భారత్‌లో తొలి గోల్డ్ ఎక్స్ఛేంజ్ ఏర్పాటుకు సన్నాహాలు
ముంబై: భారత్‌లో తొలిసారిగా ఫిజికల్ గోల్డ్ ఎక్సేంజ్‌ను ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ముంబై కేంద్రంగా పనిచేస్తున్న ఇండియా బులియన్ అండ్ జ్యూయెలర్స్ అసోసియేషన్ (ఐబీజేఏ) వచ్చే సంవత్సరంలో ఫిజికల్ గోల్డ్ ట్రేడింగ్ ఎక్స్ఛేంజ్‌ని ప్రారంభించనుంది.
ప్రపంచంలోనే బంగారాన్ని వినియోగిస్తున్న దేశాల్లో భారత్ రెండోదని, బంగారం మార్కెట్ ను మరింత పారదర్శకం చేసేందుకు గోల్డ్ ట్రేడింగ్ ఎక్స్ఛేంజ్‌ని ఉపయోగపడుతుందని తెలిపారు. ఫిజికల్ గోల్డ్ ఎక్స్ఛేంజ్ ఏర్పాటు చేయడం ద్వారా ప్రతి రోజూ జరిగే బంగారం విషయంలో సరసమైన ధర సాధ్యమవుతుందని ఐబీజేఏ ప్రతినిధి కేతన్ షరాఫ్ వెల్లడించారు.

భారత్‌లో తొలి గోల్డ్ ఎక్స్ఛేంజ్ ఏర్పాటుకు సన్నాహాలు
మరో ఆరు నెలల్లో ఈ ఎక్స్ఛేంజ్ ను ప్రారంభించాలనే యోచనలో ఉన్నట్టు ఆయన తెలిపారు. ఓనర్‌షిప్, విధివిధానాలపై ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. తొలి దశలో మూడు డెలివరీ సెంటర్లతో సేవలను ప్రారంభించే యోచనలో ఉన్నట్టు వెల్లడించారు.

భారత్‌లో తొలి గోల్డ్ ఎక్స్ఛేంజ్ ఏర్పాటుకు సన్నాహాలు
ఈ ఫిజికల్ ఎక్స్ఛేంజ్‌లో జ్యూయెలర్లు, రిటెయిలర్లు, రిఫైనర్లు, బ్యాంకులు, ప్రజలు ఎవరైనా బంగారం ఏ రూపంలో ఉన్నా కొనుగోళ్లు, అమ్మకాలు జరిపేందుకు వీలుంది. ముఖ్యంగా ఈ తరహా ఎక్స్ఛేంజ్ ఉండాలని చిన్న వ్యాపారుల నుంచి ఎంతో కాలంగా డిమాండ్ వస్తున్నట్టు ముంబై జ్యూయెలర్స్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ కుమార్ జైన్ వ్యాఖ్యానించారు.

భారత్‌లో తొలి గోల్డ్ ఎక్స్ఛేంజ్ ఏర్పాటుకు సన్నాహాలు
బంగారం వినిమయంలో నెంబర్ వన్ స్థానంలో ఉన్న చైనాలో ప్రస్తుతం ఇదే తరహా విధానంలో బంగారం లావాదేవీలు జరుగుతున్నాయన్నారు. ప్రస్తుతం భారత్‌లో వివిధ పట్టణాల్లో 10 గ్రాముల బంగారం ధరలో రూ. 500 వరకూ వ్యత్యాసంతో నమోదవుతున్న సంగతి తెలిసిందే.

భారత్‌లో తొలి గోల్డ్ ఎక్స్ఛేంజ్ ఏర్పాటుకు సన్నాహాలు
ఇక ఫిజికల్ గోల్డ్ ఎక్స్ఛేంజ్ వచ్చి, డెలివరీ సెంటర్లు పెరిగితే, ఎక్కడైనా ఒకే ధర ఉంటుందని నిపుణులు వ్యాఖ్యానించారు. అయితే ఈ గోల్డ్ ట్రేడింగ్ ఎక్స్ఛేంజ్‌లో పాల్గొనేందుకు బ్యాంకులకు సైతం అవకాశం కల్పించాలని ప్రైవేట్ బ్యాంకర్లు కోరుతున్నారు.


Click it and Unblock the Notifications