న్యూఢిల్లీ: ఆర్ధిక విశ్లేషకులు ఊహించిందే జరిగింది. అగ్రరాజ్యం అమెరికా వడ్డీరేట్లను పావుశాతం పెంచింది. ఈ విషయాన్ని అమెరికా ఫెడరల్ రిజర్వ్ భారత కాలమానం ప్రకారం బుధవారం అర్ధరాత్రి తర్వాత ప్రకటించింది. తొమ్మిది సంవత్సరాల తర్వాత తొలిసారిగా వడ్డీరేట్లను సవరించినట్లు ఫెడరల్ రిజర్వ్ ఛైర్మన్ జానెట్ యెల్లన్ వెల్లడించారు.
తద్వారా 2007-09 నాటి ఆర్థిక మాంద్యం చేసిన గాయాల నుంచి యూఎస్ పూర్తిగా బయటపడిందన్న సంకేతాలను పంపింది. వడ్డీరేట్ల పెంపుపై గడిచిన రెండు రోజులుగా జరిగిన సమావేశంలో తుది నిర్ణయం తీసుకున్నారు. అమెరికా ఆర్థిక వ్యవస్థ కుదుటపడుతుండటంతో పాటు గడిచిన నాలుగు నెలలుగా నిరుద్యోగ గణాంకాలు అంచనాలకుమించి నమోదవుతుండటంతో వడ్డీరేట్లను సవరించినట్లు ఆమె వెల్లడించారు.
ఆర్థిక మాంద్యం చుట్టుముట్టడంతో 2006లో వడ్డీరేట్లను సున్న శాతానికి తగ్గించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత దేశ పరిస్థితుల్లో ఎలాంటి మార్పులు చోటు చేసుకోకపోవడంతో వడ్డీరేట్లు యథాతథంగానే కొనసాగించింది. వడ్డీరేట్లను పావు శాతం నుంచి అరశాతం వరకు పెంచుతున్నట్లు వస్తున్న ఊహాగానాలకు ఎట్టకేలకు తెరపడినట్లు అయింది.

వడ్డీరేట్లను పావుశాతం పెంచిన అమెరికా ఫెడ్
ప్రస్తుతం యూఎస్ వడ్డీ రేటు కనిష్ఠంగా 0, గరిష్ఠంగా 0.25 శాతం ఉండగా, దాన్ని 0.25 శాతం నుంచి 0.50 శాతానికి పెంచుతున్నట్టు వివరించారు. "అమెరికా ఆర్థిక వ్యవస్థ పనితీరు సంతృప్తికరంగా ఉంది. కమిటీ న్యాయ నిపుణులు స్వల్పంగానైనా ఫెడరల్ ఫండ్ రేట్లు పెంచాలని భావించారు" అని యెల్లెన్ మీడియాకు వివరించారు.

వడ్డీరేట్లను పావుశాతం పెంచిన అమెరికా ఫెడ్
లేబర్ మార్కెట్ పరిస్థితులు సైతం మెరుగ్గా ఉన్నాయని, నిరుద్యోగ రేటు 5 శాతం కన్నా కిందకు వచ్చిందని, ద్రవ్యోల్బణం సమీప భవిష్యత్తులో 2 శాతాన్ని మించవన్న అంచనాలు సైతం వడ్డీ పెంపు నిర్ణయానికి సహకరించాయని ఆమె పేర్కొన్నారు.

వడ్డీరేట్లను పావుశాతం పెంచిన అమెరికా ఫెడ్
ఫెడ్ వడ్డీరేట్ల పెంపు భారత్‌పై తీవ్ర ప్రభావం చూపనుంది. ఫెడ్ రేట్ల పెంపు అంచనాలతో ఇండియన్ ఈక్విటీ, బాండ్ మార్కెట్లు గడిచిన రెండు వారాల నుంచి తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నాయి. దేశీయ కార్పొరేట్ కంపెనీలు విదేశాల నుంచి సేకరించిన రుణాల భారం మరింత పెరగనుంది.

వడ్డీరేట్లను పావుశాతం పెంచిన అమెరికా ఫెడ్
ఎందుకంటే ఫెడ్ రేట్ల పెరుగుదలతో రుణాలపై విధించే వడ్డీరేట్లు కూడా పెరగనున్నాయి. అంతేకాదు అంతర్జాతీయ మార్కెట్లో అమెరికన్ డాలర్ విలువ మరింత పెరగనుంది, దీంతో డాలర్ రూపంలో రుణాలను తిరిగి చెల్లించాల్సి వచ్చినప్పుడు స్థానిక కర్సెన్సీ రూపంలో గతంలో కంటే అధికంగా వెచ్చించాల్సి ఉంటుంది.

వడ్డీరేట్లను పావుశాతం పెంచిన అమెరికా ఫెడ్
గతంలో మూడుసార్లు ఫెడ్ రిజర్వ్ వడ్డీరేట్లను పెంచినప్పుడు మూడునెలలపాటు వర్ధమాన దేశాలన్నింటిలోకెల్లా భారత మార్కెట్లే అత్యుత్తమ పనితీరు కనబర్చాయి. కానీ కార్పొరేట్ కంపెనీల విదేశీ రుణభారం గుట్టల్లా పేరుకుపోయిన నేపథ్యంలో ఈసారి మన మార్కెట్లు ర్యాలీ తీయకపోవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.
More From GoodReturns

హార్ముజ్ జలసంధిపై ఇరాన్ కీలక ప్రకటన..శత్రుదేశాల నౌకలకు ప్రవేశం లేదని స్పష్టం చేసిన టెహ్రాన్..

అమెరికాతో చర్చలేమి జరగలేదు..ట్రంప్ వ్యాఖ్యలను ఖండించిన ఇరాన్.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిందనే భయంతోనే..

చిన్న పొదుపు పథకాలపై కొత్త వడ్డీ రేట్లు విడుదల చేసిన కేంద్రం.. PPF, NSC వడ్డీ రేట్లు ఎలా ఉన్నాయంటే..

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications