ఫ్లిప్‌కార్ట్‌లో 23 మందికి కోటికి పైగా జీతం (ఫోటోలు)
బెంగుళూరు: అనతి కాలంలో ప్రపంచ వ్యాప్తంగా పేరుగాంచిన ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ సంస్థలో 23 మంది ఉద్యోగులు ఏడాదికి కోటి రూపాయలకుపైగా జీతాన్ని తీసుకుంటున్నారు.
అంతేకాదు ఐటీసీ తరహాలో ఫ్లిప్‌కార్ట్ కూడా సీనియర్ ఉద్యోగుల ప్రతిభను గుర్తించి, వారికి భారీ స్థాయిలో వేతనాలిస్తూ ప్రోత్సహిస్తోంది. గతేడాది ఫ్లిప్‌కార్ట్ యాజమాన్యం ఉద్యోగులకు రూ. 476 కోట్ల రూపాయలను చెల్లించినట్టు ఫైలింగ్ ద్వారా తెలిసింది.

ఫ్లిప్‌కార్ట్‌లో 23 మందికి కోటికి పైగా జీతం
2014-15 సంవత్సరానికి గాను ఫ్లిప్‌కార్ట్ చీఫ్ పీపుల్ ఆఫీసర్ (సీపీఓ) మెకిన్ మహేశ్వరి 18.73 కోట్ల రూపాయల వేతనాన్ని అందుకున్నట్టు ఐటీ శాఖకు చేసిన ఫైలింగ్‌లో పేర్కొంది.

ఫ్లిప్‌కార్ట్‌లో 23 మందికి కోటికి పైగా జీతం
హిందుస్తాన్ యునిలివర్ ఎండీ సంజీవ్ మెహతా, ఐటీసీ చైర్మన్ దేవేశ్వర్ వంటి టాప్ ఎగ్జిక్యూటివ్‌ల వేతనాలతో పోలిస్తే మహేశ్వరి భారీ మొత్తంలో వేతనం తీసుకుంటోంది. ఇది ఇలా ఉంటే మెకిన్ మహేశ్వరి గత సెప్టెంబర్‌లో ఈ పదవి నుంచి వైదొలగి ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ సంస్థకు సలహాదారుగా వ్యవహరిస్తున్నారు.

ఫ్లిప్‌కార్ట్‌లో 23 మందికి కోటికి పైగా జీతం
గతేడాది హిందుస్తాన్ యూనిలివర్ కంపెనీలో 169 మంది ఎగ్జిక్యూటివ్‌లు ఎనిమిదంకెల జీతాన్ని తీసుకోగా, ఇన్ఫోసిస్‌లో 123 మంది, విప్రోలో 70 మంది ఉద్యోగులు మాత్రమే కోటి రూపాయలకుపైగా జీతాన్ని తీసుకున్నారు.

ఫ్లిప్‌కార్ట్‌లో 23 మందికి కోటికి పైగా జీతం
ఈ ఏడాది ఈ కామర్స్ కంపెనీల్లో 500 మందికి పైగా ఎగ్జిక్యూటివ్‌లు కోటి రూపాయల వేతనాలను తీసుకోబోతున్నారని ఆర్‌జీఎఫ్ ఎగ్జిక్యూటివ్ సెర్చ్, లాంగ్‌హౌస్ కన్సల్టింగ్ సంస్ధలు పేర్కొన్నాయి. అయితే టాప్ ఎగ్జిక్యూటివ్‌లు అందుకుంటున్న భారీ స్థాయి వేతనాలకు తగ్గట్టుగానే తమ లక్ష్యాలను అందుకోవాల్సి ఉంటుందని, నిరంతరం ఒత్తడి ఉంటుందని పేర్కొంది.


Click it and Unblock the Notifications