగితే ఉప్పల్, ఎల్‌బీ నగర్, ఫలక్ నుమా లాంటి ప్రాంతాల్లో కూడా రియల్టీ ప్రోత్సాహకరంగా మారుతుందని ఆయన పేర్కొన్నారు. జాతీయ స్థాయిలో రియల్టీ పెట్టుబడులకు అనువైన ప్రాంతాల్లో ముంబై ఎప్పటిలాగే అగ్రస్థానంలో నిలిచింది.


Click it and Unblock the Notifications